(Source: ECI/ABP News/ABP Majha)
Satyavedu TDP MLA : సత్యవేడు ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు - వీడియోలు రిలీజ్ చేసిన బాధితురాలు!
Andhra Pradesh : సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. కొన్ని ప్రైవేటు వీడియోలను మీడియాకు రిలీజ్ చేశారు. బెదిరించి లోబర్చుకున్నారని ఆమె ఆరోపించారు.
Satyavedu TDP MLA of sexual harassment : సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్మీట్ పెట్టి ఆరోపించారు. కోనేటి ఆదిమూలంతో కలిసి ఆమె శృంగారంలో పాల్గొన్న దశ్యాలను విడుదల చేశారు. తన కుటంబాన్ని అంతం చేస్తానని బెదిరించి తనను లోబర్చుకున్నారని ఆమె ఆరోపించారు. తాము టీడీపీలో ఉంటామని.. కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే కావడంతో పలుమార్లు కలిశామని .. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బెదిరించారన్నారు. కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరిచారన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులు తట్టుకోలేక తాను పెన్ కెమెరాతో దృశ్యాలను రికార్డు చేశానని చెప్పారు. ఈ వివరాలను చంద్రబాబు,లోకేష్ కు లేఖ కూడా రాశానని అన్నారు. ఆదిమూలం లైంగిక వేధింపలపై సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని తెలియడంతో ఎమ్మెల్యేల పలుమార్లు ఫోన్ చేసి బెదిరించారని అందుకే మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తున్నానని చెప్పారు.
గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి పోటీ చేసిన కోనేటి ఆదిమూలం
కోనేటి ఆదిమూలం వైఎస్ఆర్‌సీపీలో మొదటి నుంచి పనిచేశారు. రెండు సార్లు ఆ పార్టీ తరపున పోటీ చేశారు. ఒక సారి విజయం సాధించారు. 2014లో ఓడిపోయారు. 2019లో భారీ మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఆయనకు ఇవ్వలేదు. తిరుపతి ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే తనకు ఎంపీ టిక్కెట్ అవసరం లేదని ఎమ్మెల్యే టిక్కెట్ మాత్రమే కావాలని చెప్పి ఆయన టీడీపీలో చేరిపోయారు. టీడీపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ పై కోనేటి ఆదిమూలం మూడున్నర వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అంటే.. వరుగా రెండో సారి గెలిచారు. టీడీపీ తరపున మొదటి సారి గెలిచారు.
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో కీలక పరిణామం- వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు
మార్ఫింగ్ వీడియో అంటున్న సత్యవేడు ఎమ్మెల్యే
అయితే ఈ వీడియో విషయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. సత్యవేడు నియోజవర్గంలో కొంత మంది టీడీపీ నాయకులు చేసినక కుట్ర పూరితంగానే ఈ వీడియోలు విడుదల చేశారని ఆయన అంటున్నారు. ఆ వీడియోలో ఉన్న మహిళ ఎవరో తనకు తెలియదని.అవి మార్ఫింగ్ వీడియోలని అంటున్నారు. వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరి టిక్కెట్ తెచ్చుకుని పోటీ చేసి గెలవడం ఇష్టం లేని టీడీపీనేతల కుట్రేనని యన చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - గోదావరికి పెరిగిన ఉద్ధృతి, ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటంటే?
చర్యలు తీసుకునేందుకు టీడీపీ హైకమాండ్ రెడీ
కోనేటి ఆదిమూలం వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఇటీవలి పలువురు ప్రజా ప్రతినిధులు ఇలాంటి దృశ్యాలతో అల్లరి పాలయ్యారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వంతు అయింది. ఆయన కూడా మొన్నటిదాకా వైసీపీలోనే ఉండి వచ్చారు. ఇప్పుడీ ఎమ్మెల్యేపై టీడీపీ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.