
Prabhas Bujji: ప్రభాస్ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్
Building a Superstar BUJJI: ఎట్టకేలకు ప్రభాస్ బుజ్జీ ఎవరో తెలిసిపోయింది. రెండు రోజులుగా బుజ్జీ అంటూ అందరిలో ఆసక్తి పెంచిన సంగతి తెలిసిందే.దీంతో సోషల్ మీడియాలో దీనిపై చర్చ నడుస్తుంది.

Kalki Team Release Prabhas Bujji Video: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెండు రోజులుగా బుజ్జీ అంటూ అందరిలో ఆసక్తి పెంచిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో దీనిపై చర్చ నడుస్తుంది. ఇంతకీ ఎవరా బుజ్జి అని అంతా ఆరా తీస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బుజ్జిని పరిచయం చేస్తామంటూ 'కల్కి 2898 AD' టీం ప్రకటన ఇచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల బుజ్జీని పరిచయం లేటు అయ్యిందంటూ కొన్ని గంటలు క్రితం ఓ పోస్ట్ కూడా చేసింది. ఇక ఫైనల్ ప్రభాస్ బుజ్జీ గురించి మూవీ టీం తాజాగా ఓ ఆసక్తికర వీడియో వదిలింది. ఇందులో మూవీ క్రూ అంతా బుజ్జి గురించే మాటాడుతూ మరింత ఆసక్తి పెంచారు.
అయితే ఇందులో ఓ గ్యాడ్జెట్ మూవీ టీంతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ వీడియోలో మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్న దత్ నుంచి కల్కి సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు బుజ్జి గురించే మాట్లాడుకుంటారు. ఇక ఈ వీడియో చివరిలో ప్రభాస్ కనిపిస్తాడు. అప్పుడే "ఆ గ్యాడ్జెట్ ఇంకా నా లైఫ్ అంతే బాడీ లేకుండా బతికేయాల్సి వస్తుందేమో" అనడంతో.. నీ టైం స్టార్ట్ అయ్యింది బుజ్జి పదా అంటాడు. అలా కారు దగ్గరికి వెళ్లి దానిపై ఉన్న కవర్ తీసేస్తాడు. అంటే రెండు రోజులుగా బుజ్జి బుజ్జి అని చెబుతుంది ఈ కారు గురించే అని తెలుస్తోంది. ఇదే ఆ ట్రైం ట్రావెలర్ మెషిన్? అని అభిప్రాయపడుతున్నారు. బుజ్జి అంటే ఈ వాహనమే అయ్యింటుందని వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది.
ఈ వీడియో ఇంకా బుజ్జిని మాత్రం పరిచయం చేయకుండ ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీం. చివరిలో బుజ్జిని మే 22న పరిచయం చేస్తామంటూ స్పష్టం చేశారు. ఇది జస్ట్ బుజ్జి ప్రొమో వీడియో అని మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియోను From Skratch EP4: Building A Superstar BUJJI అంటూ మూవీ టీం రిలీజ్ చేసింది. ఇక ఈ వాహనం డైలాగ్స్‌కి 'మహానటి' కీర్తి సురేష్ తన వాయిస్ ఇచ్చింది. ఈ క్రమంలో వీడియోలో బుజ్జి మేకింగ్‌కి సంబంధించిన జర్నీలో కల్కి టీం చూపించబోతుందని ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. ఇక మధ్య మధ్యలో బుజ్జి మాట్లాడుతూ.. ఒక టైర్‌ని తయారు చేయడానికి ఇంత టైం తీసుకున్నారు. ఇక పూర్తి బాడీ చేయడానికి ఎంతకాలం తీసుకుంటారో అంటూ చెప్పిన డైలాగ్ ఆసక్తిగా ఉంది.
పాన్ వరల్డ్ గా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్ వంటి భారీ తారగణం నటిస్తోంది. ఇందులో దీపికా ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. టైం ట్రావెలర్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్‌గా ఫాంటసీ డ్రామా తెరకెక్కిన ఈ సినిమాను దాదాపు రూ. 500 నుంచి రూ. 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను మహాభారతం కాలం నుంచి క్రీ.శ 2898 మధ్య జరిగే 6 వేల సంవత్సరాలను చూపింయబోతున్నారట. ఈ ఊహజనీత ప్రపంచమంతా ఇండియన్ మైథాలజీ చుట్టూ తిరుగుతుందని టాక్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

