Bengaluru News: బెంగళూరులో భారీ వర్షాలు - వరదల్లో చిక్కుకుని ఏపీకి చెందిన మహిళా టెకీ మృతి
Bengaluru News: బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే పెద్ద ఎత్తున వరదలు రాగా.. విజయవాడకు చెందిన ఓ యువతి అందులో చిక్కుకుంది. రక్షించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
Bengaluru News: బెంగళూరులో పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అయితే పలు చోట్ల చెట్లు కూలిపోగా.. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే కేఆర్ సర్కిల్ లో పెద్ద ఎత్తున వరదలు రాగా.. చాలా మంది చిక్కుకుపోయారు. అప్రమత్తమైన పోలీసులు.. కార్లలో చిక్కుకున్న వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెలుగు మహిళ భానురేఖ మృతి చెందింది.
వరదల్లో ఇరుక్కొని చికిత్స పొందుతున్న వాళ్లలో కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రిని సందర్శించారు. ఈక్రమంలోనే భానురేఖ కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. భానురేఖ బెంగళూరులోని ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పని చేస్తున్నారు. ఆస్పత్రి సందర్శన తర్వాత సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.