News
News
వీడియోలు ఆటలు
X

Ajay Banga: ప్రపంచ బ్యాంక్‌ పీఠంపై అజయ్‌ బంగా - 14వ అధ్యక్షుడిగా ఎన్నిక

2023 జూన్ 2 నుంచి ఐదేళ్ల కాలానికి అధ్యక్షుడిగా బంగాను ఎంపిక చేశారు.

FOLLOW US: 
Share:

Ajay Banga - World Bank: ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పీఠం అజయ్‌ బంగాకు దరి చేరింది. ప్రపంచ బ్యాంక్‌ 14వ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా పేరును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డ్‌ అధికారికంగా ప్రకటించింది. 2023 జూన్ 2 నుంచి ఐదేళ్ల కాలానికి అధ్యక్షుడిగా బంగాను ఎంపిక చేశారు. 

మొత్తం 25 మంది సభ్యులున్న ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డు అజయ్‌ బంగాను ఇంటర్వ్యూ చేసింది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ ఇంటర్య్యూ కొనసాగింది. బంగా అర్హతలు, ఆలోచన తీరు, భవిష్యత్‌ దృక్పథం మీద ప్రశ్నలు వేసి సంతృప్తి చెందిన బోర్డు... ఆయన్ను ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. అజయ్‌ బంగా సారథ్యంలో పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని. ప్రపంచ బ్యాంక్‌ లక్ష్యాలను బంగా నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.

గతంలోనే ఖరారైన అభ్యర్థిత్వం
మార్చి నెలలో, ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవి కోసం అజయ్ బంగా నుంచి మాత్రమే నామినేషన్‌ వచ్చింది. అజయ్‌ బంగాకు పోటీగా ఏ దేశమూ మరో పేరును ప్రతిపాదించలేదు. దీంతో, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని నెల రోజుల క్రితమే నిర్ధరణ అయింది.

ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఏ అభ్యర్థికి అమెరికా మద్దతు ప్రకటిస్తే, సాధారణంగా ఆ వ్యక్తే ఎన్నిక అవుతుంటారు. ప్రపంచ బ్యాంకులో అత్యధిక షేర్లు అగ్రరాజ్యానివే. కాబట్టి, వరల్డ్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికలో అమెరికా మాటే చెల్లుబాటు అవుతుంది. ఈసారి, మాస్టర్ కార్డ్ మాజీ సీఈఓ అజయ్ బంగా అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తూ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటన విడుదల చేశారు. అప్పుడే అజయ్‌ బంగాకు లైన్‌ క్లియర్‌ అయింది. అయితే.. ఎన్నికకు సంబంధించిన ఫార్మాలిటీస్‌ పూర్తి చేయాలి కాబట్టి.. నామినేషన్‌ వేయడం, వాటిని పరిశీలించడం, ఆ తర్వాత ఇంటర్వ్యూ వంటి తూతూమంత్రపు పనులు కొనసాగాయి. 

ప్రపంచ బ్యాంక్‌ పీఠంపై తొలి భారతీయ-అమెరికన్   
ప్రపంచ బ్యాంకుకు అధిపతిగా నియమితుడైన తొలి భారతీయ-అమెరికన్, తొలి అమెరికన్ సిక్కు అజయ్‌ బంగా. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్‌గా ఇటీవలి వరకు ఆయన పని చేశారు. అంతకుముందు, దాదాపు 24,000 మంది ఉద్యోగులతో కూడిన ప్రపంచవ్యాస్థ సంస్థ అయిన మాస్టర్‌కార్డ్‌కు ప్రెసిడెంట్‌ & CEOగా పని చేశారు. 2020-2022 కాలంలో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు గౌరవ ఛైర్మన్‌గా ఉన్నారు.

అజయ్‌ బంగా మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు. దిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌, అహ్మదాబాద్‌ ఐఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో అజయ్‌ బంగా చేసిన సేవలకు గాను, 2016లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. వివిధ దేశాల నుంచి కూడా అత్యన్నత గౌరవ పురస్కారాలు అందుకున్నారు.

ముందే దిగిపోతున్న ప్రస్తుత అధ్యక్షుడు     
ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పస్‌ (David Malpass), తన పదవీకాలం ముగియడానికి దాదాపు ఒక సంవత్సరం ముందే, ఈ ఏడాది జూన్‌లో ఆ కుర్చీ నుంచి దిగిపోతున్నారు. అందువల్లే కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించారు. 

Published at : 04 May 2023 12:45 AM (IST) Tags: Indian American Ajay Banga world bank President David Malpass

సంబంధిత కథనాలు

Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్‌ ఎఫెక్ట్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్‌ ఎఫెక్ట్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 223 పాయింట్లు ఫాల్‌, పెరిగిన రూపాయి

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్‌ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?