By: ABP Desam | Updated at : 23 Sep 2023 08:00 AM (IST)
సమస్యల్లో టీడీపీ - పల్లెలకు వైసీపీ ! అధికార పార్టీ మాస్టర్ ప్లాన్
YSRCP : ఏపీలో నిన్నామొన్నటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారాలోకేష్ ఎటు చూసినా కనిపించేవారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తూంటే.. చంద్రబాబు జిల్లాలు తిరిగేవారు. కానీ చంద్రబాబు అరెస్టుతో టీడీపీ కార్యక్రమాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు వైసీపీ ప్రారంభించాలనుకుంటోంది. పల్లెకుపోదాం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది.
పొత్తులకు కౌంటర్ ఇచ్చేలా వ్యూహం
టీడీపీ, జనసేనల మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్లు అధికారికంగా పొత్తులు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పొత్తుపై వైసీపీ విమర్శలు చేస్తున్నప్పటికీ గట్టి కౌంటర్ ఇవ్వకపోతే నష్టపోతామన్న అంచనాలో ున్నారు. పొత్తు ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనని ఆందోళన చెందుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.‘పల్లెకు పోదాం’ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పల్లె ప్రజల దగ్గరకు వెళ్లేలా ఐ ప్యాక్ కార్యక్రమం
రాష్ట్రంలో వైసీపీ పరిస్థితిపై నివేదిక రూపొందించిన ఐప్యాక్ టీం పల్లెకు పోదాం అనే కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐప్యాక్ టీం రూపొందించిన ఈ కార్యక్రమానికి వైసీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమ నిర్వహణపై సీఎం జగన్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్య నేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు అటు ఐప్యాక్ టీంతో వరుస సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనేదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామాలతోపాటు, పట్టణాల్లో కూడా మరింత బలం పెంచుకునేందుకు ఈ పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు. రీజినల్ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు తీసుకుని రోడ్ మ్యాప్ తయారు చేయాలనుకుంటున్నారు.
స్థానిక నేతలకే ప్రాధాన్యం
పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా వైసీపీ మండల అధ్యక్షులు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ప్రతీ మండల వైసీపీ అధ్యక్షుడు లబ్ధిదారులతో భేటీ కావడంతోపాటు రాబోయే రోజుల్లో వైసీపీ ఓటు బ్యాంకుపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా మండల అధ్యక్షుడు ప్రతి రోజూ తన మండల పరిధిలోని ఒక సచివాలయాన్ని ఎంపిక చేసుకుని...ఆ సచివాలయానికి ఉదయమే వెళ్లి అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అనంతరం ఆ సచివాలయం పరిధిలో లబ్దిదారుల జాబితాను విడుదల చేసి వారితో మమేకం అవుతారు. అనంతరం ముఖాముఖి నిర్వహిస్తారు. మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరనున్నారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారం అనంతరం గ్రామస్థాయిలోని పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు.గ్రామ స్థాయి నుంచి పార్టీ నాయకుల మధ్య విభేధాలపై ఫోకస్ పెడతారు. పార్టీ ముఖ్య నేతల మధ్య అగాధం పూడ్చేందుకు విందు రాజకీయం సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో చేరికలపైనా ప్రత్యేకంగా చర్చించనున్నారు.
త్వరలో సీఎం జగన్ జిల్లాల పర్యటన
దసరా నుంచి విశాఖకు మారాలని జగన్ అనుకుంటున్నారు. వారంలో రెండు రోజులు విశాఖలో మూడు రోజులు జిల్లాల పర్యటనలు చేయాలనుకుంటున్నారని అంటున్నారు. టీడీపీని కేసుల ఉచ్చులో చిక్కేలా చేసి.. తాము రాష్ట్రాన్ని చుట్టేయాలనుకుంటున్నారని.. ఈ దెబ్బతో టీడీపీ డీలా పడిపోతుందని చెబుతున్నారు.
Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్
Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
Telangana Assembly : 15న స్పీకర్ ఎన్నిక - విపక్షాలు పోటీ పెడతాయా ?
Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
ఛత్తీస్గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!
Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి
India vs England Women : సిరీస్ ఇంగ్లాండ్ మహిళలదే, రెండో టీ 20లోనూ భారత్ చిత్తు
/body>