Top 10 Headlines Today: కోటి రూపాయల అరటి పండు గురించి విన్నారా? ఇలాంటి ఆసక్తికరమైన మార్నింగ్ ముచ్చట్లు మీ కోసం
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
ఆ బాధ్యతలో అంత ఇబ్బంది ఉందా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, స్వయంగా సీఎం జగన్‌కు సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. తనకు ఇచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి వైదొలిగారు. స్వయం సీఎం జగన్ పిలిచి మీరే కొనసాగాలి అని చెప్పినా ఆయన కుదరదని చెప్పి వెళ్లిపోయారు. తన నియోజకవర్గానికే పరిమితమవుతానన్నారు. అయితే సీఎం జగన్ తో బంధుత్వం ఉండటం వల్లనే ఆయన అలా ధైర్యంగా చెప్పగలిగారు కానీ ఇలా పార్టీ బాధ్యతల్లో ఉన్న చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. వీరి అసంతృప్తి ఎందుకు ?
వర్షం తగ్గేదేలే
మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ (ఎం.జే.ఓ.) ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఉండటం వలన ఒక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా మొత్తం భారత దేశం వర్షాలు విజృంభిస్తోందని ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ అంచనా వేస్తున్నారు. ఈ ఎం.జే.వో. మరింత బలపడి ఇండోనేషియా మీదుగా వెళ్లనుంది. ఇది మే 9 నుంచి ఇండోనేషియా వైపుగా వెళ్ళనుందని వివరించారు. కానీ బలపడి వెళ్తోందొ కాబట్టి మే 7 న అల్పపీడనం బంగాళాఖాతంలో ఆ తర్వాత మే 10 లేదా 11 న తుపానుగా మారనుందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ
అవినాష్‌పై సీబీ"ఐ"
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సీబీఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఇటీవల తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ హత్య కేసుకు సంబంధించిన కీలక వివరాలను సీబీఐ కౌంటర్ లో దాఖలు చేసింది. పూర్తి వివరాలు మీ కోసం
ఎవరికి ఎమ్మెల్సీ పోస్టు
ఈ నెల 27వ తేదీతో రాజేశ్వర్ రావు ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రాజేశ్వర్ ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం పూర్తనుంది. అయితే మళ్లీ ఈ అవకాశం రాజేశ్వర్ కే దక్కనుందా...? లేక ఈ సారి జిల్లాకు ఇచ్చే ఉద్దేశ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నారా ? లేదా ? అన్న దానిపై బీఆర్ఎస్ జిల్లా పార్టీ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. రాజేశ్వర్ తో పాటు మరో నేత గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీ పదవి కాలం కూడా పూర్తవనుంది. మరో 6 నెలలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి జిల్లాలో ఎవరికి దక్కనుంది అనే దానిపై ఆసక్తి నెలకోంది. సీటు ఎవరికి పూర్తి వివరాలు చూడండి
మరో భారతీయ సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు
ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పీఠం అజయ్ బంగాకు దరి చేరింది. ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా అజయ్ బంగా పేరును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. 2023 జూన్ 2 నుంచి ఐదేళ్ల కాలానికి అధ్యక్షుడిగా బంగాను ఎంపిక చేశారు. ఎవరీ బంగా ?
బంగారం ధరలు ఎలా ఉన్నాయి
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర కీలక స్థాయి అయిన 2000 డాలర్ల పైనే కదులుతోంది. మన దేశ మార్కెట్‌లో, ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 800, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 880 పెరిగింది. కిలో వెండి రేటు ₹ 700 పెరిగింది. పూర్తి రేట్ల కోసం క్లిక్ చేయండి
ఫుడ్‌లో మిల్లెట్స్
కేంద్ర సాయుధ బలగాలకు అందించే మీల్స్‌లో ఇకపై మిలెట్స్ కూడా చేర్చనున్నట్టు హోంశాఖ ప్రకటించింది. ఆ వివరాలు మీ కోసం
అవునా... కోటి రూపాయలా?
అరటి పండు కోటి రూపాయలా? అదేంటీ.. అనుకుంటున్నారా? ఆ ఎగ్జిబిషన్‌లో పెడితే అంతే మరి. పనికి రాని వస్తువు సైతం కోట్ల ధర పలుకుతుంది. ఈ విషయం తెలియక ఆ యువకుడు ఏం చేశాడో చూడండి.
విషమంగానే శరత్‌బాబు ఆరోగ్యం
సీనియర్ నటుడు శరత్ బాబు తుదిశ్వాస విడిచారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై స్పందిస్తూ ఆయన సోదరి ఓ ప్రకటన విడుదల చేసారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి
సూర్య ఫామ్‌లోకి వచ్చినట్టేనా?
ముంబయి ఇండియన్స్ జూలు విదిల్చింది! తాము బరిలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించింది! మొహాలి స్టేడియాన్ని హోరెత్తించింది. పంజాబ్ కింగ్స్ సెట్ చేసిన 215 పరుగుల బిగ్ టార్గెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఛేజ్ చేసింది. మరో 7 బంతులు మిగిలుండగానే.. 6 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. పూర్తి స్కోర్ కోసం క్లిక్ చేయండి