News
News
వీడియోలు ఆటలు
X

PBKS vs MI, IPL 2023: ముంబయి 2nd బిగ్గెస్ట్‌ ఛేజ్‌ - కిషన్‌, సూర్య దెబ్బకు 215 ఉఫ్‌!

PBKS vs MI, IPL 2023: ముంబయి ఇండియన్స్‌ జూలు విదిల్చింది! పంజాబ్‌ కింగ్స్‌ సెట్‌ చేసిన 215 పరుగుల బిగ్‌ టార్గెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఛేజ్‌ చేసింది.

FOLLOW US: 
Share:

PBKS vs MI, IPL 2023: 

ముంబయి ఇండియన్స్‌ జూలు విదిల్చింది! తాము బరిలోకి దిగితే ఎలా ఉంటుందో చూపించింది! మొహాలి స్టేడియాన్ని హోరెత్తించింది. పంజాబ్‌ కింగ్స్‌ సెట్‌ చేసిన 215 పరుగుల బిగ్‌ టార్గెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఛేజ్‌ చేసింది. మరో 7 బంతులు మిగిలుండగానే.. 6 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. ఇషాన్‌ కిషన్‌ (75; 41 బంతుల్లో 7x4, 3x6) సిక్సర్ల మోత మోగించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (66; 31 బంతుల్లో 8x4, 2x6) 360 డిగ్రీ ఇన్నింగ్స్‌ ఆడేశాడు. అంతకు ముందు కింగ్స్‌లో లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ (82; 42 బంతుల్లో 7x4, 4x6) రెచ్చిపోయాడు. సిక్సర్ల మోత మోగించాడు. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ (49; 27 బంతుల్లో 5x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడేశాడు.

దంచిన.. కిషన్‌, సూర్య

బిగ్‌ ఛేజ్‌లో ముంబయికి గుడ్‌ స్టార్ట్‌ రాలేదు. ఇన్నింగ్స్‌ మూడో బంతికే పరుగుల ఖాతా తెరవకముందే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ డకౌట్‌ అయ్యాడు. రిషి ధావన్‌ బౌలింగ్‌లో షార్ట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కామెరాన్‌ గ్రీన్ (23), కిషన్‌ కలిసి రెండో వికెట్‌కు 33 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం అందించారు. పవర్‌ ప్లే ముగిసే సరికి ముంబయిని 54/2తో నిలిపారు. ఆరో ఓవర్‌ ఆఖరి బంతికి గ్రీన్‌ను ఎలిస్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాతే అసలు సిసలు ఊచకోత మొదలైంది. ఒకవైపు సూర్య, మరోవైపు కిషన్‌.. ఆకలిగొన్న పులుల్లా చెలరేగారు. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లను వేటాడారు. మూడో వికెట్‌కు 55 బంతుల్లోనే 116 పరుగుల పాట్నర్‌షిప్‌ నెలకొల్పారు. వీరిద్దరూ కొట్టిన సిక్సర్లు, బౌండరీలకు మొహాలి మోత మోగిపోయింది. కిషన్‌ 29, సూర్య 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు సాధించారు. 14.1 ఓవర్లకే స్కోరును 150కి చేర్చారు. వీరిద్దరూ ఆరు బంతుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో పంజాబ్‌ గేమ్‌లోకి వస్తుందేమో.. హిట్‌మ్యాన్‌ సేన ఇబ్బంది పడుతుందేమో అనిపించింది. అయితే టిమ్‌ డేవిడ్‌ (19*), తిలక్‌ వర్మ (26*) గేమ్‌ను ఫినిష్‌ చేశారు.

అగ్రెసివ్‌ పంజాబ్‌

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 13 వద్దే ప్రభుసిమ్రన్‌ సింగ్ (9)ను అర్షద్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. మాథ్యూ షార్ట్‌ (27), శిఖర్ ధావన్ (30) ధాటిగా ఆడటంతో పవర్‌ ప్లే ముగిసే సరికి పంజాబ్‌ 50/1తో నిలిచింది. రెండో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని.. ధావన్‌ను ఔట్‌ చేయడం ద్వారా పియూష్ చావ్లా విడదీశాడు. ఇషాన్‌ కిషన్‌ స్టంపౌట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 62. ఈ సిచ్యువేషన్లో బరిలోకి దిగిన లియామ్‌ లివింగ్‌స్టోన్ మొదట్నుంచీ అగ్రెసివ్‌ ఇంటెంట్‌తో కనిపించాడు. షార్ట్‌తో కలిసి 25 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే 12వ ఓవర్లో షార్ట్‌ను చావ్లానే పెవిలియన్‌కు పంపించాడు.

జిత్తూ, లివింగ్‌స్టన్‌ అదుర్స్‌

వికెట్లు పడ్డప్పటికీ అగ్రెసివ్‌ బ్యాటింగ్ చేయడంతో పంజాబ్‌ 15.2 ఓవర్లకే 150కి చేరుకుంది. అప్పట్నుంచి ఊచకోత మరింత మొదలైంది. రావడం రావడంతోనే జితేశ్‌ శర్మ ముంబయి బౌలర్లను ఉతికారేశాడు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు కొట్టాడు. 18.5 ఓవర్లకే స్కోరును 200 దాటించాడు. మరోవైపు లివింగ్‌స్టోన్‌ 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదేశాడు. ఆ తర్వాత భీకరమైన షాట్లు ఆడేశాడు. వీరిద్దరూ 53 బంతుల్లోనే 119 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించడంతో పంజాబ్‌ 214/3కు చేరుకుంది.

Published at : 03 May 2023 11:13 PM (IST) Tags: Rohit Sharma Mumbai Indians Punjab Kings Shikhar Dhawan PBKS vs MI IPL 2023 Mohali

సంబంధిత కథనాలు

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్ 

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?