అన్వేషించండి

AP Engineering Fee: ఏపీలో ఇంజినీరింగ్‌ ఫీజులు ఖరారు, ఉత్తర్వులు జారీ - కనీస, అత్యధిక ఫీజులు ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని దాదాపు 220 ఇంజినీరింగ్‌ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ ఆదివారం (ఆగస్టు 6) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలోని దాదాపు 220 ఇంజినీరింగ్‌ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ ఆదివారం (ఆగస్టు 6) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును అనుసరించి ఫీజులు నిర్ణయించారు. గతేడాది వసూలు చేసిన ఫీజుకు 10 శాతం అదనంగా పెంచుకునేలా, అదీ కూడా కనీస ఫీజు రూ.43 వేలకు మించకుండా నిర్ణయించారు. కళాశాలల స్థాయిని బట్టి ఫీజు అత్యధిక ఫీజు రూ.77 వేలు ఉండగా, కనీస ఫీజు రూ.43 వేలుగా ఉంది.

మెరైన్ ఇంజినీరింగ్‌ను ప్రత్యేకంగా అందిస్తున్న ప్రవీణా మెరైన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీకి మాత్రం ఫీజును రూ.1,37,500గా నిర్ణయించారు. కాగా ఈ ఫీజుల నిర్ధారణ కేవలం 2023-24 ఏడాదికి మాత్రమే వర్తించనుంది. ఫీజులపై హైకోర్టు పూర్తి తీర్పు వచ్చిన తర్వాత ఫీజుల నియంత్రణ మండలి నిర్ణయం మేరుకు ఆ తర్వాత కాలానికి ఫీజులు నిర్ణయించబడతాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు(జీవో  ఎంఎస్‌ 41) విడుదల చేసింది.

ALSO READ: తెలంగాణ బీసీ గురుకులాల్లో బీఎస్సీ అగ్రికల్చర్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

ఏపీలో ఇంజినీరింగ్ ఫీజులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కనీస ఫీజును రూ.43 వేలుగా నిర్ణయిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే అంతకన్నా ఎక్కువ ఫీజులను నిర్ణయించిన కళాశాలలు ఫీజులను మరో 10 శాతం పెంచుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ, రుసుముల నియంత్రణ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది.

ప్రభుత్వం ఖరారు చేసిన ఇంజినీరింగ్ ఫీజులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ‌స్టు 2న‌ విచారణ జరిగింది. న్యాయస్థానం ప్రతిపాదించిన ఫీజులపై తమకు అభ్యంతరం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల ఫీజులను ప్రభుత్వం సవరించింది.

ఏపీలో ఇంజినీరింగ్ కనీస ఫీజును రూ.35 వేలు చెల్లిస్తున్నారు. కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండటంతో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు రూ.43 వేలుగా హైకోర్టు నిర్ణయించింది. రూ.70 వేల నుంచి రూ.1.05లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్న కాలేజీల్లో మరో 10 శాతం వరకు ఫీజు పెంచుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ: 'గేట్‌-2024' షెడ్యూలు వచ్చేసింది, ఆగస్టు 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకై నిర్వహించిన ఏపీఈఏపీసెట్ 2023కు 3,14,797 మంది హాజురు కాగా 2,52,717 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,71, 514 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 81,203 మంది అర్హత సాధించారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఫీజులకు సంబంధించి కనిష్టంగా 42,500 అంతకంటే ఎక్కువ ఫీజులుంటే 10 శాతం పెంచుకునేందుకు వీలు కల్పిస్తామని హైకోర్టు వెల్లడించింది. మరోవైపు ఏపీ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ 2023-24 నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులు నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 

ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకై నిర్వహించిన ఏపీఈఏపీసెట్ 2023కు 3,14,797 మంది హాజురు కాగా 2,52,717 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,71, 514 మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 81,203 మంది అర్హత సాధించారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఫీజులకు సంబంధించి కనిష్టంగా 42,500 అంతకంటే ఎక్కువ ఫీజులుంటే 10 శాతం పెంచుకునేందుకు వీలు కల్పిస్తామని హైకోర్టు వెల్లడించింది. మరోవైపు ఏపీ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ 2023-24 నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులు నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget