అన్వేషించండి

RIL Q1 Results: తగ్గిన రిలయన్స్‌ లాభం, కొంప ముంచిన కోర్‌ బిజినెస్‌, ₹9 డివిడెండ్‌

రిలయన్స్ ఆదాయం కూడా 5.3 శాతం క్షీణించి రూ. 2.11 లక్షల కోట్లుగా రికార్డ్‌ అయింది.

Reliance Industries Q1 Results: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా దేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం తగ్గింది. కంపెనీ కోర్‌ బిజినెస్‌ అయిన O2C సెగ్మెంట్‌లో మందగమనం మొత్తం ఫలితాలను వెనక్కు లాగింది. రిటైల్‌, టెలికాం బిజినెస్‌లు మాత్రం జోరు కొనసాగించాయి.

2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్‌ ఫలితాలను RIL శుక్రవారం రాత్రి ప్రకటించింది. జూన్‌ క్వార్టర్‌లో RIL లాభం 11 శాతం తగ్గి రూ.16,011 కోట్లుగా లెక్క తేలింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం రూ.17,955 కోట్లు. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో రూ.19,299 కోట్ల రికార్డు స్థాయి లాభాన్ని గడించింది.

సమీక్ష కాల త్రైమాసికంలో రిలయన్స్ ఆదాయం కూడా 5.3 శాతం క్షీణించి రూ. 2.11 లక్షల కోట్లుగా రికార్డ్‌ అయింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ. 2.23 లక్షల కోట్లు. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో రూ. 2.16 లక్షల కోట్లు సంపాదించింది. QoQలోనూ రెవెన్యూ తగ్గింది.

జూన్‌ క్వార్టర్‌లో రిలయన్స్‌ లాభం రెండంకెల స్థాయిలో తగ్గుతుందని, ఆదాయం కూడా పరిమితంగా ఉంటుందని మార్కెట్‌ ముందుగానే ఎస్టిమేట్‌ చేసింది. 

ఆయిల్‌ టు కెమికల్స్‌ 
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణం ఆయిల్‌ టు కెమికల్స్‌ (O2C) బిజినెస్‌లో బలహీనత. ఈ సెగ్మెంట్‌లో వచ్చిన ఆదాయం 18 శాతం తగ్గి రూ. 1.33 లక్షల కోట్లుగా నమోదైంది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు 31% తగ్గడం ఈ సెగ్మెంట్‌ ఆదాయం తగ్గడానికి కారణం. O2C బిజినెస్‌ ఎబిటా 23.2% క్షీణించి రూ.15,271 కోట్లకు పరిమితమైంది. 

Q1 FY24లోనూ రిలయన్స్‌ రిటైల్, రిలయన్స్‌ జియో వ్యాపారాల్లో జోరు కొనసాగింది. వీటివల్లే భారీ నష్టాల నుంచి RIL రిలయన్స్‌ తప్పించుకుంది.

రిలయన్స్ రిటైల్
రిలయన్స్ రిటైల్ ఆదాయం Q1 FY23లోని రూ. 58,554 కోట్ల నుంచి 19 శాతం పెరిగి Q1 FY24లో రూ. 62,159 కోట్లకు చేరింది, రూ. 2,448 కోట్ల లాభం మిగిలింది. రిలయన్స్ డిజిటల్ ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.32,077 కోట్లుగా రికార్డ్‌ అయింది. జూన్‌ క్వార్టర్‌లో 555 కొత్త స్టోర్లను రిలయన్స్‌ రిటైల్‌ ఓపెన్‌ చేసింది, మొత్తం స్టోర్ల సంఖ్య 18446కు పెరిగింది.

రిలయన్స్‌ జియో 
రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌ లాభం రూ. 4,530 కోట్ల నుంచి 12.5% (YoY) పెరిగి Q1 FY24లో రూ.5098 కోట్లకు చేరుకుంది. ఆదాయం 11.3% పెరిగి రూ.26,115 కోట్లకు చేరింది. జియో కస్టమర్‌ బేస్‌ మార్చి చివరి నాటి 43.93 కోట్ల నుంచి జూన్‌ ముగింపు నాటికి 44.85 కోట్లకు పెరిగింది. ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ARPU) రూ.178.8 నుంచి రూ.180.5కు పెరిగింది.

జియో ఫిన్ విలీనం గురించి..
ఈసారి, రిలయన్స్‌ రిజల్ట్స్‌ కంటే, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డీమెర్జర్‌ గురించి ముకేష్‌ అంబానీ ఏం చెబుతారు అన్న దాని గురించే మార్కెట్‌ ఎదురు చూసింది. Q1 ఫలితాల ప్రకటన సందర్భంగా, జియో ఫిన్ గురించి అంబానీ మాట్లాడారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విభజన ప్రక్రియ వేగంగా పూర్తవుతుందన్నారు. భారతదేశంలో ఎక్కువ మందికి ఆర్థిక సేవలు అందించేందుకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మెరుగైన స్థితిలో ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ తన షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ.9 డివిడెండ్ ప్రకటించింది. రికార్డు తేదీని త్వరలో ప్రకటిస్తారు.

శుక్రవారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌ ప్రైస్‌ 3.19 శాతం క్షీణించి రూ.2536 వద్ద ముగిసింది.

మరో ఆసక్తికర కథనం: SBI ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ Vs పోస్టాఫీస్ టైమ్‌ డిపాజిట్‌ - ఎందులో ఎక్కువ డబ్బొస్తుంది?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget