Mumbai Boat Accident: ముంబయి తీరంలో బోటు ప్రమాదం, 13 మంది మృతి - 101 మందిని రక్షించిన కోస్ట్ గార్డ్స్
Mumbai Boat Incident | గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నీటిలో మునిగిపోయిన 80 మందిని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రక్షించారు. ఒకరు చనిపోగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
Boat sank off the coast of Mumbai | ముంబయి: ముంబయి తీరంలోని బచర్ ఐలాండ్‌లో భారీ పడవ ప్రమాదం చోటుచేసుకుంది. విహార యాత్రలో ఊహించని విషాదం నెలకొంది. నేవీ బోట్, ప్యాసింజర్ బోటును ఢీకొన్న ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో 101 మంది ప్రయాణికులను సిబ్బంది రక్షించారు. రెండు బోట్లు ఢీకొని ప్రయాణికులు నీళ్లల్లో పడిపోయిన వెంటనే భారత కోస్ట్ గార్డ్ రంగంలోకి వంద మందికి ప్రాణాలు కాపాడారు. గల్లంతైన మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.
నేవీ బోట్, ప్యాసింజర్ బోటును ఢీకొనడంతో బుధవారం మధ్యాహ్నం 3.55 గంటలకు ప్రమాదం జరిగింది. రాత్రి 7.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు 101 మందిని రక్షించగా, మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 10 మంది సాధారణ పౌరులు కాగా, ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. కోస్ట్ గార్డ్స్, మత్స్యకారుల సాయంతో వెంటనే చర్యలు చేపట్టడంతో భారీగా ప్రాణనష్టం జరగకుండా చూడగలిగారు.
13 మంది మృతి, అయిదుగురి పరిస్థితి విషమం
గేట్‌వే ఆఫ్ ఇండియా (Gateway of India) సమీపంలో బోటు బోల్తా పడిన ఘటనపై ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది. బోటులోని సిబ్బందితో సహా మొత్తం వంద మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు తాము 101 మందిని రక్షించగా, మరో ఐదుగురు గల్లంతయ్యారని పేర్కొన్నారు. రక్షించిన వారిలో కొందర్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయిదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ఒక వ్యక్తి మృతి చెందారని బీఎంసీ తెలిపింది. సకాలంలో స్పందించి ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి ప్రాణాలు కాపాడిందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎలిఫెంటా గుహలకు వెళ్తుండగా ప్రమాదం..
‘నీల్‌కమల్’ అనే పడవ గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు భారీగా పర్యాటకులను తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ఓ చిన్న పడవ పర్యాటకులు వెళ్తున్న బోట్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. భారత కోస్ట్ గార్డ్స్ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మొదట ఒక మృతదేహాన్ని వెలికి తీయడంతో పాటు దాదాపు 100 మంది టూరిస్టులను రక్షించినట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. తీర ప్రాంతంలో కొన్ని పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని సమాచారం. మత్స్యకారుల సహాయంతో పర్యాటకులను కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొందరు నేవీ సిబ్బంది, సాధారణ పౌరులు మృతి చెందారు.
#WATCH | Mumbai Boat Accident | The Indian Coast Guard carried out rescue operations after a ferry capsized near the Gateway of India.
— ANI (@ANI) December 18, 2024
(Video Source: Indian Coast Guard) pic.twitter.com/dAGOT83v2X