అన్వేషించండి

Lakshadweep Tour : లక్షద్వీప్ వెళ్లడానికి ఆ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి, లేకుంటే వెళ్లలేరు.. బోనస్​గా బడ్జెట్ ఫ్రెండ్లీ టిప్స్

Plan Trip To Lakshadweep : మోదీ పుణ్యమా అని లక్షద్వీప్ టూరిజానికి మంచి గిరాకీ పెరిగింది. మీరు కూడా లక్షద్వీప్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. 

Lakshadweep Tour Plan : సెలబ్రిటీలు మాల్దీవుల​ని ప్రమోట్ చేస్తే.. మోదీగారు లక్షద్వీప్​ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు సెలబ్రిటీల నుంచి కామన్​ మ్యాన్​ వరకు అందరూ లక్షద్వీప్ బాట పడుతున్నారు. మీ విష్​ లిస్ట్​లో కూడా లక్షద్వీప్​ ఉందా? అయితే మీరు అక్కడికి వెళ్లే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో? బడ్జెట్ తగ్గించుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం. 

లక్షద్వీప్​కి వెళ్లాలంటే.. పాస్​పోర్ట్​ అవసరం లేదు. కానీ.. బడ్జెట్​తో పాటు.. ఓ సర్టిఫికెట్ ఉండాలి. ఆ సర్టిఫికెట్ ఉంటేనే లక్షద్వీప్ వెళ్లేందుకు అనుమతి వస్తుంది. అదే పీసీసీ(Police Clearance Certificate). అవును ఈ PCC సర్టిఫికెట్ లేకుండా లక్షద్వీప్​కి వెళ్లలేరు. ఈ సర్టిఫికెట్ కోసం ఎలా అప్లై చేయాలి? ఎంత సమయం పడుతుంది వంటి డిటైల్స్ ఇవే..

ఇలా అప్లై చేయాలి..

మీ ఆధార్ కార్డ్​ లేదా పాస్​పోర్ట్​లోని అడ్రెస్​ ఏ రాష్ట్రంలో ఉందో.. ఆ రాష్ట్రం నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫెకేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. చాలా రాష్ట్రాల్లో ఆన్​లైన్​ ద్వారా అప్లై చేసే వెసులుబాటు ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పోలీస్​ స్టేషన్​కి వెళ్లి.. ఈ సర్టిఫికెట్ కోసం అప్లై చేయాలి. 

సర్టిఫికెట్ వచ్చేది అప్పుడే

అప్లై చేసిన 7 నుంచి 45 రోజుల్లో ఈ సర్టిఫికెట్ వస్తుంది. కాబట్టి అప్పటివరకు వేచి చూడాలి. ఇది లేకుండా లక్షద్వీప్​కి వెళ్లడం, సడెన్​గా ప్లాన్​ చేసుకుని అప్పుడే వెళ్లాలంటే కుదరదు. కాబట్టి ముందుగా ఈ PCC​కి అప్లై చేసుకుని దానికి అనుగుణంగా లక్షద్వీప్​కి ట్రిప్ ప్లాన్​ చేసుకోవాలి. 

సర్టిఫికెట్​ ఇలా సబ్​మిట్ చేయాలి..

PCC వచ్చిన తర్వాత దానిని మీరు ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్తే వారికి లేదా మీరు స్టే చేసే హోటల్స్, టూర్ ఆపరేటర్స్, స్పాన్సర్​తో షేర్ చేసుకోవాలి. వాళ్లు మీ తరపున ఈ PCCని లక్షద్వీప్ ప్రభుత్వానికి సబ్​మిట్ చేస్తారు. 

కండీషనల్ పర్మిట్

మీకు ఆ ప్రభుత్వం పర్మిట్ ఇవ్వడానికి 7 నుంచి 14 రోజులు పడుతుంది. ఈ పర్మిట్ ఉంటేనే మీరు లక్షద్వీప్ వెళ్లే ఫ్లైట్ ఎక్కగలుగుతారు. లేదంటే మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కనివ్వరు. అలాగే లక్షద్వీప్​లో మీరు ఏ దీవులను చూడొచ్చో కూడా పర్మిట్​లో ఇస్తారు. మీరు వాటిని మాత్రమే ఎక్స్​ప్లోర్ చేయగలరు. 

ఈ విషయాలు గుర్తించుకోండి.. 

లక్షద్వీప్​కి వెళ్లడానికి అక్కడ ఉన్న ఏకైక ఎయిర్​పోర్ట్ అగట్టి. ఒకరోజులో కేవలం ఒక విమానం మాత్రమే అగట్టికి వెళ్తుంది. కాబట్టి మీరు ఫ్లైట్స్​ని 2 లేదా 3 నెలలు ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టూరిస్టల కోసం లోకల్ ఫెర్రీలు రావు. కాబట్టి మీరూ క్రూజ్​ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలా వెళ్తే మీరు ఎక్కువ సమయాన్ని islandలో గడపడం కుదరకపోవచ్చు. కొచ్చి నుంచి లేదా గోవా నుంచి మీరు లక్షద్వీప్ వెళ్లాలి కాబట్టి ముందురోజే అక్కడకు వెళ్తే మంచిది. 

బడ్జెట్​ తగ్గించుకునేందుకు.. 

మీరు తక్కువ బడ్జెట్​లో లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే.. మీరు గోవా వెళ్లి అక్కడి నుంచి విమానంలో వెళ్తే బడ్జెట్ కాస్త తగ్గుతుంది. కొచ్చితో పోల్చితే ఇది కాస్త తక్కువగా ఉంటుంది. లక్షద్వీప్​ చేరుకున్నాక పెద్ద హోటల్స్​లో కాకుండా.. లోకల్​గా ఉండే హోటల్స్​ని స్టేయింగ్ కోసం ఎంచుకోవచ్చు. ఎందుకంటే అవి బడ్జెట్ ఫ్రెండ్లీ పైగా సౌకర్యంగా కూడా ఉంటాయట.

Also Read : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget