Top Headlines Today: అన్నా క్యాంటిన్లు పున:ప్రారంభం; గృహజ్యోతికి మళ్లీ దరఖాస్తులు స్వీకరణ - నేటి టాప్ న్యూస్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
![Top Headlines Today: అన్నా క్యాంటిన్లు పున:ప్రారంభం; గృహజ్యోతికి మళ్లీ దరఖాస్తులు స్వీకరణ - నేటి టాప్ న్యూస్ Todays top five news at Telangana Andhra Pradesh 15 August 2024 latest news Top Headlines Today: అన్నా క్యాంటిన్లు పున:ప్రారంభం; గృహజ్యోతికి మళ్లీ దరఖాస్తులు స్వీకరణ - నేటి టాప్ న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/15/0ec775d129f0ac81724b23c3f54fd16f1723712764419234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విజయవాడలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
సమాజమే దేవాలయంగా ప్రజలే దైవుళ్లు అన్న ఎన్టీఆర్ పిలుపు మేరకు పాలన సాగుతుందన్న సీఎం చంద్రబాబు. సింపుల్ గవర్నమెంట్ ప్రజలకు చేరువగా ఉంటూ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడించి సరికొత్త విధానాలతో ప్రజలకు మంచి చేస్తున్నామన్నారు. ఇంకా చదవండి
గృహ జ్యోతి పథకానికి మళ్లీ దరఖాస్తులు స్వీకరణ
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులను అర్హులైన వారి నుంచి స్వీకరించనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో మరోసారి దరఖాస్తులను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇంకా చదవండి
ఏపీలో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన అన్న క్యాంటీన్‌లు ప్రారంభమయ్యాయి. గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు అక్కడ అందరితో కలిసి భోజనం చేశారు. తొలి విడతగా వంద అన్న క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఇవాళ గుడివాడలో తొలి క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. మిగతా 99 రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. గుడివాడలో జరిగిన ప్రారంభోత్సవానికి చంద్రబాబు సతీసమేతంగా వచ్చారు. క్యాంటీన్ ప్రారంభమైన తర్వాత అక్కడకు వచ్చిన వారందరికీ దంపతులు ఇద్దరూ వడ్డించారు. అనంతరం వారందరితో కలిసి అక్కడే భోజనం కూడా చేశారు. ఇంకా చదవండి
గోల్కొండకోట నుంచి సీఎం రేవంత్ పవర్‌ఫుల్ స్పీచ్ ఇదే
పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోల్కొండకోట వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ తెలంగాణలో ఉందన్నారు. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించామని తెలిపారు. ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నామని... లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించామన్నారు. మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నామని.. ఇంతటి వ్యవస్థలో లోటు పాట్లు ఉండొచ్చని... మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నామన్నారు. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నామన్నారు. ఇంకా చదవండి
ప్యాంటు జేబులో సెల్‌ఫోన్ పెడుతున్నారా?
తెలంగాణలోని కామారెడ్డిజిల్లాలో సెల్‌ఫోన్ పేలింది. ప్యాంట్‌జేబులోనే పేలింది. అయితే ప్రమాదంజరగడానికి ముందే ఆ వ్యక్తి సెల్‌ఫోన్‌ను తీసి పక్కన పడేయడంతో పెద్ద ముప్పే తప్పింది. పిట్లం మండల కేంద్రంలో పిట్లం ఎస్సీ కాలనీలో ఉంటున్న సాయిలు ప్యాంట్ జేబులో సెల్‌ఫోన్ పేలింది. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ పని చేస్తున్న ఆయన రోజు మాదిరిగానే తన క్లినిక్‌కు వచ్చాడు. ఇంతలో తన ప్యాంటు జేబు భాగంలో ఏదో వేడిగా అనిపించింది. సెల్‌ఫోన్ హీట్ అవుతుందేమో అని గమనించి సెల్‌ఫోన్ తీస్తున్న క్రమంలోనే జేబు నుంచి పొగలు వచ్చాయి. తీసే లోపే సెల్‌ఫోన్ విపరీతంగా హీటెక్కి పేలిపోయింది. ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)