Telangana: తెలంగాణలోని ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్- ఆరుగురు మావోయిస్టులు మృతి
Warangal: తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మృతి చెందారు.

Encounter In Mulugu District: మావోయిస్టులకు గడ్డుకాలం ఉన్నట్టు ఉంది. వరుస ఎన్‌కౌంటర్లు వారికి కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. బుధవారం ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది వరకు మృతి చెందారు. ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు హతమయ్యారు.
ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాంతాలు తుపాకీ మోతలతో దద్దరిల్లిపోతోంది. దంతెవాడ ఎన్కౌంటర్ మరువకముందే ములుగు జిల్లా సరిహద్దుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ములుగు, కొత్తగూడెం జిల్లాల సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ములుగు జిల్లా సరిహద్దు దామెర తొడుగు అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా... మరి కొందరు గాయపడినట్టు తెలుస్తోంది.




















