Morning Top News: అన్న కోసం తమ్ముడు త్యాగం, లగచర్ల కేసులో నిందితులకు బెయిల్ వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు ఆగ్రహం, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Morning Top News:
అన్న నాగబాబు కోసం పవన్ త్యాగం
ఏపీ కేబినెట్‌లో మార్పు చేర్పులకు సమయం ఆసన్నమైంది. మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి స్థానాన్ని మాత్రం భర్తీ చేస్తారు. కానీ శాఖల మార్పు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ సంగతి పక్కన పెడితే జనసేన పార్టీ నుంచి మంత్రి కాబోతున్న నాగబాబుకు పవన్ నిర్వహిస్తున్న కీలక శాఖలను కూడా ఇస్తారని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఇద్దరికీ హెల్మెట్ - ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి జూన్ నుంచి సెప్టెంబరు వరకు 667 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ విషయంపై హైకోర్టు సీరియస్ అయింది. మోటార్ వాహనాల చట్టం అమలు చేయడంలో వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించింది. సిసి కెమెరాలు చూసి చర్యలు తీసుకునే విధానం తగ్గించి నేరుగా రోడ్లపైనే పోలీసులు నిలబడి చలాన్లు వసూలు చేయాలని సూచించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీకి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం సముద్రమట్టంపై 5.8 కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు చేరే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలు, వాటి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
లగచర్ల కేసులో నిందితులకు బెయిల్
లగచర్ల ఘటనలో నిందితులకు నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డి, సురేష్, పండుగ నారాయణరెడ్డి, ఓడిరెడ్డి సహా 24 మంది నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచికత్తు సమర్పించాలని పట్నం నరేందర్ ను కోర్టు ఆదేశించింది. మూడు నెలల పాటు ప్రతీ బుధవారం పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని కూడా ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
ఫార్ములా-ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా ఉందని, ఈ అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ రేస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందనే విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్, సినీ నటుడు ప్రసాద్ బెహరాను లైంగిక వేధింపుల కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నటి ఫిర్యాదు మేరకు ఆయనను అదుపులోకి తీసుకుని 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. 'మావిడాకులు', 'పెళ్లివారమండి' వంటి వెబ్‌సిరీస్‌లు, 'కమిటీ కుర్రోళ్లు' సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు పొందారు ప్రసాద్ బెహరా. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటు
వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా మరో కీలక ముందడుగు పడింది. 31 మందితో జమిలి బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటన విడుదల చేశారు. తదుపరి సమావేశాల్లో జమిలి ఎన్నికలపై నివేదిక ఇవ్వాలని జేపీసీని స్పీకర్ ఆదేశించారు. 21 మంది లోక్ సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి పీపీ చౌధరి ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ముంబయి తీరంలో బోటు ప్రమాదం, 13 మంది మృతి
ముంబయి తీరంలోని బచర్ ఐలాండ్‌లో భారీ పడవ ప్రమాదం చోటుచేసుకుంది. విహార యాత్రలో ఊహించని విషాదం నెలకొంది. నేవీ బోట్, ప్యాసింజర్ బోటును ఢీకొన్న ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో 101 మంది ప్రయాణికులను సిబ్బంది రక్షించారు. రెండు బోట్లు ఢీకొని ప్రయాణికులు నీళ్లల్లో పడిపోయిన వెంటనే భారత కోస్ట్ గార్డ్ రంగంలోకి వంద మందికి ప్రాణాలు కాపాడారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పాక్ కొత్త ప్రయోగం.. ప్రపంచం విస్మయం
పాకిస్థాన్ ఓ కొత్త ప్రయోగం చేసింది. పాకిస్తాన్ ఆవు పేడతో ఇంధనాన్ని తయారు చేసింది. దీన్ని బస్సులను నడపడానికి ఉపయోగిస్తోంది. పాకిస్థాన్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అంతే కాదు, వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బీజింగ్‌లో భారత్, చైనా ప్రతినిధుల కీలక భేటీ
భారత్, చైనా దేశాలు దాదాపు ఐదేళ్ల అనంతరం చర్చలు జరిపాయి. 23వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో పాల్గొనేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ధోవల్ బుధవారం నాడు భేటీ అయ్యారు. సరిహద్దు సమస్య సహా పలు అంశాలపై కీలకంగా చర్చ జరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ప్రపంచ క్రికెట్‌లో ముగిసిన అశ్విన్ శకం
ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో శకం ముగిసింది. బంతితో అద్భుతాలు చేసే మేధావి రవిచ్రందన్ అశ్విన్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 106 టెస్టులు ఆడిన అశ్విన్ 537 వికెట్లు తీసి దిగ్గజ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. 2010లో శ్రీలంకపై వన్డేల్లో, 2011లో వెస్టిండీస్‌తో టెస్టుల్లో అశ్విన్ అరంగ్రేటం చేశాడు. టెస్టుల్లో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 3,503 పరుగులు చేశాడు. అడిలైడ్‌లో అశ్విన్ చివరి టెస్ట్ ఆడాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..