Top 10 Headlines Today: ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు- పుంగనూరు ఘటనపై స్పీడ్ పెంచిన పోలీసులు
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
దివికేగిన యుద్ధనౌక
ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ తెలంగాణ గర్వించే బిడ్డ అని సీఎం కేసీఆర్ అన్నారు. జీవితాంతం వారు చేసిన త్యాగాలు ప్రజా సేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
గద్దర్ ఆఖరు సినిమా ఇదే
ప్రజా గాయకుడు గద్దర్ మరణంతో తెలుగు ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన ఇక లేరనే వార్త ప్రజల్ని శోకసంద్రంలో ముంచింది. 74 ఏళ్ళ వయసున్న గద్దర్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్ను మూశారు. గద్దర్ గాయకుడు మాత్రమే కాదు... ఆయన గేయ రచయిత. ఆయనలో సహజ నటుడు కూడా ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పుంగనూరు ఘటనలో 62 మంది అరెస్టు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సాగునీటి విధ్వంసంపై యుద్దభేరి పర్యటనలో పోలీసులపై జరిగిన రాళ్ళ దాడి ఘటనలో 62 మంది టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా పలమనేరులో అడిషనల్ ఎస్పీ కె.లక్ష్మీ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన పుంగనూరులో చంద్రబాబు రోడ్ షో పోలీసులు బందోబస్తు నిర్వహించడం జరిగిందని, ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లకు పోలీసులకు మధ్య జరిగిన ఘటనలో 50 మంది పోలీసులు గాయపడ్డారని ఆమె తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఫిర్యాదు
పుంగనూరు లో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసుల పై దాడి, చెలరేగిన హింసాకాండ పై ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సంఘటన కు కారకులైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వాయిదా లేదు
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా గురించి వస్తున్న పుకార్లకు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష జరుగుతుందని ఆదివారం (జులై 6) అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో స్పష్టత వచ్చినట్లయింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంతమంది టీఎస్‌పీఎస్సీని ఆశ్రయించారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని మరికొందరు కమిషన్‌ను కోరారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్ ప్రకారమే 'గ్రూప్-2' పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో టీఎస్‌పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కొత్త ఎస్సైలు వస్తున్నారు
తెలంగాణలో వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎస్‌ఐ, ఏఎస్ఐ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు ఆగస్టు 8న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. కీలకమైన కటాఫ్ మార్కుల ప్రక్రియను పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి తాజాగా ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాల వివరాలకు సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రెండోదీ పాయే
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో కూడా భారత జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ 18.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో వెస్టిండీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. మరొక్క మ్యాచ్ ఓడిపోయినా భారత్ సిరీస్‌ను కోల్పోయినట్లే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని దాదాపు 220 ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ ఆదివారం (ఆగస్టు 6) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును అనుసరించి ఫీజులు నిర్ణయించారు. గతేడాది వసూలు చేసిన ఫీజుకు 10 శాతం అదనంగా పెంచుకునేలా, అదీ కూడా కనీస ఫీజు రూ.43 వేలకు మించకుండా నిర్ణయించారు. కళాశాలల స్థాయిని బట్టి ఫీజు అత్యధిక ఫీజు రూ.77 వేలు ఉండగా, కనీస ఫీజు రూ.43 వేలుగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తగ్గేదేలే అంటున్న పవన్
'బ్రో' సినిమా విడుదలైన తర్వాత రాజకీయ రగడ మొదలైంది. తాను చేసిన నృత్యాన్ని (ఆనంద తాండవం అని వర్ణించారనుకోండి) అవహేళన చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
స్లో అండ్ ఈట్
కొంతమంది భోజనాన్ని ఐదు నిమిషాల్లోనే ముగిస్తారు. మరి కొంతమంది అరగంట పాటు తింటారు. వేగంగా తిన్న వాళ్ళని ఏదో గొప్ప వాళ్ళలా చూస్తూ ఉంటారు, కానీ అలా వేగంగా తినడమే వారి ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. ఎవరైతే కాస్త నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ నమిలి మింగుతూ ఉంటారో, వారి ఆరోగ్యమే చక్కగా ఉంటుంది. ఆహారాన్ని వేగంగా తినడం వల్ల నోట్లో ఎక్కువసేపు నమలరు. కేవలం ఒకటి రెండుసార్లు నమిలి మింగేస్తారు. ఇదే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. శాస్త్రీయంగా చెప్పాలంటే వేగంగా తినే వ్యక్తి మానసిక, భావోద్వేగ, శారీరక శ్రేయస్సు పై అనేక సమస్యలు పడే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి