Top Headlines Today: తెలంగాణలో బీసీ కార్డు తీయబోతున్న కాంగ్రెస్- ఎన్నికల వరకు ప్రజల్లో ఉండేలా వైసీపీ ప్లాన్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today
కాంగ్రెస్ బీసీ కార్డు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎప్పుడూ లేనంత పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రతీ సారి ఎన్నికలు అంటే సీనియర్లంతా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. తమ వర్గానికే టిక్కెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తూంటారు. ఈ సారి కూడా అలాంటివి ఉన్నా బయటకు రానివ్వడం లేదు. అంతర్గతంగా పూర్తి చేసేసుకుంటున్నారు. అదే సమయంలో వ్యూహాత్మకంగా ప్రచార కార్యక్రమాలు ఖరారు చేసుకుంటున్నారు. భారీ బహిరంగసభలు నెలకు రెండు, మూడు వారాలకు ఒకటి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవలే తుక్కుగూడ బహిరంగసభను భారీగా నిర్వహించిన నేతలు వచ్చే నెల పదో తేదీన బీసీ గర్జన నిర్వహించాలని నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వాహన మిత్ర నిధులు
ఆటో డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. వైఎస్సార్ వాహనమిత్ర నగదును ఈ నెల 29న విడుదల చేయనుంది. ఆ రోజున కాకినాడలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు విధుల చేయనున్నారు. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ, మాక్సీ డ్రైవర్ల అకౌంట్లలో రూ.10 వేలు జమ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జగన్ సభకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్రజల్లోకి వైసీపీ
ఏపీలో నిన్నామొన్నటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఎటు చూసినా కనిపించేవారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తూంటే.. చంద్రబాబు జిల్లాలు తిరిగేవారు. కానీ చంద్రబాబు అరెస్టుతో టీడీపీ కార్యక్రమాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు వైసీపీ ప్రారంభించాలనుకుంటోంది. పల్లెకుపోదాం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టీమిండియా శుభారంభం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది. శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 48.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వికెట్లు తీసిన భారత పేసర్ మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజీనామా
కొంతకాలంగా బీఆర్ఎస్ లో రెబల్‌గా మారిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉంటారా? పార్టీని వీడతారా? అని కొంత కాలంగా ఊగిసలాటలు నడిచిన సంగతి తెలిసిందే. కనీసం ఆయన అనుచరుల్లో కూడా క్లారిటీ లేకుండా ఉంది. తాజాగా బీఆర్ఎస్‌కు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
విక్రమ్, ప్రగ్యాన్ రోవర్ నిద్రలేపేందుకు ప్రయత్నం
గత 14 రోజులుగా చంద్రుడి ఉపరితలంపై నిద్రాణ స్థితిలో (స్లీప్ మోడ్) చంద్రయాన్ 3లోని ల్యాండర్ విక్రమ్, ప్రగ్యాన్ రోవర్‌లను వేక్ అప్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇస్రో అధికారులు ప్రకటించారు. మళ్లీ గ్రౌండ్ స్టేషన్‌తో కమ్యూనికేషన్‌ని ఏర్పాటు చేయాలని సైంటిస్ట్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటిదాకా విక్రమ్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ అందలేదని ఇస్రో అధికారులు తెలిపారు. వీటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేలా విక్రమ్, ప్రగ్యాన్‌ను స్లీప్ మోడ్ నుంచి వేక్ అప్ చేయడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఇస్రో అధికారులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
'ఘోస్ట్' పాట విడుదల
కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయకులలో ఒకరైన శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) నటించిన పాన్ ఇండియా యాక్షన్ సినిమా 'ఘోస్ట్' (Ghost Movie). హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన చిత్రమిది. విజయ దశమి బరిలో విడుదల అవుతోంది. అక్టోబర్ 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇందులో తొలి పాటను తాజాగా విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బుల్లి తెరపై అలరించనున్న మంచువారబ్బాయి
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు చిన్న కొడుకుగా 'దొంగ దొంగది' సినిమాతో హీరోగా పరిచయమైన రాకింగ్ స్టార్ మంచు మనోజ్.. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ 2017లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' సినిమా తర్వాత హీరోగా బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. దాదాపు ఆరేళ్ళు బ్రేక్ తీసుకున్న మనోజ్.. ఇప్పుడు మళ్లీ ట్రాక్ ఎక్కారు. ‘వాట్ ది ఫిష్’ అనే మూవీ చేస్తున్నారు. అయితే మంచువారబ్బాయ్ అంతకంటే ముందుగా హోస్ట్ అవతారమెత్తి, బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సిల్క్ కొరికిన యాపిల్
సినీ సెలబ్రిటీల పేరుకు, వారి ఉపయోగించే వస్తువులకు.. అన్నింటికి ఒక బ్రాండ్ ఉంటుంది. వారి స్టైల్‌ను ఇమిటేట్ చేయాలని, వారిలాగా స్టైలింగ్ చేసుకోవాలని చాలామంది ప్రేక్షకులకు ఉంటుంది. అంతే కాకుండా ఒకప్పుడు వారు ఉపయోగించిన వస్తువులను కొనుగోలు చేసి ఉపయోగించాలన్నా ఆశ కూడా ఉంటుంది. అందుకే సినీ సెలబ్రిటీల వస్తువులకు వేలంపాట కూడా జరుగుతుంది. అలా ఒకప్పుడు సిల్క్ స్మిత కొరికిన యాపిల్‌కు వేలంపాట జరిగింది. అప్పట్లోనే దీనిని చూసి అందరూ షాకయ్యారు. తాజాగా మరోసారి సిల్క్ స్మిత కొరికిన యాపిల్ వేలంపాట గురించి మరోసారి వార్తలు వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బంగాళాదుంపలతో అంత ముప్పా!
బంగాళాదుంపలు చాలా మంది ఫేవరెట్. ఉడికించుకుని, వేయించికుని, కాల్చుకుని ఎలా తిన్నా రుచి బాగుంటుంది. పకోడా, కట్ లెట్, పరోటాలో ఆలూ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అయితే వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటూ ఉంటారు. ఒక నెలరోజుల పాటు బంగాళాదుంపలు తీసుకోవడం మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఆహార నిపుణులు చెప్పుకొచ్చారు. సాధారణంగా వీటిని ఎక్కువ నూనె ఉపయోగించి వండుతారు. వాటిని తినడం మానేస్తే ఆహారంలో అదనపు కేలరీలు చేర్చడం నివారించినట్టు. దీని వల్ల బరువు పెరగకుండా ఉంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి