అన్వేషించండి

Top 10 Headlines Today: ఏపీ నుంచి ఎన్డీఏలో చేరేది ఎవరు? కిషన్ రెడ్డి ఆ మచ్చ చెరిపేయగలరా?

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today: 

బీజేపీతో ఎవరు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలన్నీ బీజేపీతో సఖ్యతగా ఉంటున్నాయి. బీజేపీ నేతృత్వంలోని అధికార పార్టీ కూటమి ఎన్డీఏలో భాగం అయ్యేందుకు అన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి. జనసేన పార్టీ ఇప్పటికే ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉంది. ఇక ప్రధాన పార్టీలైన జనసేన, వైసీపీల సంగతి చెప్పాల్సిన పని లేదు. రెండు పార్టీల్లో  ప్రధాని మోదీ, అమిత్ షా ఎవర్ని ఎంచుకుంటే వారు ఎన్డీఏలో చేరిపోతారు. తిరస్కరించడానికి అవకాశం లేదు. ఇప్పుడు బీజేపీ ఎవర్ని ఎంచుకుంటుందన్నది సస్పెన్స్ గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఈ మరక మంచిది కాదు 

తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అతి పెద్ద కష్టం వచ్చింది. తాము బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి అవగాహనతో లేమని  ప్రజల ముందు నిరూపించాల్సి ఉంది. అందుకే రెండు రోజులుగా బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేసీఆర్ ను వదిలేది లేదని ఒక రోజు తప్పించుకోవచ్చు కానీ.. తర్వాత తప్పించుకోలేరని ఈటల రాజేందర్ హెచ్చరించారు. కిషన్  రెడ్డి మరింత ఘాటుగా హెచ్చరికలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో కూడా  బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు చేసే అవకాశం ఉంది. అవినీతి, కుటుంబపాలన పై భోపాల్‌లోనే అయన బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తెలంగాణకు వచ్చి సాఫ్ట్  గా ఉండే అవకాశం లేదు. అయితే ఈ మాటల ద్వారానే తెలంగాణ ప్రజలు.. బీజేపీకి బీఆర్ఎస్‌కు  మధ్య ఏమీ లేదని  నమ్మేస్తారా అన్నదే కీలకం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

తెలంగాణలో వర్షాలు

ఈ రోజు ఆవర్తనం గ్యాంగ్‌టక్ పశ్చిమ బెంగాల్  & పరిసరాలలోని ఉత్తర ఒడిశా దగ్గర సగటు సముద్ర మట్టంకి 1.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు మధ్య  కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు తూర్పు పశ్చిమ ద్రోణి (షీర్ జోన్) సుమారుగా 17°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రెండో దఫా వారాహి యాత్ర

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తదుపరి షెడ్యూల్ ఖరారు అయింది. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీన ఏలూరు నగరంలో బహిరంగ సభ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారు. దీంతో యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్ ను ఈ రోజు (జూలై 6) సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చించి ఖరారు చేశారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్‌ చర్చించారు. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించినట్టు జనసేన పార్టీ నేత పి.హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

సింగ‌రేణి ఉద్యోగులకు శుభవార్త 

తెలంగాణలోని సింగ‌రేణి ఉద్యోగుల పిల్లల‌కు రాష్ట్ర ప్రభుత్వం శుభ‌వార్త వినిపించింది. రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్‌ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం(జులై 6న) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. మిగతా 127 సీట్లలో 5 శాతం రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్ల‌ల‌కు కేటాయించడం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నేడు తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల

తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల వెల్లడికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఫలితాలను శుక్రవారం(జులై 7న) మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు గురువారం(జులై 6న) ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు జూన్ 14 నుంచి 22 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ అందుబాటులో ఉంచనున్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఇన్విక్టోని మారుతి సుజుకి లాంచ్

ఆటో లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇన్విక్టోని మారుతి సుజుకి లాంచ్ చేసింది. దీన్ని టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా తయారు చేశారు. కియా కార్నివాల్, టయోటా ఇన్నోవా క్రిస్టాలతో మారుతి సుజుకి ఇన్విక్టో పోటీ పడనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కిలో టమాటా @60

దేశవ్యాప్తంగా టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిలో ధర రూ.150కి పెరిగింది. ధరలు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈలోగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ ఎక్కువగా వినియోగించే టమాటాలను అందరికీ అందుబాటులో ఉంచాలని దాదాపు 50% మేర ధరలు తగ్గించింది. రేషన్ షాప్‌లలో మాత్రమే ఇది వర్తిస్తుంది. బియ్యం, పప్పు, నూనె ఎలాగైతే రేషన్ షాప్‌లలో చౌక ధరలకు లభిస్తాయో అలాగే టమాటాలనూ తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. చెన్నైలోని రేషన్ దుకాణాల్లో ఇది అమలు చేసింది ప్రభుత్వం. కిలో రూ.60కే విక్రయిస్తోంది. ముందుగా చెన్నైలోని రేషన్ షాప్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చి ఆ తరవాత రాష్ట్రవ్యాప్తంగా ఇది అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 82 రేషన్‌ షాప్‌లలో ఎక్కడైనా రూ.60కే కిలో టమాటాలు కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

తిరుగులేని నొవాక్‌ జకోవిచ్‌

న్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. తనకు తిరుగులేదని చాటి చెప్తున్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. తాజాగా 350వ గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ విజయం అందుకున్నాడు. వింబుల్డన్‌ మ్యాచులో జోర్డాన్‌ థాంప్సన్‌ను ఓడించాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జకోకు ప్రత్యర్థి నుంచి కఠిన సవాల్‌ ఎదురైంది. అయితే కీలక సమయాల్లో ఎదురు నిలిచిన అతడు 6-3, 7-6(4), 7-5 తేడాతో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ప్రాజెక్ట్ K అప్‌డేట్

ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్ట్-K’ ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాయి. ఈ నేపథ్యంలో మూవీ అప్‌డేట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానుల కోసం కీలక అప్‌డేట్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget