Telangana Highcourt : విద్యుత్ కమిషన్ రద్దుపై కేసీఆర్ పిటిషన్ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
Telangana High Court has reserved judgment petition filed by KCR against the Electricity Commission
Telangana High Court On Electricity Commission : జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటయిన విద్యుత్ కమిషన్ చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు ముగిశాయి. అనంతరం కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసినట్లు హైకోర్టు ప్రకటించింది. సోమవారంలోపు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.
పిటిషన్ విచారణర్హతపైనే వాదనలు
కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ స్వీకరించవద్దని అడ్వకేట్ జనరల్ ధర్మాసనం ఎదుట వాదించారు. పిటిషన్‌ను విచారణకు అనుమతించడంపైనే వాదనలు వినిపించాలని… మెరిట్స్‌లోకి వెళ్లవద్దని ఏజీకి ధర్మాసనం సూచించింది. ఏజీ వాదనలపై కేసీఆర్ న్యాయవాది ఆదిత్యా సోంధీ అభ్యంతర వ్యక్తం చేశారు. జ్యుడిషియల్ విచారణగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దానిపై నివేదిక ఇవ్వాలే గానీ, మీడియాకు వివరాలు వెల్లడించకూడదు. విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి కారకులెవరో తేల్చమన్నారని ఇది ఉద్దేశపూర్వకమని వాదించారు.
మార్చి 14న కమిషన్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘంను ప్రభుత్వం నియమించింది. ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘాన్ని నియమించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది.
ప్రతివాదిగా జస్టిస్ నరసింహారెడ్డిని చేర్చడంపై అభ్యంతరాలు
జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. నంబర్ కేటాయించేందుకు నిరాకరించారు. కేసీఆర్ పిటిషన్ గురువారం హైకోర్టు ధర్మాసనం ముందు కు వచ్చింది. దాదాపు 45 నిమిషాలపాటు వాదప్రతివాదనలు జరిగాయి. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్‌కు నంబర్‌ను కేటాయించాలని ఆదేశించింది. జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషనర్ అభియోగాలు మోపినందున విచారణ చేపడతామ్నారు. ఆ మేరకు శుక్రవారం విచారణ చేపట్టారు. ల
జస్టిస్ నరసింహారెడ్డి కమిటీపై కేసీఆర్ తీవ్ర వ్యతిరేకత
విద్యుత్ కమిషన్ ఏర్పాటును కేసీఆర్ వ్యతిరేకంచారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అంటున్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ అన్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.