Top 10 Headlines Today: కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణకు ఆ నేతలు ఎందుకు రాలేదు? జగన్ పదే పదే అవే విమర్శలు ఎందుకు చేస్తున్నారు?
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
కిషన్ రెడ్డి నియామకం ఎఫెక్ట్
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ కార్యక్రమం వేదికగా జరిగిన పరిణామాలు చూస్తూంటే బీజేపీలో పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగకపోగా.. మరింతగా ముదిరాయన్న అభిప్రాయం అందరికీ కలగడం సహజమే. చాలా మంది నేతలు పార్టీలో అంతర్గత విషయాలనే ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ సహజంగా ఇవే హైలెట్ అయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు విజయశాంతి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కొంతమంది తీరుతో మరికొంత మందిఅ అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారంమూ ఉపందుకుంది. కొంత మంది నేతలు అసలు ఈ కార్యక్రమానికే హాజరు కాలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పదే పదే అదే మాట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి సభలో విపక్ష నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎలాంటి ఘటనకు అయినా వంద శాతం వ్యతిరేకత.. లేదా వంద శాతం సానుకూలత రానట్లే.. సీఎం జగన్ చేసిన వ్యక్తిగత విమర్శల వీడియోలకూ అలాగే మిశ్రమ స్పందన వచ్చింది. వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరులు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిందాంట్లో తప్పేముందని.. వాదిస్తున్నారు. కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం.. చీఫ్ మినిస్టర్ పదవికి ఉన్న ఔన్నత్యాన్ని కూడా ఆయన దిగజార్చేశారని.. అంటున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఆవేశంలో చేసినవి కావు. ప్రణాళిక ప్రకారం చేసినవే. స్పీచ్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్లుగా చూసి చదవడమే దీనికి సాక్ష్యం. తనకు రాజకీయంగా డ్యామేజ్ అవుతుందని ఆయన అనుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. చేశారంటే రాజకీయ లెక్కలు వేసుకునే ఉంటారని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆసక్తిగా రెండో టెస్టు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 86పరుగులు చేసింది. విండీస్ తరఫున కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, కిర్క్ మెకంజీ క్రీజ్‌లో ఉన్నారు ప్రస్తుతం విండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 352 పరుగులు వెనుకబడి ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
సీఐ స్వర్ణలతకి బెయిల్
ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన నోట్ల మార్పిడి కేసులో అరెస్టయిన ఏఆర్ సీఐ స్వర్ణలతకి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో కీలక నిందితురాలు సీఐ స్వర్ణలత సహా మొత్తం నలుగురికి విశాఖ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు జామీనుతో పాటు పూచీకత్తు సమర్పించాలని నిందితులను కోర్టు ఆదేశించింది. కొన్ని రోజుల కిందట నోట్ల మార్పిడి కేసు వెలుగులోకి రావడంతో సీఐ స్వర్ణలత వ్యవహారంపై డిపార్ట్ మెంట్ సీరియస్ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వరుసగా మూడో రోజు సెలవు
తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు శనివారం (జులై 22) సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం (జులై 21) తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టమాటాతో కోట్లు
టమాటా ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కొందరు రైతుల మోహాల్లో మాత్రం ఆనందం వెల్లివిరుస్తోంది. ఎక్కడెక్కడో రైతులు కోట్లు సంపాదించారని చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం తెలుగు రైతే ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కొంప ముంచిన కోర్ బిజినెస్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం తగ్గింది. కంపెనీ కోర్ బిజినెస్ అయిన O2C సెగ్మెంట్‌లో మందగమనం మొత్తం ఫలితాలను వెనక్కు లాగింది. రిటైల్, టెలికాం బిజినెస్‌లు మాత్రం జోరు కొనసాగించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కార్గిల్ వీరుడి ఆవేదన
మణిపూర్ లో గిరిజిన మహిళలను మరో వర్గం వారు నగ్నంగా ఊరేగించిన ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. విచ్చలవిడి ప్రవర్తనపై దేశం మొత్తం తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆనాటి ఘటన గురించి బాధితులు చెబుతున్న విషయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం పంటపొలాల్లోకి లాక్కెళ్లి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన బాధిత యువతి.. విస్తుపోయే నిజాన్ని బయటపెట్టింది. అక్కడే ఉన్న పోలీసులు తమను అల్లరి మూకకు వదిలేశారని, తమకు పోలీసులు ఏమాత్రం రక్షణ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సు
కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ ఇండియా, జీయూవీఐ మధ్య పరస్పర సహకారంతో ఈ కార్యక్రమానికి రూపొందించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, గుజరాతీ, హిందీతోపాటు ఇంగ్లిష్‌లో ఈ కోర్సును అందుబాటులో తీసుకొచ్చారు. ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కోర్సును ప్రారంభిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే బోధన ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
'నాతో నేను' ఎలా ఉందంటే?
'జబర్దస్త్' శాంతి కుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'నాతో నేను'. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి