అన్వేషించండి

Top Headlines Today: తెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్‌!- వచ్చే నెలలో వైజాగ్ షిప్టు కానున్న సీఎం జగన్!

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

తెలంగాణ గవర్నర్‌గా రజనీకాంత్!

సూపర్‌ స్టార్ రజనీకాంత్ గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒక సాదారణ బస్ కండక్టర్ నుంచి తలైవా అని పిలిపించుకునే లెజెండరీ నటుడాయన. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగిన రజినీ.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం 72 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ వెండితెర మీద అలరించిన రజినీకి.. ఇప్పుడు నిజ జీవితంలో రాజ్యాంగబద్ధ పదవి దక్కబోతోందని తమిళ నాట జోరుగా ప్ర‌చారమ‌వుతోంది. త్వరలోనే ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి వరించనుందని టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

అసలు రహస్యమిదే!

విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...వేగంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీ లేదా 24న...సీఎం క్యాంప్ కార్యాలయాన్ని వైజాగ్ కు మారుస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయ్. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుంచే పాలన సాగనుండటంతో...విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ హోదా పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలుస్తోంది. ఇందులో భాగంగా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిని అడిషనల్ డీ జీ ర్యాంక్ కు పెంచింది.  కొత్త నగర పోలీస్ కమిషనర్ గా 1994 బ్యాచ్ కు చెందిన రవిశంకర్ అయ్యన్నార్ ని నియమించింది. ఇప్పటి దాకా అక్కడ పని చేస్తున్న త్రివిక్రమ వర్మను బదిలీ చేసింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

తెలంగాణకు పెట్టుబడుల వరద

 తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దుబాయ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కేటీఆర్ చేపట్టిన దుబాయ్ టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు కేటీఆర్ టీం మంగళవారం రోజు పలు వ్యాపార వాణిజ్య సంస్థ ప్రతినిధి బృందాలతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య అనుకూలతలను వారికి కేటీఆర్ వివరించారు. ఇక్కడి పెట్టుబడుల స్నేహపూర్వక వాతావరణాన్ని గురించి తెలియజెప్పారు. టీఎస్ బీపాస్ లాంటి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు ముందుకు వచ్చాయి. మంగళవారం(సెప్టెంబర్ 5) నాడు రూ.1,040 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

చంద్రబాబు, రాజశేఖర్‌ రెడ్డి లైఫ్‌ హిస్టరీపై వెబ్‌సిరీస్‌లు

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల నిజ జీవిత పాత్రల ఆధారంగా ఓ ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లర్ తీయబోతున్నట్టు ప్రస్థానం దర్శకుడు దేవా కట్టా అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు దిగ్గజ నాయకుల మధ్య స్నేహం, రాజకీయ వైరం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిపారు. 'ఇంద్రప్రస్థం' అనే టైటిల్‌ తో మోషన్ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఇది జరిగి మూడేళ్లుదాటినా ఇంతవరకూ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అసలు ఈ మధ్య కాలంలో ఊసేలేదు. అయితే ఇన్నాళ్లకు తాజాగా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ వార్తల్లోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఐ ప్యాక్ టీం మెప్పించలేకపోతుందా!

ప్రశాంత్ కిషోర్ దేశంలో ఉన్న అగ్రశ్రేణి పొలిటికల్ స్ట్రాటజీస్టుల్లో ఒకరు. ఆయితే ఆయన తన ఇన్నింగ్స్ ను ముగించారు. సొంతంగా రాజకీయాలు చేస్తున్నారు. బీహార్ లో కొంత కాలం పాదయాత్ర చేశారు. తర్వాత కంటిన్యూ చేయనున్నారు. చివరి సారిగా ఆయన డీఎంకేకు పని చేశారు. ఆ తర్వతా మరే పార్టీకి పని చేసేది లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఇప్పటికీ ఆయన స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ యాక్టివ్ గా ఉంది. ఆయన సహచరులు ఐ ప్యాక్ ను నడుపుతున్నారు. కానీ పీకే పాత్ర మాత్రం లేదు. తాను ఇక మరే పార్టీకి పని చేయబోనని ఆయన చెబుతున్నారు. అయితే పీకే లేని ఐ ప్యాక్ మాత్రం ఇబ్బంది పడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కాంగ్రెస్‌లో స్క్రీనింగ్

అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది తెలంగాణ కాంగ్రెస్‌ ప్టారీ. వీలైంత త్వరగా క్యాండిడేట్లను ప్రకటించాలని భావిస్తోంది. అయితే... ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో... తీవ్రంగా కసరత్తు చేయాల్సి వస్తోంది. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమెల్యే అభ్యర్ధులను ఎంపిక చేయాలని స్క్రీనింగ్ కమిటీకి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సభ్యులు. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ నిర్దేశించినట్టు కాకుండా బీసీలకు, మహిళలకు అత్యధిక సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పెళ్లి ఆ కండీషన్

మూడు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి కాని అందాల భామల జాబితా తీస్తే... అందులో అనుష్క పేరు (Anushka Shetty) పేరు ముందు ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు ఆమె వయసు 41 ఏళ్ళు. అందుకని, ప్రేక్షకుల్లో చాలా మంది చూపు ఆమె పెళ్లి మీద ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

హైదరాబాద్‌ రావడంతో తగ్గిన ఖర్చులు - సోషల్ పోస్టు వైరల్ 

సిలికాన్ సిటీ బెంగళూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ పరిశ్రమకు దేశ రాజధానిగా వెలుగొందుతోంది. అక్కడ వాతావరణం, కల్చర్ అందరిని సులువుగా ఆకర్షిస్తాయి. అయితే అక్కడ జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇంటి అద్దెల విషయానికి వస్తే చుక్కలు కనిపిస్తాయని తెలుస్తుంది. చిన్న సూది నుంచి ఇంట్లో కూరగాయల వరకు ప్రతీది అధిక ధరలు పలుకుతాయి. అరకొర ఆదాయంతో సామాన్య, సన్న, చిన్న ఉద్యోగాలు చేసేవారు బెంగళూరులో బ్రతకడం అంటే కష్టమనే చాలా మంద అంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

శోభ శెట్టి ఇక్కడా విలనేనా!

బిగ్ బాస్ మొదలయ్యి రెండురోజులు అవుతోంది. కానీ ఇప్పటికీ మొదటిరోజు జరిగిన నామినేషన్సే ప్రసారం అవుతున్నాయి. నిన్నటి (సెప్టెంబర్ 4న) ప్రసారం అయిన ఎపిసోడ్‌లో శివాజీ, ప్రియాంక జైన్.. తమ నామినేషన్స్‌ను పూర్తి చేసుకోగా.. దాని చుట్టూ పలు వాగ్వాదాలు జరిగాయి. ఇక మిగిలిన కంటెస్టెంట్స్.. నేడు (సెప్టెంబర్ 5న) ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ముందుగా శోభ శెట్టి, దామిని నామినేషన్స్‌తో ఫైర్ క్రియేట్ అయ్యింది హౌజ్2లో. దాని వల్ల వారిద్దరి మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి. అంతే కాకుండా ఈ నామినేషన్స్ కారణంగా గౌతమ్ కృష్ణ, శోభ శెట్టి మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఆసియా కప్‌లో మరో హై ఓల్టేజ్‌ మ్యాచ్

ఆసియా కప్‌లో దాయాదుల (భారత్ - పాక్) పోరుకు ఉండే క్రేజే వేరు. ఆ  స్థాయిలో కాకపోయినా ఇటీవల కాలంలో  శ్రీలంక - బంగ్లాదేశ్‌తో, పాకిస్తాన్ - అఫ్గానిస్తాన్ మ్యాచ్ ‌లు కూడా రసవత్తరంగానే సాగుతున్నాయి.  కొంతకాలంగా బంగ్లాదేశ్ - అఫ్గానిస్తాన్  మ్యాచ్‌‌లు కూడా ఇదే కోవలోకి వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు గొడవలు లేకపోయినా  పాక్ - బంగ్లా సైతం దాయాదులే. అయితే ఇంతవరకూ  పాకిస్తాన్‌ను పాకిస్తాన్‌లో ఓడించని బంగ్లాదేశ్.. ఆసియా కప్ - 2023లో  తొలిసారి ఆ ముచ్చట తీర్చుకునేందుకు  సిద్ధమైంది. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ రికార్డును మరింత మెరుగుపర్చుకునేందుకు  ప్రణాళికలు సిద్ధం చేసింది.  నేడు  పాక్ - బంగ్లా మధ్య  లాహోర్ లోని గడాఫీ వేదికగా ఆసియా కప్‌లో  సూపర్ - 4 స్టేజ్ తొలి మ్యాచ్ జరుగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
Asifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Embed widget