అన్వేషించండి

Anil Kapoor: ఏఐ టెక్నాలజీపై కోర్టుకెక్కిన అనిల్ కపూర్ - పర్సనాలిటీ రైట్స్ కోసం పోరాటం, అసలు వాటి అర్థమేంటి?

భారతదేశంలోని రాజ్యాంగంలో ఉన్న చాలా హక్కుల గురించి ప్రజలకు తెలియదు. అందులో పర్సనాలిటీ రైట్స్ కూడా ఒకటి. బాలీవుడ్ సెలబ్రిటీ అనిల్ కపూర్ కారణంగా ఇప్పుడు ఈ రైట్స్ వెలుగులోకి వచ్చాయి.

సినీ సెలబ్రటీల పేర్లు అంటే కేవలం పేర్లు మాత్రమే కాదు.. అవి బ్రాండ్స్ అని అంటుంటారు ఫ్యాన్స్. మరి బ్రాండ్స్‌కు రైట్స్ ఉన్నట్టుగానే సినీ సెలబ్రిటీల పేర్లకు కూడా రైట్స్ ఉంటాయి. ఈ విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియదు. కానీ ఇప్పటికే రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి సెలబ్రిటీలు తమ పేరు మీద పర్సనాలిటీ రైట్స్ తీసుకున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా చేరారు. తన పేరును థర్డ్ పార్టీలు తప్పుగా వినియోగించుకోకూడదని ఆలోచనతో ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. తాజాగా ఢిల్లీ హైకోర్టు అనిల్ కపూర్ ప్లీని యాక్సెప్ట్ చేసింది.

అసలు పర్సనాలిటీ హక్కు అంటే ఏంటి..?

ఒక వ్యక్తికి చెందిన పేరు, గొంతు, సంతకం, ఫోటోలు.. ఇలా ఒక సెలబ్రిటీకి సంబంధించిన ఏ ఒక్క ఐడెంటిటీని ప్రేక్షకులు గుర్తుపట్టినా.. అది సెలబ్రిటీ పర్సనాలిటీ అనే కేటగిరిలోకి వస్తుంది. దానినే మామూలుగా ‘పర్సనాలిటీ రైట్స్’ అంటారు. కేవలం సంతకం, ఫోటోలు మాత్రమే కాదు.. పోజులు, మ్యానరిజం కూడా ఈ పర్సనాలిటీ రైట్స్‌లో భాగమే. చాలామంది సెలబ్రిటీలు.. తాము చేసే రెగ్యులర్ విషయాలకు కూడా రైట్స్ తీసుకుంటారు. ఉదాహరణకు రన్నర్ ఉస్సేన్ బోల్ట్.. తన రన్నింగ్ పోజును ట్రేడ్‌మార్క్‌లాగా భావించి పర్సనాలిటీ రైట్స్ తీసుకున్నాడు. పర్సనాలిటీ రైట్స్ తీసుకోడానికి ముఖ్య కారణం.. దాని నుంచి వారు కమర్షియల్‌గా సంపాదించవచ్చు. అంటే పర్సనాలిటీ రైట్స్ లేకపోతే.. సెలబ్రిటీలకు ఎంతోకొంత నష్టం అనే అర్థం.

మొత్తంగా 16 ఐడెంటిటీలు

పర్సనాలిటీ రైట్స్ అనేవి మిగిలిన రైట్స్‌లాగా కాదు. దీని గురించి ఎక్కువమందికి తెలియదు. ఢిల్లీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టు కూడా ఇండియాలో ఇంకా ఈ చట్టం మొదటి దశలోనే ఉందని పేర్కొన్నాయి. ప్రాపర్టీ రైట్స్‌లో ఉండే ఎన్నో లక్షణాలు పర్సనాలిటీ రైట్స్‌లో కూడా ఉంటాయి. అనిల్ కపూర్ విషయానికొస్తే.. ఈ సీనియర్ హీరోకు సంబంధించి 16 ఐడెంటిటీలను పర్సనాలిటీ రైట్స్‌లో చేర్చింది. అనిల్ కపూర్ పేరుతోపాటు ఆయన ఫొటోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన రూపం, వాయిస్‌ను ఎవరైనా అనుకరించినా ఆయన హక్కులను ఉల్లంఘించినట్లే. అలాగే ఫేస్ మార్ఫింగ్ పాల్పడినా, ప్రకటనల్లో ఆయన ముఖాన్ని వాడినా అనిల్ కపూర్ వారిపై కేసు వేసి గెలవచ్చు. ఈ విషయంలో అవతలి పార్టీ అసలు ఏ ఉద్దేశ్యంతో అలా చేశారు అని వినాల్సిన అవసరం కూడా అనిల్ కపూర్‌కు లేదు.

అప్పుడు అమితాబ్.. ఇప్పుడు అనిల్

సినీ సెలబ్రిటీల ఐడెంటిటీని ఉపయోగించాలని చాలామంది అనుకుంటారు. కానీ అందులో ఎవరు, ఎలా ఉపయోగిస్తారు అని ఎప్పటికీ ట్రాక్ చేస్తూ ఉండడం సెలబ్రిటీలకు కూడా సాధ్యమైన విషయం కాదు. అలాంటి వారిపై యాక్షన్ తీసుకోవడానికి గూగుల్ సాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ దానికంటూ ప్రత్యేకమైన ఖరీదు ఉంటుంది. కమర్షియల్ పరంగా సెలబ్రిటీలు ఎదుర్కునే నష్టంతో పోలిస్తే ఈ ఛార్జీలు తక్కువే ఉంటాయి. అనిల్ కపూర్‌కు సంబంధించిన చాలా ఐడెంటిటీలు తప్పుగా వినియోగించబడుతున్నాయని తన తరపున లాయర్ ప్రవీణ్ ఆనంద్ వాదనలు వినిపించారు. ఉదాహరణకు అనిల్ కపూర్ తరచుగా ఉపయోగించే ‘ఝకాస్’ అనే పదాన్ని ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలు వినియోగించుకున్నాయి. అనిల్ కపూర్ కంటే ముందుగా బాలీవుడ్ సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్.. ఈ పర్సనాలిటీ రైట్స్‌ను తీసుకున్నారు. 

Also Read: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Roster Dating : ఎవరితోనైనా, ఎందరితోనైనా, ఎప్పుడైనా డేట్ చేయొచ్చట.. రోస్టర్ డేటింగ్​లో అమ్మాయిలదే హవా
ఎవరితోనైనా, ఎందరితోనైనా, ఎప్పుడైనా డేట్ చేయొచ్చట.. రోస్టర్ డేటింగ్​లో అమ్మాయిలదే హవా
Balagam Mogilaiah: అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
అనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు
Embed widget