అన్వేషించండి
Pawan Kalyan: వారాహి విజయయాత్ర రెండో షెడ్యూల్ తేదీ ఖరారు, అక్కడి నుంచే ప్రారంభం
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చించి ఖరారు చేశారు.
![Pawan Kalyan: వారాహి విజయయాత్ర రెండో షెడ్యూల్ తేదీ ఖరారు, అక్కడి నుంచే ప్రారంభం Pawan Kalyan's Janasena Varahi vijaya yatra second schedule confirms starts from July 9th Pawan Kalyan: వారాహి విజయయాత్ర రెండో షెడ్యూల్ తేదీ ఖరారు, అక్కడి నుంచే ప్రారంభం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/06/2e1bf35c821801715b0c677fce6a4fcf1688660191883234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రెండో షెడ్యూల్ ఖరారు చేస్తున్న పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తదుపరి షెడ్యూల్ ఖరారు అయింది. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీన ఏలూరు నగరంలో బహిరంగ సభ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారు. దీంతో యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్ ను ఈ రోజు (జూలై 6) సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చర్చించి ఖరారు చేశారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్ చర్చించారు. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు జనసేన పార్టీ నేత పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఫ్యాక్ట్ చెక్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion