By: ABP Desam | Updated at : 22 Jun 2023 06:27 PM (IST)
ఒకటి కంటే ఎక్కువ ఫామ్-16లు ఉంటే ఐటీ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి?
Multiple Form-16: గత ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు మారారా?, మీ సమాధానం అవును అయితే, ఇన్‌కం టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడంలో మీకు కాస్త ఇబ్బంది ఎదురుకావచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసిన టాక్స్‌పేయర్లు ఒకటి కంటే ఎక్కువ ఫామ్-16 పొందుతారు. దానివల్ల, రిటర్న్ దాఖలు చేసేటప్పుడు మొత్తం ఆదాయం, డిడక్షన్స్ లెక్క తేలక తికమక పడతారు.
ఆదాయపు పన్ను పత్రాలు దాఖలు చేయడానికి అత్యంత కీలక డాక్యుమెంట్ ఫామ్-16. ఇది రకమైన TDS సర్టిఫికేట్. యాజమాన్య కంపెనీ తన ఉద్యోగికి దీనిని జారీ చేస్తుంది. ఇందులో.. జీతం నుంచి వచ్చే ఆదాయం, ఎగ్జమ్షన్స్, డిడక్షన్స్, జీతం నుంచి తీసేసిన TDS (Tax deducted at Source) గురించిన సమాచారం ఉంది.
ఉద్యోగం మారుతున్నప్పుడు ఈ పని చేయండి
మీరు ఆర్థిక సంవత్సరం మధ్యలో (ఏప్రిల్ 1- మార్చి 31 మధ్య కాలంలో) ఉద్యోగం మారితే, మొదట ఫారం-12Bని కొత్త యజమానికి ఇవ్వాలి. ఈ ఫారమ్-12Bని పాత కంపెనీ నుంచి తీసుకోవాలి. పాత కంపెనీ నుంచి పొందిన జీతం, HRA వంటి మినహాయింపులు, సెక్షన్ 80C, సెక్షన్ 80D వంటి డిడక్షన్స్ అందులో ఉంటాయి. TDS కూడా ఉంటుంది. కొత్త కంపెనీ, మొత్తం సంవత్సరానికి మీ పన్ను బాధ్యతను (Tax liability) లెక్కించేటప్పుడు ఫారం-12Bని ఉపయోగించుకుంటుంది. కంబైన్ ఫారం-16ని జారీ చేస్తుంది.
ఫారం-12B ఇవ్వకపోతే ఇలా చేయండి
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారి, కొత్త కంపెనీకి ఫారం-12Bని మీరు ఇవ్వకుంటే ఏం చేయాలి?. పాత కంపెనీతో పాటు, కొత్త కంపెనీ కూడా మీకు ఫామ్-16 జారీ చేస్తుంది. అంటే, మీ దగ్గర రెండు ఫామ్-16లు ఉంటాయి. అలాంటి సందర్భంలో రిటర్న్ దాఖలు చేసేటప్పుడు రెండు ఫారం-16ల్లో ఉన్న గ్రాస్ శాలరీని కలపండి. ఇది, టోటల్‌గా మీ గ్రాస్ శాలరీ అవుతుంది. అదేవిధంగా, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), LTA వంటి మినహాయింపు మొత్తాన్ని ఫామ్-16 రెండింటి నుంచి యాడ్ చేయాలి. తద్వారా మినహాయింపు మొత్తాన్ని తెలుసుకోవచ్చు. స్థూల జీతం మొత్తం నుంచి అలవెన్స్‌లు తీసేసిన తర్వాత, 'ఇన్‌కమ్ ఛార్జబుల్ అండర్ శాలరీ హెడ్' వస్తుంది.
జీతం కాకుండా, సేవింగ్స్ అకౌంట్, FD మీద వడ్డీ లేదా ఇతర మార్గాల నుంచి ఆదాయం ఉంటే, మీరు దానిని 'ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్'లో చూపించాలి. ఆ తర్వాత మీ టోటల్ గ్రాస్ ఇన్‌కమ్ వస్తుంది. తదుపరి దశ 80C, 80D వంటి డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం. ఈ తగ్గింపులను తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తం 'నెట్ టాక్సబుల్ ఇన్‌కమ్' అవుతుంది. ఫారం-16లో రెండు కంపెనీలు ఒకే రకమైన డిడక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, మీరు ఆదాయంపై ఒక్కసారి మాత్రమే డిడక్షన్ తీసుకోవాలి. స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.
వివరాలన్నీ సరిపోలాలి
పన్ను విధించదగిన ఆదాయాన్ని లెక్కించిన తర్వాత, ఇప్పుడు టాక్స్ లయబిలిటీ లెక్కించాలి. ఫారం-16 రెండింటిలోనూ TDS తీసేస్తే, రిటర్న్‌లో అదే చూపండి. ఇప్పుడు మీరు చెల్లించాల్సిన పన్ను ఎంత ఉందో తెలుస్తుంది. TDS రూట్‌లో ఎక్కువ మొత్తం కట్ అయి, మీరు చెల్లించాల్సిన పన్ను తక్కువగా ఉంటే, మీకు రిఫండ్ వస్తుంది. ఫారం-16లో తీసేసిన TDS తప్పనిసరిగా IT డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫారం-26AS, AIS ఉన్న సమాచారంతో సరిపోలాలి.
మీరు కొత్త కంపెనీ నుంచి ఫారం-16 అందుకున్నా, పాత కంపెనీ ఇవ్వకపోతే... పాత కంపెనీ పే స్లిప్ అవసరం అవుతుంది. మంత్లీ శాలరీ, ఎగ్జమ్షన్ జోడించడం ద్వారా మీ జీతం నుంచి వచ్చే ఆదాయం తెలుస్తుంది. రెండు కంపెనీల నుంచి కట్ చేసిన TDS సమాచారం ఫామ్-26ASలో ఉంటుంది. సెక్షన్ 80C వంటి తగ్గింపులను క్లెయిమ్ చేసిన తర్వాత నికరంగా పన్ను విధించదగిన ఆదాయం తెలుస్తుంది.
ఈ తప్పు చేస్తే నోటీసు వస్తుంది
రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు, కొత్త కంపెనీ నుంచి తీసుకున్న ఫామ్-16 ఆధారంగా మాత్రమే ఆదాయాన్ని చూపాలని చాలామంది తప్పుగా భావిస్తున్నారు. ఈ కారణంగా, రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసు అందుకుంటున్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కంపెనీల్లో పని చేస్తే, అన్ని కంపెనీల నుంచి పొందిన జీతపు ఆదాయాన్ని తప్పనిసరిగా రిటర్న్‌లో చూపాలి.
మరో ఆసక్తికర కథనం: షేర్ల బైబ్యాక్ ప్రారంభం, అప్లై చేసే ముందు ఈ 10 విషయాలు తెలుసుకోండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Loan Against FD: ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే ఈజీగా లోన్, ఎఫ్డీని రద్దు చేసే పని లేదు
Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి
Interest Rates Reduced: లోన్ తీసుకునేవాళ్లకు గుడ్ న్యూస్, ఈ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి
Gold-Silver Prices Today 11 April: పసిడి రికార్డ్, 97,000 దాటిన రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Stock Market Opening: భారతీయ మార్కెట్లలో జోష్, సెన్సెక్స్ 1000pts జంప్ - గ్లోబల్ మార్కెటు డీలా పడ్డా బేఖాతరు
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?