అన్వేషించండి

Morning Top News: వైసీపీ కొత్త ప్లాన్ ఏంటి ? రేవంత్ రెడ్డికి భయపడేలేదన్న కేటీఆర్ వంటి మార్నింగ్ టాప్ న్యూస్

Top 10 Headlines Today: మోహన్ బాబుకు    హైకోర్టు షాక్, రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు వంటి మార్నింగ్ టాప్ న్యూస్

Morning Top News: 

పవన్ ను పొగిడేస్తున్న వైసీపీ.. ప్లాన్ అదేనా...  

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఇన్నాళ్లు తిట్టిన వైసీపీ నేతలు.. ఇప్పుడు పవన్ ఫలితాలను మార్చేయగల శక్తి ఉన్న రాజకీయనాయకుడు అంటూ పొగుడుతున్నారు. చంద్రబాబును మించి పోతున్నారని ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ వల్లే ఓడిపోయామని కూడా బహిరంగంగా చెబుతున్నారు.  హఠాత్తుగా వైసీపీ నేతల్లో వచ్చిన మార్పు చూసి రాజకీయవర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 

కేటీఆర్‌పై కేసు నమోదు 

ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌ను.. ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్‌‌ను, ఏ3గా ప్రైవేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని చేరుస్తూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది. ఫార్ములా-ఈ కార్‌ రేసు విషయంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ విచారణకు అనుమతులు ఇవ్వడంతో ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. దీంతో కేటీఆర్ అరెస్టు ఖాయమైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ఓఆర్ఆర్‌పై దర్యాప్తునకు సిట్: రేవంత్

ఓఆర్ఆర్‌ టెండర్లపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. విచారణకు సంబంధించిన విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాల డిమాండ్ లతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దేశం నుంచి పారిపోవాలనే బీఆర్ఎస్ నేతలు ఓఆర్ ఆర్ టెండర్లను అమ్ముకున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ కూడా స్వాగతిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

టీటీడీ స్వర్ణాంధ్ర విజన్ 2047

స్వర్ణాంధ్ర విజన్ - 2047 తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణపై దృష్టి సారించింది. ఈ వ్యూహాత్మక చొరవలో భాగంగా “తిరుమల విజన్ 2047”ను ప్రారంభించినట్లు ప్రకటించింది. తిరుమలలో వారసత్వ పరిరక్షణను అమలు చేసే లక్ష్యంలో భాగంగా ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, టీటీడీ ఈ పరివర్తన ప్రణాళికకు సహకరించేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 

జత్వానీ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టులో నటి జత్వానీ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పై విచారణ జరిగింది.ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిది. ఏ 2గా ఉన్న సీతారామాంజనజేయులు కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయలేదని  ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. హీరోయిన్ జత్వానీని వేధించిన కేసులో.. కేసులు నమోదు కావడంతో ఇతర ఐపీఎస్‌లు, పోలీసులు ముందస్తు బెయిల్ కోసంకోర్టుకెళ్లారు. విచారణ పూర్తయ్యే వరకూ వారిని అరెస్టు చేయవద్దని కోర్టు చెప్పింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

రేవంత్ రెడ్డికి భయపడేదే లేదు: కేటీఆర్

తనపై ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డికి భయపడేదే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసులకు భయపడబోమని.. న్యాయబద్దంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఫార్మూలా ఈ కార్ రేస్ పై శాసనసభలో చర్చ చేపట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. చిల్లర కేసులకు భయపడేది లేదన్న కేటీఆర్... కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఈ కేసులో అవినీతి ఏంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 మోహన్ బాబుకు  షాక్ఇచ్చిన  హైకోర్టు

పోలీసులు అరెస్టు చేయుకండా ఉండేందుకు మంచు మోహన్ బాబు చేసిన  ప్రయత్నాలు విఫలమయ్యాయి.  జర్నలిస్టుపై చేసిన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.  విచారణలో కౌంటర్ దాఖలు చేసేందుకు  కేసును సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఈ లోపు  అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరారు. కానీ ఇప్పటికిప్పుడు అలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు

పార్లమెంటులో గురువారం తోపులాట వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై  బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ తోయడం వల్లే తమ ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారని కమలం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై.. దాడి, ప్రేరేపణపై ఫిర్యాదు చేసామని,  ఆయనపై సెక్షన్ 109, 115, 117, 125, 131, 351 కింద కేసులు నమోదు చేయాల్సిందిగా కోరామన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

సీబీఎస్ఈ ఆకస్మిక తనిఖీలలో నమ్మలేని నిజాలు 

 దేశంలోని పలు పాఠశాలల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్  గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, బెంగుళూరు, వారణాసి, బీహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ల్లోని 29 స్కూళ్లల్లో 'డమ్మీ' విద్యార్థుల నమోదును పరిశీలించేందుకు బుధ, గురువారాల్లో తనిఖీలు నిర్వహించింది. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే అనేక మంది విద్యార్థులు డమ్మీ స్కూళ్ల వైపు ఆసక్తి చూపుతుంటారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

స్మృతి మంధాన’ అరుదైన రికార్డు

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ స్మృతి మంధాన ఓ అరుదైన రికార్డును సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధికసార్లు 50కిపైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. ఇప్పటి వరకు స్మృతి 30 సార్లు 50కిపైగా పరుగులు బాదారు. దీంతో న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్(29)ని ఆమె అధిగమించారు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు(763) చేసిన క్రికెటర్‌గా స్మృతి రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Today Weather Report: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
Smriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
Embed widget