By: ABP Desam | Updated at : 22 Sep 2023 09:59 PM (IST)
మైనంపల్లి హనుమంతరావు (ఫైల్ ఫోటో)
కొంతకాలంగా బీఆర్ఎస్ లో రెబల్‌గా మారిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఉంటారా? పార్టీని వీడతారా? అని కొంత కాలంగా ఊగిసలాటలు నడిచిన సంగతి తెలిసిందే. కనీసం ఆయన అనుచరుల్లో కూడా క్లారిటీ లేకుండా ఉంది. తాజాగా బీఆర్ఎస్‌కు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
బీఆర్ఎస్ పార్టీలో రెండు టికెట్లు ఆశించిన మైనంపల్లి
బీఆర్ఎస్ పార్టీలో తనకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని మైనంపల్లి హనుమంతరావు కోరిన సంగతి తెలిసిందే. తన సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరి సహా, తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కోసం మెదక్ స్థానం ఇవ్వాలని కోరారు. అందుకు అధిష్ఠానం ఒప్పుకోలేదు. కొద్ది వారాల క్రితం విడుదల చేసిన తొలి విడత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కేవలం మైనంపల్లి హనుమంతరావుకు మాత్రమే టికెట్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. నిజానికి అంతకుముందే మైనంపల్లి రెబల్ గా మారినప్పటికీ, అభ్యర్థుల ప్రకటనలో ఆయన పేరును తొలగించలేదు.
తర్వాత తనకు పార్టీ కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని మైనంపల్లి చాలా సందర్భాల్లో చెప్పారు. తాను కేసీఆర్, కేటీఆర్ చివరికి ఆ దేవుణ్ని కూడా లెక్క చేయబోనని అన్నట్లుగా ఆడియో టేప్‌లు కూడా వైరల్ అయ్యాయి. తనకు రెండు టికెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ ను మాత్రం ఆయన వదల్లేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో ఎదురుతిరిగి.. అసలు ఆయన పార్టీలో ఉంటారా? లేక కాంగ్రెస్ లో చేరతారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు, మైనంపల్లి పైన బీఆర్ఎస్ అధిష్ఠానం కూడా ఎలాంటి క్రమ శిక్షణ చర్యలు తీసుకోలేదు.
ఏ చర్యలూ తీసుకోని బీఆర్ఎస్
మైనంపల్లి అడుగులు ఎటు వైపు వేస్తారో అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. తన భవిష్యత్ కార్యాచరణను ఆయన ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఇప్పటికే రెండు సార్లు తన నిర్ణయాన్ని వాయిదా వేసిన మైనంపల్లి మంత్రి కేటీఆర్‌తో భేటీకి ఆవకాశం ఉన్నప్పటికీ ప్రయత్నించడం లేదు. సీఎం కేసీఆర్‌ను కలిసి స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ధిక్కార స్వరం వినిపించిన మైనంపల్లిని ప్రోత్సహిస్తే.. ఇతరులు కూడా అదే పని చేసే అవకాశం ఉంటుందని అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని నేతలు హైకమాండ్‌కు సూచిస్తున్నారు.
TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
TS LAWCET: టీఎస్ లాసెట్ - 2023 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్య తేదీలివే!
గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అస్పష్టత, షెడ్యూలు ప్రకారం జరిగేనా?
Nara Lokesh: '3 నెలల్లో ప్రజా ప్రభుత్వం' - అధికారంలోకి వస్తే ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యమన్న నారా లోకేశ్
Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్- తప్పులేదన్న సజ్జనార్
MP Dheeraj Sahu: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నోట్ల కట్టు- లెక్కించడానికి 80 మంది సిబ్బంది
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
/body>