Hyderabad to Kashmir Low Budget Trip : కేవలం రూ.1700లతో హైదరాబాద్ టూ కాశ్మీర్.. లో బడ్జెట్‌తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
HYD to Kashmir : కాశ్మీర్ వెళ్లాలని ఉందా? అయితే తక్కువ బడ్జెట్‌తో హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్లగలిగే ఓ మార్గముంది. అదేంటో.. అసలు అంత తక్కువ బడ్జెట్‌తో వెళ్లొచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
Hyderabad to Kashmir Low Budget Journey : రోజా సినిమా చూసి మంచు ప్రాంతాలకు వెళ్లాలని ఫాంటసీ ఉందా? అక్కడి స్నో ఫాల్‌ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉందా? అయితే మీ ట్రావెల్ లిస్ట్‌లో కచ్చితంగా కశ్మీర్ ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రయాణం అనుకుంటారు. కానీ కాస్త మనసు, కొద్దిగా సమయం, కూసింత బ్రెయిన్, లిటిల్ బిట్ ఓపిక ఉంటే.. కేవలం రెండు వేలలోపే మీరు హైదరాబాద్ నుంచి కశ్మీర్ వెళ్లొచ్చు. అదేలా సాధ్యం? నిజంగానే అంత తక్కువ బడ్జెట్‌తో కశ్మీర్ వెళ్లొచ్చా? జర్నీ డిటైల్స్ ఏంటి? అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..
బడ్జెట్ ప్లానింగ్..
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్ జర్నీ చేయాలి. దీని ధర రూ.900 ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకోవడానికి 24 గంటలు సమయం పడుతుంది. అంటే ఓ రోజంతా జర్నీ చేయాలి అనమాట. ఢిల్లీలో దిగిన తర్వాత.. అక్కడి నుంచి ఉదమ్పూర్కి మరో ట్రైన్ మారాలి. దీని టికెట్ ధర రూ.400 ఉంటుంది. ట్రావెల్ సమయం పది గంటలు ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత ఆటో ఎక్కాలి. రైల్వే స్టేషన్ నుంచి బస్‌స్టాప్‌కి వెళ్లాలి. ఉదమ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి బస్‌స్టాప్‌కి వెళ్లేందుకు రూ.150 అవుతుంది. ఉదమ్‌పూర్‌లో బస్ ఎక్కి.. బన్యాల్కి వెళ్లాలి. దీని టికెట్ ధర 180 రూపాయలు. జర్నీ నాలుగు గంటలు ఉంటుంది. బన్యాల్ రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్‌కి ట్రైన్లో వెళ్లాల్సి ఉంటుంది. దీని ధర రూ.35. రెండుగంటల సమయం పడుతుంది.
రెండ్రోజుల ప్రయాణం తర్వాత మీరు గమ్యస్థానానికి చేరుకుంటారు. కశ్మీర్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు.. జర్నీ చేయడం ఇష్టపడేవారు.. కొత్తదనం కావాలనుకుంటే ఇలా తక్కువ బడ్జెట్‌లో కశ్మీర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ బడ్జెట్ కేవలం జర్నీకి సంబంధించిన ఖర్చు మాత్రమే. ఫుడ్, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చు ప్రస్తావన దీనిలో లేదు. కాబట్టి రూ.1700ల్లో మీరు హైదరాబాద్ నుంచి కశ్మీర్ ఇలా చేరుకోవచ్చు. ఇలా కష్టపడి అంత దూరం ఎలా వెళ్తామనుకోకండి. ఓ అమ్మాయి ఈ బడ్జెట్లోనే హైదరాబాద్‌నుంచి కశ్మీర్ వెళ్లింది. దానికి సంబంధించిన స్టోరీ, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది.
బడ్జెట్‌కి తగ్గ ప్రయాణం
హైదరాబాద్ నుంచి నేరుగా జమ్మూకి ట్రైన్లో కూడా వెళ్లొచ్చు. Hyderabad to Jammu Tawi (JAT) ట్రైన్‌కి వెళ్లొచ్చు. ఇలా వెళ్తే రూ.2,000 నుంచి రూ.5000 వేలు టికెట్ ధర ఉంటుంది. జర్నీ సమయం 33 గంటల పైమాటే. ట్రైన్, ఫ్లైట్ జర్నీ రెండూ చేయాలనుకునేవారు.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్ జర్నీ చేసి.. ఢిల్లీ నుంచి డైరక్ట్ శ్రీనగర్‌కి ఫ్లైట్‌లో వెళ్లొచ్చు.
బడ్జెట్ ఎక్కువ, సమయం తక్కువ
మాకు సమయం లేదు, కుదరదు.. మేము ఇలా అనుకుంటే అలా కశ్మీర్లో ఉండాలనుకునేవారు ఫ్లైట్‌లో జర్నీ చేయవచ్చు. త్వరగా వెళ్లాలనుకునేవారు.. హైదరాబాద్ నుంచి నేరుగా శ్రీనగర్‌కి ఫ్లైట్‌లో వెళ్లిపోవచ్చు. ఇలా వెళ్తే టికెట్ ధర రూ.8,000 నుంచి రూ.10,000 ఉంటుంది. మీరు ఎంచుకునే ఎయిర్‌లైన్స్, బుకింగ్ టైమ్, కూర్చొనే ప్లేస్‌ని బట్టి మారుతూ ఉంటుంది.
ఇవి కేవలం హైదరాబాద్ నుంచి జమ్మూ వెళ్లడానికి మాత్రమే బడ్జెట్. తిరిగి రావడానికి, అక్కడి ఖర్చులకు, స్టేయింగ్, ఫుడ్ ఇలా అన్ని లెక్కలేసుకుని ట్రావెల్స్ ద్వారా వెళ్లొచ్చు. లేదా మీ బడ్జెట్‌కి, సమయానికి అనువైన జర్నీని చేయవచ్చు.
Also Read : లక్షద్వీప్ వెళ్లడానికి ఆ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి, లేకుంటే వెళ్లలేరు.. బోనస్‌గా బడ్జెట్ ఫ్రెండ్లీ టిప్స్