అన్వేషించండి

Project K Title: ప్రాజెక్ట్-K బిగ్ అప్‌డేట్, అంతర్జాతీయ వేదికపై టైటిల్ రివీల్ - ఎక్కడంటే?

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే ‘ప్రాజెక్ట్-కె’ టైటిల్, గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అమెరికాలోని అంతర్జాతీయ వేదికగా టైటిల్ ప్రకటిస్తారు.

ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్ట్-K’ ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాయి. ఈ నేపథ్యంలో మూవీ అప్‌డేట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానుల కోసం కీలక అప్‌డేట్ ఇచ్చారు. 

అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా టైటిల్ రిలీజ్

‘ప్రాజెక్ట్-కె’ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ నెల (జులై) 19 నుంచి అమెరికాలోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకల జరగనున్నాయి. అక్కడే జులై 20న ప్రాజెక్ట్‌గా టైటిల్‌తోపాటు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్ కూడా పాల్గొంటారు. ఈ సమాచారం తెలియగానే ప్రభాస్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’ మూవీ టీజర్ గురువారం సోషల్ మీడియా వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే ‘ప్రాజెక్ట్-కె’ గ్లింప్స్ కూడా వస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. 

‘ప్రాజెక్ట్ కె’లో కమల్ హాసన్ కూడా ఉన్నారని ప్రకటించడంతో మూవీపై ఆసక్తి నెలకొంది. ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తున్నా.. వాస్తవం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ మూవీలో నటించేందుకు కమల్ హాసన్ భారీ రిమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలిసింది. అలాగే, ఇందులో నటిస్తున్న ఇతర స్టార్స్‌కు కూడా నిర్మాతలు భారీగా చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్‌తోపాటు దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా 'ప్రాజెక్ట్ కె'ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 'ప్రాజెక్ట్ కె' చిత్రీకరణ దాదాపు 70 శాతం పూర్తి అయ్యింది. కమల్ హాసన్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ సీన్స్ ఇంకో పది రోజులు షూటింగ్ చేస్తే పూర్తి అవుతాయని తెలిసింది. అయితే, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా తెలియరాలేదు.

రెండు భాగాలుగా రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ K’

టాలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటిగా ‘ప్రాజెక్ట్ K’ కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ తొలి భాగం కమల్ తో పోరాడేందుకు భవిష్యత్తులోకి ప్రయాణించేందుకు ప్రభాస్‌ సిద్ధం కావడంతో ముగుస్తుంది. ఫ్రాంచైజీ 2వ భాగం పూర్తిగా ప్రభాస్, కమల్ హాసన్ మధ్యే నడవనున్నట్లు తెలుస్తోంది. 

Also Read : తల్లి పరిస్థితి విషమంగా ఉన్నా షారుఖ్ ఖాన్ షూటింగ్‌కు వచ్చారు - ‘మాయా మేంసాబ్’దర్శకుడు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget