News
News
వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: సీబీఐకి మరో లెటర్ రాసిన అవినాష్, బెంగళూరును ఇంటికి పంపేసిన గిల్‌ మార్నింగ్ టాప్‌ టెన్‌ న్యూస్‌

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..

FOLLOW US: 
Share:

Top 10 Headlines Today: 

అప్పటి వరకు రాలేను
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మరోసారి సీబీఐకి లేఖ రాశారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ తాను రేపటి విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. తన తల్లి అనారోగ్యంగా ఉన్న కారణంగా సోమవారం విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు వెల్లడించారు. చికిత్స పొందుతున్న తన తల్లి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌ అయిన తర్వాత విచారణకు రావడానికి ఏ ఇబ్బంది లేదన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కాగా, పలుమార్లు వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ఇటీవల ఈనెల 16, 19న రెండుసార్లు సీబీఐ విచారణకు గైర్హాజరు కావడం తెలిసిందే. మరోసారి తాను విచారణకు హాజరు కాలేనంటూ వైసీపీ ఎంపీ లేఖ రాయడంతో సీబీఐ ఎలా స్పందిస్తున్నంది ఏపీలో ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శంకుస్థాపన మరోసారి
కృష్ణాజిల్లాలోని బందరు పోర్టుకు ఇవాళ మరోసారి శంకుస్థాపన జరగనుంది. 5.156 కోట్ల రూపాయలతో చేపడుతున్న బందరు పోర్టు నిర్మాణ పనులకు జగన్ భూమి పూజ చేయనున్నారు. ఈ పోర్టుకు ఇప్పటికే భూసేకరణ పూర్తైంది. అన్ని అనుమతులు వచ్చాయి. కోర్టుల్లో ఉన్న వివాదాలు కూడా పరిష్కారమయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. పూర్తిగా ప్రభుత్వ వ్యయంతో శరవేగంగా పోర్టు పనులు పూర్తి చేయబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సింహం సింగిల్‌గానే
కర్ణాటక ఫలితాలకు, తెలంగాణకు సంబంధం ఏముంది? దేశంలో 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో గెలిచింది.. మరి ఇక్కడ రాలేదు కదా?... అట్లాగే కర్ణాటకలో ఓడిపోతే.. తెలంగాణకు సంబంధం ఏంది? రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని తేలిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. అందుకే బీజేపీని అడ్డుకోవడానికే గుంట నక్కల పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. బీజేపీ సింహం.. సింగిల్ గానే పోటీ చేసి పూర్తి మెజారిటీతోనే అధికారంలోకి రాబోతోంది. సీఎంసహా అన్ని సర్వే సంస్థల నివేదికలు ఇవే చెబుతున్నాయి అన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బెంగళూరును ఇంటికి పంపిన గిల్
ఐపీఎల్ లీగ్ దశకు అదిరిపోయే ముగింపు లభించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ టైటాన్స్ ఓడించి ఇంటికి పంపించేసింది. ఈ ఓటమి ముంబై ఇండియన్స్ పాలిట వరం అయింది. వారు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించారు. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కోటి ఇక లేరు
తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీత ద్వయం ‘రాజ్-కోటి’. తన స్నేహితుడు కోటితో కలిసి ఎన్నో సినిమాలకు మంచి స్వరాలు అందించిన రాజ్(65).. ఆదివారం మరణించారు. బాత్రూమ్‌లో కాలు జారడం వల్ల ఆయన గుండె పోటుకు గురయ్యారని, హాస్పిటల్‌కు తరలించే లోపే ఆయన కన్ను మూశారని రాజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. రాజ్ మరణ వార్త యావత్ టాలీవుడ్‌ను విషాదంలో నింపేసింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో ఎండావాన
పశ్చిమ బిహార్‌ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందబోతున్నాయి. మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు అధికారులు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాణం తీసిన కుక్క
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వేసవికాలం మొదలైనప్పటి నుంచీ కుక్కల బెడద మరింత అధికమైంది. నగరంలో ఓ బాలుడ్ని వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఆపై ఖమ్మం జిల్లాలో, ఇటీవల హన్మకొండలోనూ వీధి కుక్కలు దాడి చేయడంలో పసివాళ్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్‌ మణికొండలోని పంచవటి కాలనీలో దారుణం జరిగింది. పెంపుడు కుక్క దూసుకురావడంతో ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కాపాడుకునేందకు మూడో అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్రగాయాలపాలైన డెలివరీ బాయ్‌ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ రాశివారు మాటలు, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి
ఈ రోజు ఈ రాశివారు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మాట్లాడుకునేవి కూడా వాదనగా మారొచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటంబ సభ్యులకు సమయం కేటాయించండి. భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరి సలహాలు వినడం హానికరం. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బెంగళూరులో పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అయితే పలు చోట్ల చెట్లు కూలిపోగా.. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే కేఆర్ సర్కిల్ లో పెద్ద ఎత్తున వరదలు రాగా.. చాలా మంది చిక్కుకుపోయారు. అప్రమత్తమైన పోలీసులు.. కార్లలో చిక్కుకున్న వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెలుగు మహిళ భానురేఖ మృతి చెందింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాలరీ హైక్ కోసం మైక్రోసాఫ్ట్ సీఎమ్‌వో సలహా
ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌ల ట్రెండ్ నడుస్తున్న క్రమంలో మైక్రోసాఫ్ట్ ఇటీవలే సంచలన ప్రకటన చేసింది. ఉద్యోగులెవరూ శాలరీ హైక్‌లు ఎక్స్‌పెక్ట్ చేయొద్దని తేల్చి చెప్పింది. జీతాలు పెంచే పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. దీనిపై మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరైతే సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెట్టారు. "చెంప దెబ్బ కొట్టినట్టు ఉంది" అని  గట్టిగానే విమర్శించారు. ఈ విమర్శలపై మైక్రోసాఫ్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO) క్రిష్టోఫర్ స్పందించారు. జీతాలు పెంచుకునే చిట్కా కూడా చెప్పారు. ఓ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్న ఆయన...అందరి ఎంప్లాయిస్‌ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులందరూ కలిసి కంపెనీ స్టాక్‌ ప్రైస్‌ పెంచేలా చేయగలిగితే చాలని, ఆటోమెటిక్‌గా జీతాలు పెరుగుతాయని అన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published at : 22 May 2023 08:00 AM (IST) Tags: AP news today Telangana LAtest News Todays latest news Top 10 headlines today Telugu Top News Website Top Telugu News Website Top 10 Telugu News

సంబంధిత కథనాలు

Stocks Watch Today, 07 June 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group Stocks

Stocks Watch Today, 07 June 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group Stocks

Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్‌ మధ్య ఫైట్

Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్‌ మధ్య ఫైట్

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

ABP Desam Top 10, 7 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 7 June 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?