అన్వేషించండి

Top Headlines Today: టీడీపీ ఎమ్మెల్యేపై లైంగిక వీడియో వైరల్; ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ - నేటి టాప్ 5 న్యూస్

AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం..

ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు

సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని  ఓ మహిళ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్మీట్ పెట్టి ఆరోపించారు. కోనేటి ఆదిమూలంతో కలిసి ఆమె శృంగారంలో పాల్గొన్న దశ్యాలను విడుదల చేశారు. తన కుటంబాన్ని అంతం చేస్తానని బెదిరించి తనను లోబర్చుకున్నారని ఆమె ఆరోపించారు. తాము టీడీపీలో ఉంటామని.. కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే కావడంతో పలుమార్లు కలిశామని ..  ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బెదిరించారన్నారు. కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరిచారన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులు తట్టుకోలేక తాను పెన్ కెమెరాతో దృశ్యాలను రికార్డు చేశానని చెప్పారు. ఈ వివరాలను  చంద్రబాబు,లోకేష్ కు లేఖ కూడా రాశానని అన్నారు.  ఆదిమూలం లైంగిక వేధింపలపై సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని తెలియడంతో ఎమ్మెల్యేల పలుమార్లు ఫోన్ చేసి బెదిరించారని అందుకే మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తున్నానని చెప్పారు. ఇంకా చదవండి

ఏఐ సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయని.. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్‌లోని (Hyderabad) హెచ్ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 'గ్లోబల్ ఏఐ' సదస్సుకు (Global AI Summit) సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐ రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో చర్చించారు. ఇంకా చదవండి

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

మావోయిస్టులకు గడ్డుకాలం ఉన్నట్టు ఉంది. వరుస ఎన్‌కౌంటర్లు వారికి కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. బుధవారం ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది వరకు మృతి చెందారు. ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు హతమయ్యారు. ఇంకా చదవండి

హృదయ విదారకం - నడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు

విజయవాడలో (Vijayawada) వరదలతో ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయటపడుతున్నాయి. అటు, చిట్టినగర్ (Chitti Nagar) పరిధిలో ఓ 14 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని నడుము లోతు నీటిలో తరలించడం ఆందోళన కలిగించింది. అదృశ్యమైన బాలుడు వరదల్లో విగతజీవిగా మారాడు. బాలుని మృతదేహాన్ని తరలిస్తోన్న సమయంలో ఆ తల్లి గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. అటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయి కొందరు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. ఎలక్ట్రిక్ వస్తువులు, ఇంటి సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయని.. చాలా వరకూ ఫైనాన్స్ మీద తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ జీరో నుంచే ప్రారంభమయ్యాయని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇంకా చదవండి

తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే

వినాయక చవితి అనగానే వాడవాడలో సందడి నెలకొని ఉంటుంది. పండుగ ప్రారంభం నుంచి నిమజ్జనం చేసే వరకు చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఆడుతూ పాడుతూ కులమతాలకు అతీతంగా వేడుకలు నిర్వహిస్తారు. అలాంటి వినాయక చవితి వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desamడేవిడ్ వార్నర్‌ లేకుండానే ఈసారి ఐపీఎల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
KTR Arrest : కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
కేటీఆర్‌ అరెస్టు లేనట్లే -రేవంత్ అందుకే వెనక్కి తగ్గారా ?
Embed widget