News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Shiva Rajkumar : హాలీవుడ్ స్టైల్‌లో శివ రాజ్ కుమార్ 'ఘోస్ట్' ఫస్ట్ సాంగ్ - గ్యాంగ్‌స్టర్ మ్యూజిక్ విడుదల

కన్నడ హీరో శివ రాజ్ కుమార్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘోస్ట్'. ఇందులో తొలి పాటను తాజాగా విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయకులలో ఒకరైన శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) నటించిన పాన్ ఇండియా యాక్షన్ సినిమా 'ఘోస్ట్' (Ghost Movie). హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన చిత్రమిది. విజయ దశమి బరిలో విడుదల అవుతోంది. అక్టోబర్ 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇందులో తొలి పాటను తాజాగా విడుదల చేశారు. 

హాలీవుడ్ స్టైల్ సాంగ్!
చెన్నైలోని లయోలా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు సమక్షంలో 'ఘోస్ట్' సినిమాలో తొలి పాటను Ghost OGM పేరుతో విడుదల చేశారు. OGM అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మ్యూజిక్ అన్నమాట. ఇది హాలీవుడ్ స్టైల్ లో ఉందని శివన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   

Ghost OGM పాటకు అర్జున్ జన్యా సంగీతం అందించగా... ఐశ్వర్యా రంగరాజన్ ఆలపించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎంసీ చేతన్ ర్యాప్ రాయడంతో పాటు సాంగ్ పాడారు. ఇంగ్లీష్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్, ఆ తర్వాత సూఫీ స్టైల్ మ్యూజిక్... డిఫరెంట్ కంపొజిషన్ & స్టైలిష్ మేకింగ్ విజువల్స్... అన్నీ కలబోతగా ఈ సాంగ్ వెరైటీగా ఉంది. 

Also Read : బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?

అక్టోబర్ 19న 'ఘోస్ట్' విడుదల
Ghost Release Date : అక్టోబర్ 19న 'ఘోస్ట్' చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో బాలకృష్ణ 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు', తమిళ హీరో విజయ్ 'లియో' సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. 

Also Read : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

అక్టోబర్ రెండో వారం నుంచి స్పెషల్ ప్రీమియర్స్!
థియేటర్లలో సినిమా విడుదలకు వారం ముందు నుంచి స్పెషల్ ప్రీమియర్ షోలు వేయడానికి ప్లాన్ చేశారు. అక్టోబర్ రెండో వారం నుంచి ఇండియాలోని పలు నగరాల్లో షోలు వేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. 'ఘోస్ట్' చిత్రానికి కన్నడ హిట్ 'బీర్బల్' ఫేమ్ శ్రీని దర్శకుడు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై 31వ సినిమాగా ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు.   
 
అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయన్, అర్చనా జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న తదితరులు నటిస్తున్న 'ఘోస్ట్' చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ: చేతన్ డిసౌజా, వెంకట్ (హైదరాబాద్), అర్జున్ రాజ్, మాస్ మద, కూర్పు : దీపు ఎస్ కుమార్, ఛాయాగ్రహణం : మహేంద్ర సింహ, సంగీతం: అర్జున్ జన్య, సమర్పణ : ఎమ్మెల్సీ సందేశ్ నాగరాజ్, కథ - దర్శకత్వం: శ్రీని.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 23 Sep 2023 08:37 AM (IST) Tags: Ghost Movie Shiva Rajkumar latest telugu news Original Gangster Music

ఇవి కూడా చూడండి

Rashmika Mandanna: అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రశంసలు - రష్మిక నటనకు నెటిజన్లు ఫిదా

Rashmika Mandanna: అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రశంసలు - రష్మిక నటనకు నెటిజన్లు ఫిదా

‘సలార్’పై కొత్త డౌట్స్, ‘యానిమల్’ వసూళ్ల వర్షం - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సలార్’పై కొత్త డౌట్స్, ‘యానిమల్’ వసూళ్ల వర్షం  - నేటి టాప్ సినీ విశేషాలివే!

Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ

Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ

Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

Avika gor: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్

Avika gor: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
×