(Source: Poll of Polls)
Top 10 Headlines Today: ఏపీ, తెలంగాణ బీజేపీ చీఫ్‌ల మార్పుతో అందరూ హ్యాపీయేనా? అధినాయకత్వం వ్యూహంపై వస్తున్న విమర్శలేంటీ?
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
తెలంగాణలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అధికార బీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోనే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పదవి నుంచి దిగిపోయారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ నియమించింది. అయితే, అంతా సరిగ్గా ఉన్న టైంలో అసలేందుకు ఈ మార్పు..? దీనివల్ల తెలంగాణ బీజేపీకి నష్టమా..?లాభమా..? ఆ వివరాలపై ఓ లుక్కేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఇంత అస్పష్ట వ్యూహమా?
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావడానికి బీజేపీ పార్టీని పునర్ వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల్ని మార్చేశారు. తెలంగాణలో ఊహించని విధంగా అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా ఉన్న బండి సంజయ్ ను తప్పించి తెలంగాణ పార్టీ బాధ్యతలు కేంద్ర మంతి కిషన్ రెడ్డికి అప్పగించారు. దీంతో పాటు ఏపీలో సోము వీర్రాజు పై వేటు వేసి పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించారు. అయితే వీరి నియామకాల్లో బీజేపీ హైకమాండ్ ఏ సమీకరణాలు చూసిందన్నది ఎవరికీ అర్థం కాని విషయం. దీంతో బీజేపీలోనే అయోమయం ఏర్పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వర్షలే వర్షాలు
నిన్నటి ఆవర్తనం ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం పరిసరల్లోని, పశ్చిమమధ్య బంగాళాఖతంలో సగటు సముద్ర మట్టంకి 1.5 కిమీ నుండి 5.8 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు తూర్పు పశ్చిమ ద్రోణి (షీర్ జోన్) సుమారుగా 15°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు మధ్య ఏర్పడిందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
2024 వరకు కలిసే ఉంటారా?
2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సర్కార్‌ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నాయి విపక్షాలు (Opposition Unity). రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసిన సమయంలో కాంగ్రెస్‌తో సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలు కూడా ఆ పార్టీకి మద్దతు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన స్వరం వినిపించాయి. అదానీ వ్యవహారం కూడా అన్ని పార్టీలనూ ఒక్కటి చేసింది. అప్పటి నుంచి వరుస భేటీలతో "మేమంతా ఒక్కటే" అనే సంకేతాలిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశాలు జరిగాయి. ఇటీవలే పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ నేతృత్వంలోనూ విపక్షాల భేటీ జరిగింది. ఈ నెలలోనూ కాంగ్రెస్ సారథ్యంలో మరోసారి మీటింగ్ జరగనుంది. అయితే...ఈ అన్ని భేటీల్లోనూ BRS కనిపించలేదు. కాంగ్రెస్ ఉన్న కూటమితో కలిసేదే లేదని BRS తేల్చి చెప్పింది. ఆ తరవాత రాహుల్ గాంధీ కూడా BRS ఉంటే తమ మద్దతు ఉండదని స్పష్టం చేశారు. బిహార్ సీఎం నితీశ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి సీనియర్ నేతలు ఈ సమావేశాల్లో కీలకంగా కనిపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అతి ఆకలి కూడా ప్రమాదమే
ఆకలిని మనం చాలా సాధారణంగా భావిస్తాం. అయితే, అది మన శరీరంలో జరుగుతున్న మార్పులకు, సమస్యలకు కూడా సంకేతాన్నిఇచ్చే లక్షణమని మనం తెలుసుకోవాలి. లేకపోతే.. మున్ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆకలి వేస్తుందంటే.. ఆహారం తింటే సరిపోతుందిలే అని అనుకుంటాం. కానీ, ఈ కింది కారణాన్ని మీరు అస్సలు ఊహించలేరు. అదేంటో తెలుసుకుని ఇకపై ఆరోగ్యంపై శ్రద్ధపెట్టండి.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మహిళా బ్యాంక్
మహిళలకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ (MSSC)ను డిపాజిట్లు చేసుకుంటున్నామని ప్రకటించింది. దేశంలో ఈ పథకం కింద డిపాజిట్లు సేకరిస్తున్న తొలి బ్యాంకు తమదేనని వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆలస్యంగా వెలుగులోకి
మెగా కుటుంబంలో మరో విడాకులు చోటు చేసుకున్నాయి. నాగబాబు కుమార్తె, నటి & నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela) వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఆమె ఎందుకు విడాకులు తీసుకున్నారు? సంసార జీవితంలో చిక్కులు ఎందుకు వచ్చాయి? కారణాలు ఏమిటి? అనేది బయటకు రాలేదు. కానీ, నిహారిక విడాకులపై ఇప్పుడు జోరుగా కథనాలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
స్వామి వివేకానంద వెబ్‌సిరీస్
ఆధ్యాత్మిక వేత్త, యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందను అమితంగా ఇష్టపడే వారిలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన కథను వెండితెర మీదకు తీసుకురావాలని సీనియర్ నటుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. వివేకానంద బోధనల ప్రభావం తనపై ఉందని.. అందుకే ఆయన జీవిత చరిత్రను సినిమా చేయాలనుకుంటున్నాని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. వెంకీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ చేతిలో పెట్టారని, ఆయన కొన్నాళ్ళు స్క్రిప్టు మీద వర్క్ చేసి పక్కన పెట్టేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే విషయం మీద నీలకంఠ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
భారత్‌కే సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్
భారత ఫుట్ బాల్ జట్టు 9వ సారి సాఫ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సునీల్ ఛెత్రీ సారథ్యంలోని టీమిండియా జట్టు ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కువైట్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ముందు నిర్ణీత సమయం ముగిసే సమయానికి భారత్, కువైట్ జట్లు ఒక్కో గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయింది. అయితే నిర్ణయాత్మక పెనాల్టీ షూటౌట్ కు దారితీసిన మ్యాచ్ లో చివర్లో అద్భుతంగా రాణించిన భారత్ 5-4తో కువైట్‌ను ఓడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నిలకడగా బంగారం రేటు
యూఎస్ ఫెడ్ జూన్ మీటింగ్ మినిట్స్ కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర స్తబ్దుగా ఉంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,935 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర ₹ 100, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 100 చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు ₹ 200 తగ్గింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి