అన్వేషించండి

Top 10 Headlines Today: షర్మిల ఆలోచన ఏంటీ కాంగ్రెస్ చెబుతున్నదేంటీ? ఎలన్‌ మస్క్‌ VS ముకేశ్ అంబానీ 

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

తెలంగాణ కాకపోతే ఏపీ

వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎక్కువ మంది ఆమె ఎపీ కాంగ్రెస్ లో అయితే ఉపయోగం అని విశ్లేషిస్తున్నారు. కానీ షర్మిల మాత్రం తెలంగాణలోనే రాజకీయం చేస్తానంటున్నారు.  ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత రాజకీయాల్లో స్పష్టమైన మార్పులొచ్చాయి. ఏ పార్టీ కూడా రెండు రాష్ట్రాల్లో బలంగా లేదు. తెలుగుదేశం కూడా ఏపీకి పరిమితమయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పరిమితమయింది. ఏపీలో  పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. ఆంధ్రా రాజకీయాలపై తెలంగాణ ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ఏపీలోనూ అంతే. ఏపీ రాజకీయ నేతలపై తెలంగాణ ప్రజలు ఆసక్తి కూడా కోల్పోయారు. అలాంటి సందర్భంలో షర్మిల పార్టీ పెట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఆమె ఓ ఫోర్స్ గా మారారని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఇక చాలు సాయన్న!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయ సాయిరెడ్డి ప్రాధాన్యం మరింత తగ్గిపోయిందన్న భావన ఆ పార్టీ నేతల్లో పెరుగుతోంది. ఎమ్మెల్యేలు,ఇంచార్జులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో.. విజయసాయిరెడ్డి చూస్తున్న అనుబంధ సంఘాల బాధ్యతల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూసుకుంటారని సీఎం జగన్ చెప్పారు. ఈ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. విజయసాయిరెడ్డి  అన్నీ చూసుకోలేకపోతున్నారని.. ఆయన స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పని చేస్తారన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అమ్మో తిరుమల

తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత పులి హల్ చల్ చేసింది. ఏడవ మైలు వద్ద చిరుత ఐదేళ్ళ బాలుడిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. బాలుడితో పాటుగా ఉన్న బాలుడి తాత, భక్తులు కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో చిరుతను వెంబడించడంతో దాదాపు 150 మీటర్ల దూరంలో చిరుత బాలుడిని వదిలి వెళ్ళింది. ఐతే అటవీ ప్రాంతంలో ఏడుస్తున్న బాలుడిని గుర్తించిన అటవీ శాఖ ఉద్యోగి బాలుడి‌ని సురక్షితంగా అటవీ ప్రాంతం నుండి బయటకు తీసుకొచ్చి టీటీడీ విజిలెన్స్,‌ పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. చిరుత దాడిలో బాలుడి తలకు, గుండె భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కొత్త నినాదం

ముఖ్యమంత్రి జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేశారని, రెండున్నర లక్షల ఉద్యోగాల జాబ్‌ క్యాలెండర్‌ రాకుండా చేశారని అన్నారు. ఆఖరికి మద్దతు ధర ఇవ్వకుండా కూడా రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేశారని అన్నారు. ఎస్సీలకు అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకాన్ని తీసేశారని.. దోపిడీ చేసే వారికి ఒక్క అవకాశం ఇస్తే ఏం చేశారో చూశారు కదా అని అన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్‌ కల్యాణ్ మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పరీక్షపై అనుమానం 

గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై జూన్ 22న హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించకపోవడం, ఓఎంఆర్ షీటుపై హాల్‌టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఓఎంఆర్ షీటుపై హాల్‌టికెట్ నంబర్, ఫొటో ఎందుకు లేవని, అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. అక్టోబరులో చేసినవన్నీ రెండోసారి ఎందుకు చేయలేదు, పరీక్షల్లో అక్రమాల నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని ధర్మాసనం అడిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఎలన్‌ మస్క్‌ VS ముకేశ్ అంబానీ 

ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌, ఆసియాలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ పరస్పరం పోటీకి దిగనున్నారు! అత్యంత వేగంగా స్టార్ లింక్‌ సాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను భారత్‌కు పరిచయం చేయాలని మస్క్‌ తొందరపడుతున్నాడు. అయితే రిలయన్స్‌ జియోను నడిపిస్తున్న అంబానీ దానిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఫారం-12B ఇవ్వకపోతే ఇలా చేయండి

గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు మారారా?, మీ సమాధానం అవును అయితే, ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడంలో మీకు కాస్త ఇబ్బంది ఎదురుకావచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసిన టాక్స్‌పేయర్లు ఒకటి కంటే ఎక్కువ ఫామ్-16 పొందుతారు. దానివల్ల, రిటర్న్ దాఖలు చేసేటప్పుడు మొత్తం ఆదాయం, డిడక్షన్స్‌ లెక్క తేలక తికమక పడతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బైక్ కాస్ట్ రూ. 80 వేలు- కట్టాల్సిన ట్రాఫిక్ చలానాలు రూ. 70 వేలు 

యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు 70 చలానాలు విధించారు. ఏడాదిన్నరలో 70 సార్లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించాడా వ్యక్తి. ఈ చలానాలన్నీ కలిపి రూ.70,500 వరకూ ఉన్నాయి. అతని బైక్ వాల్యూ రూ.85 వేలు. అంటే..దాదాపు బైక్‌ ధర అంత ఉన్నాయి కట్టాల్సిన చలానాలు. ఈ ఏడాది ఇప్పటికే 33 చలానాలు రాగా, గతేడాది 37 చలానాలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. సిటీలో అందరి కన్నా ఎక్కువగా చలానాలున్న వెహికిల్స్ వివరాలు వెల్లడించారు. అందులో అత్యధికంగా 70 చలానాలతో ఓ వ్యక్తి టాప్‌లో నిలిచాడు. మిగతా 9 మంది పేరిట కూడా భారీగానే ఫైన్‌లున్నాయి. ఒక్కొక్కరు కనీసం 50 సార్లు రూల్స్ అతిక్రమించినట్టు పోలీసులు వెల్లడించారు. జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ కెమెరాలూ ఏర్పాటు చేశారు. సెక్యూరిటీలో భాగంగా వీటిని అమర్చారు. అయితే...ఈ కెమెరాలు ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘించిన వాహనాల నెంబర్‌ ప్లేట్స్‌ని ఎప్పటికప్పుడు ఫోటోలు తీస్తాయి. ఆటోమెటిక్‌గా చలానాలు జనరేట్ అవుతాయి. ఇప్పటికే వీరందరికీ నోటీసులు ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. వెంటనే ఈ ఫైన్ కట్టకపోతే వెహికిల్స్‌ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నాయక్ నహీ.. ఫ్రాంచైజ్ ఓనర్  మై హూ అంటున్న సంజయ్‌ దత్

90వ దశకంలో  ‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ’ అంటూ దేశాన్ని ఊపేసిన  బాలీవుడ్ వెటరన్ నటుడు సంజయ్ దత్ అదే పాటకు  కాస్త క్రికెట్ టచ్ ఇచ్చాడు. ‘నాయక్ నహీ..  ఫ్రాంచైజ్ ఓనర్ మై హూ’ అంటూ  క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. జింబాబ్వే వేదికగా  వచ్చే  నెల నుంచి   జరుగబోయే  జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ (Zim Afro T10 League)‌లో సంజయ్ దత్  ఓ ఫ్రాంచైజీని దక్కించుకున్నాడు.  ఈ లీగ్‌లో మన మున్నాభాయ్.. హరారే హరికేన్స్ టీమ్‌ను కొనుగోలు చేశాడు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఆస్పత్రి నుంచి ఈ రోజే ఉపాసన డిశ్చార్జ్ - రామ్ చరణ్‌తో కలిసి మీడియా ముందుకు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela) దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ వారం (జూన్ 20వ తేదీ, మంగళవారం) పండంటి ఆడబిడ్డకు కొణిదెల వారి కోడలు జన్మ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. అప్పటి నుంచి అపోలో ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారామె. మరి, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు? ఇంటికి ఎప్పుడు వెళతారు? అంటే... 'ఈ రోజు' అని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Jagan Comments  On Balineni: బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
TTD Controversy : టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Jagan Comments  On Balineni: బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
TTD Controversy : టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
Weather Latest Update: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్- ఏపీకి పొంచి ఉన్న తుపాను ప్రమాదం 
తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్- ఏపీకి పొంచి ఉన్న తుపాను ప్రమాదం 
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Tirumala Laddu: తిరుమల లడ్డూ 3 రకాలు.. ఏ సందర్భంలో ఏమిస్తారు - మీరు తీసుకున్న ప్రసాదం ఏ రకం!
తిరుమల లడ్డూ 3 రకాలు.. ఏ సందర్భంలో ఏమిస్తారు - మీరు తీసుకున్న ప్రసాదం ఏ రకం!
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Embed widget