Top Headlines Today: నేడు యువగళం ముగింపు సభ- ఎంపీలకు కేసీఆర్ కీలక ఆదేశాలు- టాప్ టెన్ న్యూస్
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
యువగళం ముగింపు
ఏపీ జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తైన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువగళం-నవశకం బహిరంగ సభకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేసారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారధులు హాజరుకానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు. విజయనగరం జిల్లా, పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభపై పడింది. రాష్ట్ర చరిత్రలో న భూతో నభవిష్యతి అనే చందంగా ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యువగళం-నవశకం సభ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అందుబాటులో ఉండాలని ఎంపీలకు కేసీఆర్ సూచన
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ పొలిటికల్ ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన షాక్ నుంచి కేడర్‌ను బయటపడేయడంతోపాటు వచ్చే లోక్‌సభ ఎన్నకల్లో ఎక్కువ అభ్యర్థులను గెలిపించుకునే వ్యూహాలు రెడీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
విద్యార్థులకు గుడ్ న్యూస్
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ విద్యా దీవెన నిధులు ఇవాళ విడుదల చేయనుంది. దీంతోపాటు సివిల్ సర్వీస్ ప్రోత్సాహకాలను కూడా జగన్ రిలీజ్ చేయనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకునే 390 మంది విద్యార్థుల కోసం 41.6 కోట్ల రూపాయల నిధులు ఇవాళ ఇవ్వబోతున్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ దాటి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న 95 మంది, మెయిన్స్‌లో మంచి ర్యాక్ సాధించి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్న 11 మంది అభ్యర్థుల కోసం కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024కు సంబంధించిన మినీ వేలం ముగిసింది. మొత్తం 333 మంది ఆటగాళ్లు మినీ వేలంలో పాల్గొనగా... ఫ్రాంచైజీలు తమ జట్టు అవసరాలకు తగిన వారిని కొనుగోలు చేశాయి. ఈ వేలంలో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ భారీ ధర పలికారు. పాట్ కమిన్స్ రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ వేలంలో తెలంగాణ కుర్రాడిని కూడా అదృష్టం వరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్రధాని అభ్యర్థిగా ఖర్గే!
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి (I.N.D.I.A Alliance) పావులు కదుపుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ (BJP) భావిస్తుంటే... ఎలాగైనా చెక్ పెట్టాలని I.N.D.I.A కూటమిలోని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కమలం పార్టీకి ధీటుగా ఎత్తులు వేయడంలో నిమగ్నమయ్యాయి. ఢిల్లీ(Delhi)లోని అశోకా హోటల్ (Ashoka Hotel)లో జరిగిన ఇండియా కూటమి నాలుగో సమావేశంలో కీలక అంశాలపై చర్చించింది. 28 విపక్ష పార్టీల నేతల హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న ముఖ్య నేతల్లో మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), సోనియా గాంధీ (Sonia gandhi), రాహుల్ గాంధీ (Rahul gandhi), మమతా బెనర్జీ (Mamatha Benarjee), స్టాలిన్ ( Stalin), శరద్ పవార్, సీతారాం ఏచూరి, డి.రాజా, నీతీశ్ కుమార్, కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు ఉన్నారు. మూడుగంటలకు పైగా జరిగిన సమావేశంలో ప్రధాని అభ్యర్థిత్వంతో పాటు పార్లమెంటులో విపక్ష ఎంపీలపై వేటు, రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. దేశ వ్యాప్తంగా కనీసం 8 నుంచి 10 సమావేశాలు నిర్వహించాలని అంగీకారానికి వచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చలి పెరుగుతోంది.. జాగ్రత్త
తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్ లో కూడా వాతావరణం చల్లగా ఉంటోంది. రాత్రివేళే కాకుండా పగలు కూడా చలిగాలులు వణికిస్తున్నాయి. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
అద్వానీని వద్దనడంలో ఆంతర్యమేంటి?
రాముడు - రామజన్మభూమి (Ram Janmabhoomi Temple) ఈ రెండూ భారత్ లో అంతర్భాగమైన పదాలు. రాముడు కొన్ని వేల సంవత్సరాలుగా ఆరాధ్యనీయుడు.. రామజన్మభూమి (Ram Mandir Opening) కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక జీవనంలో ఓ భాగం. వాదాలు, వాయిదాలు, వివాదాలు ఎన్నున్నా.. కోట్లాది మంది హిందువుల ఎన్నో ఏళ్ల కల రామమందిర నిర్మాణం. ఇప్పుడది సాకారం అవుతోంది. మతపరమైన మందిరాన్ని రథయాత్రతో రాజకీయాంశం చేసి.. ఓ రకంగా ఇవాళ జరుగుతున్న ఈ మహా కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి రథయాత్ర సారథి మాత్రం ఇందుకు దూరంగా ఉండిపోవలసి వస్తోంది. కోట్ల మంది హిందువులకు ఆహ్వానం పలికి.. వేల మంది నాయకులకు స్వాగతం పలికి.. వందలాది వీఐపీలకు ఆతిథ్యం ఇస్తున్న రామమందిర ట్రస్టు (Ram Mandir Trust).. అసలు మందిరానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన రథయాత్రికుడు లాల్ కృష్ణ అద్వానీని (LK Advani) మాత్రం దూరం పెట్టింది. మీ వయసు పెరిగింది.. ఆరోగ్యం దృష్ట్యా.. హాజరు కావొద్దని “విజ్ఞప్తి” చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కాసేపు పని చేయడం మానేసిన బుక్ మై షో!
'సలార్' టికెట్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి ఓపెన్ చేశారు. ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశాయి. దాంతో మంగళవారం రాత్రి 8.24 గంటలకు ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్ ఓపెన్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
36 ఏళ్ల రికార్డు సమం చేసిన సాయి సుదర్శన్
సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన సఫారీ జట్టు.. ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు... 46.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రొటీస్ బ్యాటర్లలో టోనీడీ జార్జీ అద్భుత శతకంతో ప్రొటీస్‌కు విజయాన్ని అందించాడు. భారత బ్యాటర్లలో సాయి సుదర్శన్, కెప్టెన్ రాహుల్ మెరిశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తర్వాత ఆడిన రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో సాయి సుదర్శన్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా సాయి రికార్డు సృష్టించాడు. అంతకుముందు నవజోత్ సింగ్ సిద్ధూ పేరిట ఈ రికార్డు ఉంది. 1987లో వన్డేల్లో అరంగేట్రం చేసిన సిద్ధూ.. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీ చేశాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచులో 73, రెండో మ్యాచులో 75 పరుగులు చేశాడు. 36 ఏళ్ల తర్వాత ఈ రికార్డును తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్ సాధించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఎల్‌ఐసీ జీవన్ ఉత్సవ్ పాలసీ
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC), వివిధ వర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటి కప్పుడు కొత్త బీమా పాలసీలను తీసుకువస్తూనే ఉంది. ఇటీవలే, LIC జీవన్ ఉత్సవ్ పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది వ్యక్తిగత, పొదుపు, పూర్తి జీవిత కాలపు బీమా ప్లాన్. దీనిలో కొత్తగా తీసుకువచ్చిన అంశం... జీవితాంతం హామీతో కూడిన రాబడి (Guaranteed return). ఈ ప్లాన్ నంబర్ 871 (Plan No 871). పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి