News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Potato: నెలరోజుల పాటు బంగాళాదుంప తినడం మానేస్తే ఏమౌతుందో తెలుసా?

ఆలూతో చేసిన ఏ వంటకం అయినా కూడ రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ వాటి అధిక వినియోగం అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

FOLLOW US: 
Share:

బంగాళాదుంపలు చాలా మంది ఫేవరెట్. ఉడికించుకుని, వేయించికుని, కాల్చుకుని ఎలా తిన్నా రుచి బాగుంటుంది. పకోడా, కట్ లెట్, పరోటాలో ఆలూ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అయితే వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటూ ఉంటారు. ఒక నెలరోజుల పాటు బంగాళాదుంపలు తీసుకోవడం మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఆహార నిపుణులు చెప్పుకొచ్చారు. సాధారణంగా వీటిని ఎక్కువ నూనె ఉపయోగించి వండుతారు. వాటిని తినడం మానేస్తే ఆహారంలో అదనపు కేలరీలు చేర్చడం నివారించినట్టు. దీని వల్ల బరువు పెరగకుండా ఉంటారు.

బంగాళాదుంపలు రక్తంలో చక్కెర స్థాయిలని ఆకస్మికంగా పెంచుతాయి. అందుకే మధుమేహులు వీటిని తీసుకోవడం తగ్గించుకోవాలని చెప్తూ ఉంటారు. గ్లూకోజ్ స్థాయిలని నియంత్రించడం కోసం బంగాళాదుంపలు తొలగించడం వల్ల కార్బోహైడ్రేట్ తీసుకోవడం తగ్గుతుంది. జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బంగాళాదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ అత్యంత ప్రాసెస్ చేసిన్ ఆహార ఉత్పత్తులు. వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం వంటి ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. ఇవి డైటరీ ఫైబర్ ని కలిగి ఉంటాయి. సేఫ్ స్టార్చ్ అనేది కొన్ని బంగాళాదుంపలలో కనిపించే ఒక రకమైన ఫైబర్. ఇది ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది గట్‌లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. అందుకే బంగాళాదుంపలు వేయించిన వాటి కంటే ఉడికించినవి తీసుకుంటే మంచిది.

బంగాళాదుంపలకి బదులు వీటిని వాడండి

⦿బంగాళాదుంపలు కట్లెట్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి చేస్తారు. వీటిని చేసేందుకు బంగాళాదుంపలకి బదులుగా పనీర్, సోయాతో చేసుకోవచ్చు.

⦿మామూలు బంగాళాదుంపలకు బదులుగా స్వీట్ పొటాటో(చిలగడదుంప) ఉపయోగించుకోవచ్చు. ఇవి రెండు ఇంచు మించు ఒకే విధంగా ఉంటాయి.

⦿క్యాలీఫ్లవర్ కూడా ఉపయోగించుకోవచ్చు.

⦿టర్నిప్ వెజిటబుల్ మంచి ప్రత్యామ్నాయం. ఈ రూట్ వెజిటబుల్ తక్కువ కార్బ్ కలిగి ఉంటాయి. స్టూ, సూప్ లేదా కాల్చుకుని అయినా తినొచ్చు.

⦿పండిన అరటిపండ్లు వేయించి లేదా కాల్చుకుని తినొచ్చు. అరటి కాయ చిప్స్ కూడా మంచి రుచిని అందిస్తాయి.

⦿గుమ్మడికాయ ముక్కలుగా లేదా తురిమిన విధంగా చేసుకుని స్నాక్స్ చేసుకోవచ్చు. ఇవి తక్కువ కార్బ్ ని కలిగి ఉంటాయి.

ఈ సమస్యలు ఉన్న వాళ్ళు తినకూడదు

బంగాళాదుంపలి తినేటప్పుడు కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. మధుమేహం ఉన్న వాళ్ళు, తక్కువ కార్బ్ ఆహారం తీసుకునే వ్యక్తుల్లో అలర్జీ, జీర్ణ సమస్యలు, మూత్ర పిండాల సమస్యలు, బరువు తగ్గించుకోవాలని అనుకునే వాళ్ళు బంగాళాదుంపలు తినకుండా ఉండటం మంచిది. వీటిని మితంగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులోని ఫైబర్ గట్ లో మంచి బ్యాక్టీరియాని ప్రోత్సహిస్తుంది. వేయించినవి కాకుండా ఆవిరితో ఉడికించి తింటే మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: తేనె నిజమైనదో కల్తీదో తెలుసుకోవాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి

Published at : 23 Sep 2023 07:53 AM (IST) Tags: Health Tips Potato Potato benefits Sweet Potato Potato Side Effects

ఇవి కూడా చూడండి

Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది

Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది

Stomach Cancer: కడుపులో ఇలా అనిపిస్తోందా? క్యాన్సర్ కావచ్చు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Stomach Cancer: కడుపులో ఇలా అనిపిస్తోందా? క్యాన్సర్ కావచ్చు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Nuvvula Chikki Recipe : పిల్లలకు చలికాలంలో నువ్వల చిక్కీ పెడితే ఎంతో మంచిది

Nuvvula Chikki Recipe :  పిల్లలకు చలికాలంలో నువ్వల చిక్కీ పెడితే ఎంతో మంచిది

Christmas Gift Ideas : క్రిస్మస్ స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం బడ్జెట్​ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే

Christmas Gift Ideas : క్రిస్మస్ స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం బడ్జెట్​ ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇవే

టాప్ స్టోరీస్

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?