Top Headlines Today: చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్; కేబినెట్ విస్తరణకు రేవంత్ బ్రేక్ - నేటి టాప్ న్యూస్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్
ఏపీ సీఎం చంద్రబాబుతో (Chandrababu) తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ (Radhakrishnan) శుక్రవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన గవర్నర్‌కు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురూ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. వీరి భేటీకి ముందు మంత్రి నారా లోకేశ్ గవర్నర్‌కు స్వాగతం పలికి.. శాలువాతో సత్కరించారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న గవర్నర్‌కు.. విమానాశ్రయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఇంకా చదవండి
కేబినెట్ విస్తరణకు బ్రేక్
తెలంగాణ మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కేవలం పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. కీలక మంత్రిత్వ శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. అంతే కాదు పదేళ్లుగా పార్టీ కోసం పోరాడి ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్ నేతలు మంత్రి పదవుల కోసం ఆరాటంగా ఎదరు చూస్తున్నారు. ఇలాంటి వారందరికీ పార్టీ అధినాయకత్వం లోక్ సభ ఎన్నికల డెడ్ లైన్ పెట్టింది. మంచి ఫలితాలు సాధిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఆశ కల్పించారు. దీంతో అందరూ శ్రమపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే అభ్యర్థిగా రేవంత్ రెడ్డి సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న సామల కిరణ్ కుమార్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చినా దగ్గరుండి గెలిపించుకుని వచ్చారు. ఇంకా చదవండి
బీజేపీకి మద్దతుగానే వైసీపీ - టీడీపీ, జనసేన కూటమిలో ఉన్నా జగన్ ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు ?
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక విషయంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు తమ మద్దదు బీజేపీకే అని ప్రకటించడం దేశవ్యాప్త రాజకీయాల్లో కలకలానికి కారణం అయింది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. ఆ రెండు పార్టీలతో కలిసి వైసీపీని భారీ తేడాతో ఓడించాయి. అంతకు ముందు ఐదేళ్ల పాటు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి బేషరతు మద్దతు ఇచ్చారు. ఎలాంటి బిల్లు అయినా పార్లమెంట్ లో డిమాండ్లు పెట్టకుండా అడిగినా అడగకపోయినా సపోర్టు చేశారు. అందుకే తమకు వ్యతిరేకంగా బీజేపీ వెళ్లదని అనుకున్నారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రధాని మోదీని కలిసి తాము ఎప్పటిలాగా మద్దతుగా ఉంటామని టీడీపీ, జనసేనతో కలవొద్దని కోరినట్లుగా ప్రచారం కూడా జరిగింది. కానీ టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసిపోయింది. ఇంకా చదవండి
విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్
జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటయిన విద్యుత్ కమిషన్ చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు ముగిశాయి. అనంతరం కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసినట్లు హైకోర్టు ప్రకటించింది. సోమవారంలోపు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఇంకా చదవండి
మంత్రి పొన్నంను టార్గెట్ చేస్తున్న పౌడి కౌశిక్ రెడ్డి
ఒకప్పుడు బూడిదే కదా అని ఎవరు పట్టించుకోలేదు. ఆ తరువాత బూడిదకు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో...రాజకీయ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో ఎవరు అధికారంలో ఉంటే వారు బూడిద దందాలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బూడిద రవాణ రాజకీయం దుమారం రేపుతుంది. కాంగ్రెస్,బిఆర్ఎస్ నేతల మధ్య పోలిటికల్ వార్ కు కేరాప్ అవుతుంది బూడిద దందా. మంత్రికి బూడిద అక్రమ రవాణాతో సంబందం ఉందని ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే...ఎమ్మెల్యే ఆరోపణల పై మంత్రి అనుచరులుర్స్ మండి పడుతున్నారు. ఇంకా చదవండి