Top Headlines Today: ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల, రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే; కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్స్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల, రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు సోమవారం (ఏప్రిల్ 22) వెలువడ్డాయి. విజయవాడలో ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. దీంతోపాటు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లోనూ ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలు చూసుకోవచ్చు. ఇంకా చదవండి
రాయలసీమపై షర్మిల ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని షర్మిల వ్యూహాత్మకంగా ఎన్నికల పోరాటంలో బరిలో నిలుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై తెర వెనుక కొంత మంది సీనియర్లు పని చేస్తున్నారు. కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి లాంటి వాళ్లు బయట పెద్దగా కనిపించడం లేదు. కానీ తెర వెనుక మాత్రం చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో అసంతృప్తికి గురైన నేతల్ని తీసుకుని పోటీకి ఒప్పిస్తున్నారు. రాయలసీమతో పాటు కోస్తాలో బలమైన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే వీరి వ్యూహాలన్నీ గెలవడానికి కాదు.. ఓడించగలిగే శక్తి ఉందని నిరూపించడానికి అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. ఇంకా చదవండి
ఎమ్మెల్యేల చేరికలపై కాంగ్రెస్‌ది అంతా ప్రచార ఆర్భాటమేనా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైప్ ఇచ్చిన ఎమ్మెల్యేల చేరికల అంశం క్రమంగా బెదిరింపుల జాబితాలోకి చేరుతోంది. పార్లమెంట్ ఎన్నికలకంటే ముందే ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకుంటామని బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యేకమైన కారణాలతో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారు వెనుకడుగు వేస్తున్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా చివరి క్షణంలో ఆగిపోయారు. తన మనవరాలితో తన తాత కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదన్న ప్రకటన చేయించారు. ఇంకా చదవండి
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల మరో జాబితా రిలీజ్
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ (Ap Congress) సోమవారం తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. గతంలో 114 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా.. తాజాగా మరో 38 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ 142 స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు. ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా అరకు లోక్ సభతో పాటు 8 అసెంబ్లీ స్థానాలను సీపీఎంకు కేటాయించారు. ఇక, ఆదివారం 9 లోక్ సభ స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించగా.. ఇప్పటివరకూ 20 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 4 ఎంపీ, మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయాల్సి ఉంది. ఇంకా చదవండి
మందుబాబులకు షాక్ - రేపు మద్యం దుకాణాల బంద్
మందుబాబులకు అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ అంతటా వైన్ షాప్స్ మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి నేపథ్యంలో ఈ నెల 23న శోభాయాత్ర వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలు నుంచి బుధవారం ఉదయం 6 గంటలు వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. మద్యం దుకాణాలు మూసివేయడం ద్వారా ఘర్షణలు, వివాదాలకు ఆస్కారం లేకుండా చేయాలన్నది పోలీసులు ఆలోచనగా చెబుతున్నారు. ఇంకా చదవండి