Weather Latest Update: తెలుగు రాష్ట్రాలను వదలని వాన- తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
Weather Latest Update: మే 9 వరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. మే 5 వరకు కోస్తాంధ్ర, ఆ తర్వాత రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు పడనున్నాయి.
Weather Latest Update: మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ (ఎం.జే.ఓ.) ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఉండటం వలన ఒక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా మొత్తం భారత దేశం వర్షాలు విజృంభిస్తోందని ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ అంచనా వేస్తున్నారు. ఈ ఎం.జే.వో. మరింత బలపడి ఇండోనేషియా మీదుగా వెళ్లనుంది. ఇది మే 9 నుంచి ఇండోనేషియా వైపుగా వెళ్ళనుందని వివరించారు. కానీ బలపడి వెళ్తోందొ కాబట్టి మే 7 న అల్పపీడనం బంగాళాఖాతంలో ఆ తర్వాత మే 10 లేదా 11 న తుపానుగా మారనుందన్నారు.
ఇది ఒక వైపున ఉండగా మే 9 వరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. మే 5 వరకు కోస్తాంధ్ర, ఆ తర్వాత రాయలసీమలో కొన్ని చోట్ల వర్షాలు పడనున్నాయి. తుఫాను ముప్పు తప్పినట్టేనంటూ వాతావరణ శాఖ ప్రకటించిన వేళ తీవ్రమైన వడగాల్పులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మన వైపున ఉండే తేమని ఆ తుఫాను లాగుకొని వెళ్లిపోతుంది కాబట్టి వేడిగాలులు కోస్తాలో ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి.
Weather in Telangana Andhra Pradesh Hyderabad on 4 May 2023 Winter updates latest news here
మరోవైపు తమిళనాడు - దక్షిణ కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. దీని వలన విశాఖపట్నంతోపాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. పిడుగులు, ఉరుములు, ఈదురుగాలులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉండనుంది. ఎం.జే.వో. ఇప్పుడు బంగాళాఖాతంలో కొనసాగుతోంది. అది భారీ వర్షాలకు, పిడుగులకు కావాల్సిన శక్తిని ఇస్తుంది.
ఎన్.టీ.ఆర్., పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం (కోస్తా భాగాలు), నెల్లూరు, తిరుపతి, చిత్తూరు , కడప, అన్నమయ్య, నంధ్యాల జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలను చూడగలము.
తెలంగాణలో పరిస్థితి కూడా అలానే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జల్లులు పడవచ్చని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయని చెబుతోంది. కొన్ని చోట్ల వడగళ్ల వర్షం కూడా పడుతుందని రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. వర్షాలతోపాటు గాలులు కూడా 30- 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతోంది.
తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రత- ఆదిలాబాద్ 35.3
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత- హయత్‌నగర్- 19.0
ఇవాళ గరిష్టఉష్ణోగ్రత 30 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం
ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల వరకు రికార్డు అయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 3, 2023