News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Silk Smitha: సిల్క్ స్మిత కొరికిన యాపిల్ - వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలుసా?

సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో వస్తువులు వేలంపాటలోకి వస్తూ ఉంటాయి. ఒకప్పుడు సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్ కూడా అలాగే వేలంపాటలోకి వెళ్లింది.

FOLLOW US: 
Share:

సినీ సెలబ్రిటీల పేరుకు, వారి ఉపయోగించే వస్తువులకు.. అన్నింటికి ఒక బ్రాండ్ ఉంటుంది. వారి స్టైల్‌ను ఇమిటేట్ చేయాలని, వారిలాగా స్టైలింగ్ చేసుకోవాలని చాలామంది ప్రేక్షకులకు ఉంటుంది. అంతే కాకుండా ఒకప్పుడు వారు ఉపయోగించిన వస్తువులను కొనుగోలు చేసి ఉపయోగించాలన్నా ఆశ కూడా ఉంటుంది. అందుకే సినీ సెలబ్రిటీల వస్తువులకు వేలంపాట కూడా జరుగుతుంది. అలా ఒకప్పుడు సిల్క్ స్మిత కొరికిన యాపిల్‌కు వేలంపాట జరిగింది. అప్పట్లోనే దీనిని చూసి అందరూ షాకయ్యారు. తాజాగా మరోసారి సిల్క్ స్మిత కొరికిన యాపిల్ వేలంపాట గురించి మరోసారి వార్తలు వైరల్ అయ్యాయి.

కొరికిన యాపిల్ కథ..
ఒకప్పుడు బోల్డ్ పాత్రలు చేయాలన్నా, బోల్డ్ సినిమాల్లో నటించాలన్నా ఎక్కువగా నటీమణులు ముందుకు వచ్చేవారు కాదు. అలాంటి జెనరేషన్‌లో వచ్చి ఒక సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది సిల్క్ స్మిత. ఎంత స్టార్ హీరో అయినా సిల్క్ స్మిత పాట ఉండాల్సిందే. అలా ఎంతోమంది స్టార్ హీరోలతో స్టెప్పులేసి, ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో కనిపించింది సిల్క్. తన స్క్రీన్ ప్రెసెన్స్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో.. తన మరణ వార్త కూడా అంతే సెన్సేషన్‌గా నిలిచింది. అసలు తను ఎందుకు చనిపోయింది అనే విషయం ఇప్పటికీ సరిగా తెలియలేదు. కానీ అప్పట్లో సిల్క్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ బయటికొచ్చింది.

ధర క్లారిటీ లేదు..
తాజాగా వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ఒకసారి సిల్క్ స్మిత.. సినిమా షూటింగ్‌లో ఉంది. ఆ షూటింగ్ బ్రేక్ సమయంలో తను ఒక యాపిల్‌ను తిన్నారట. అప్పుడే షాట్ రెడీ అవ్వడంతో కొరికిన యాపిల్‌ను అక్కడ పెట్టేసి తను వెళ్లిపోయిందట. ఆ సమయంలో షూట్‌లో ఉన్న ఒక వ్యక్తి.. ఆ యాపిల్‌ను తీసుకొని పారిపోయాడట. ఆ తర్వాత ఆ యాపిల్‌కు వేలంపాట కూడా నిర్వహించాడట. వినడానికి వింతగా ఉన్నా.. ఇది చాలావరకు నిజమని సమాచారం. కానీ ఎంత ధరకు ఆ వేలంపాటలో యాపిల్ అమ్ముడుపోయిందని క్లియర్‌గా తెలియదు. కొందరు ఆ ధరను రూ.2 అంటారు. మరికొందరు రూ.200 అంటారు. మరికొన్ని వార్తలో అయితే ఈ ధర ఏకంగా రూ.26,000 అని ఉంది. మరికొన్నింటిలో ఏకంగా ఈ ధర రూ.1 లక్ష అని తెలుస్తోంది. కానీ ఇందులో ఏది నిజమని మాత్రం స్పష్టంగా తెలియదు.

ఒకప్పటి సెన్సేషన్..
ఒక తెలుగు కుటుంబంలో విజయలక్ష్మి వడ్లపాటిగా జన్మించిన సిల్క్ స్మిత.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరు మాత్రమే కాదు.. జీవితం కూడా మారిపోయింది. ‘వండిచక్కరం’ అనే చిత్రంలో సిల్క్ డెబ్యూ.. అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా సిల్క్ స్మిత.. తన సత్తాను చాటింది. ఆ తర్వాత తన పర్సనల్ లైఫ్‌లోని సమస్యలు.. సిల్క్ జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పాయి. సినిమాల విషయంలో తప్పుదోవ పట్టేలా చేశాయి. దీంతో సినీ పరిశ్రమలో ఆకాశాన్ని అందుకున్న సిల్క్.. ఒక్కసారిగా కనుమరుగయిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన మరణ వార్త అందరినీ షాక్‌కు గురిచేసింది. దాదాపు సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా ‘ది డర్టీ పిక్చర్’ అనే హిందీ చిత్రం కూడా తెరకెక్కింది.

Also Read: ఏఐ టెక్నాలజీపై కోర్టుకెక్కిన అనిల్ కపూర్ - పర్సనాలిటీ రైట్స్ కోసం పోరాటం, అసలు వాటి అర్థమేంటి?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 23 Sep 2023 12:47 AM (IST) Tags: Auction Apple Silk Smitha The Dirty Picture

ఇవి కూడా చూడండి

Rashmika Mandanna: అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రశంసలు - రష్మిక నటనకు నెటిజన్లు ఫిదా

Rashmika Mandanna: అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రశంసలు - రష్మిక నటనకు నెటిజన్లు ఫిదా

‘సలార్’పై కొత్త డౌట్స్, ‘యానిమల్’ వసూళ్ల వర్షం - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సలార్’పై కొత్త డౌట్స్, ‘యానిమల్’ వసూళ్ల వర్షం  - నేటి టాప్ సినీ విశేషాలివే!

Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ

Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ

Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Avika gor: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్

Avika gor: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత