Top 10 Headlines Today: గద్దర్ కుమారుడికి టికెట్ ఇచ్చే యోచనలో కాంగ్రెస్- ఏపీలో ఏర్పాటైన రాష్ట్ర కమిటీ ఏం చెబుతోంది?
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today:
గద్దర్ కుమారిడికి ఎమ్మెల్యేటికెట్
ప్రజా యుద్ధనౌక గద్దర్ గొంతు మూగబోయింది కానీ.. ఆయన చివరి రోజుల్లో ప్రజాస్వామ్య రాజకీయాలు చేయాలనుకున్నారు. సొంత పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇతర పార్టీలతో కన్నా కాంగ్రెస్ తో ఎక్కువ సన్నిహితంగా ఉన్నారు. గద్దర్ చనిపోయిన తర్వాత కూడా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్కువ బాధ్యత తీసుకున్నారు. గద్దర కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించారు. ఇప్పుడు గద్దర్ చివరి కోరికను ఆయన కుమారుడి ద్వారా తీర్చాలని రేవంత్ అనకుంటున్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కమిటీ ఏం చెబుతుంది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి బలముందని ఎవరూ అనుకోరు కానీ.. బీజేపీ చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. ఆ పార్టీతో సన్నిహిత సంబంధాల కోసం వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ పోటీ పడుతూంటాయి.అయితే ఈ సంబంధాలు ఢిల్లీ స్థాయిలోనే . రాష్ట్రానికి వచ్చే సరికి ఆ పార్టీ ని.. ఆ పార్టీ నేతల్ని కలుపుకుని పోయేందుకు ఏ ఒక్క పార్టీ ప్రయత్నించవు. బీజేపీ నేతలు కూడా రెండు పార్టీల నేతలు ఢిల్లీలో తమ హైకమాండ్‌తో సన్నిహితంగా ఉన్నారు కదా అని ఆయా పార్టీలతో కలిసిపోయే ప్రయత్నం చేయలేదు. అయితే రెండు పార్టీలు బీజేపీతో సన్నిహితంగా ఉండటం.. బీజేపీ ఎదగలేకపోతోంది. జాతీయ రాజకీయాల కోసం హైకమాండ్ కూడా ఏపీ రాజకీయాలను అదే కోణంలో ట్రీట్ చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
48 గంటల్లో నివేదిక
స్వాతంత్య్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి ఓ మహిళపై ఇద్దరు పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. లాఠీలతో దారుణంగా కొట్టి హింసించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళిసై... మహిళపై జరిగిన దారుణ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ లను ఆదేశించారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలన్నారు. బాధిత మహిళకు అండగా ఉండాలని రెడ్‌క్రాస్ సొసైటీకి గవర్నర్ సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పొత్తులు ఉంటాయి: పవన్ కల్యాణ్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొత్తులు హాట్ టాపిక్ అవుతున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి పొత్తులపై స్పందించారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, టీడీపీ, బీజేపీతో జనసేన కలిసి వెళ్లడమా లేదంటే బీజేపీతో కలిసి పోటీ చేయడమా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు చీలకూడదన్నదే జనసేన ఉద్దేశం అని, ఏదైనా సరే ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయన్నారు. సీఎం పదవి పై నా ఆసక్తి ఇప్పటికే చెప్పాను.. సీఎం పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ఫలితాలు తర్వాతే సీఎం పదవిపై నిర్ణయం ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
వర్షావరణం
ఇన్నిరోజులు ఉక్కపోతతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడు కాస్త ఉపశమనం లభించింది. శుక్రవారం నుంచి చాలా ప్రాంతాల్లో మోస్తలు వర్షాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మోస్తలు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
భక్తులకు సూచనలు
తిరుమలలో చిరుతల సంచారం కొనసాగుతోంది. దాదాపు 50 రోజుల వ్యవధిలో తిరుమలలో 3 చిరుతల్ని బంధించారు అటవీశాఖ అధికారులు. మరికొన్ని చిరుతపులులు అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్ల మార్గంలో సంచరిస్తున్నాయని అధికారులు గుర్తించారు. మొదటి ఘాట్ రోడ్డు ఎలిపేంట్ ఆర్చ్ వద్ద, శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతల సంచారం ట్రాప్ కెమెరాలకు చిక్కింది. తిరుమల స్పెషల్ టైప్ కాటేజీల సమీపంలో ఓ ఎలుగుబంటి కెమెరాకు చిక్కింది. దాంతో అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలలో వన్యమృగాల సంచారంపై ఫోకస్ చేసి భక్తులకు భద్రత పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మహిళలకు భలే ఛాన్స్
ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్ నగరంలో కోఠి- కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును టీఎస్ ఆర్టీసీ (TSRTC) ఏర్పాటు చేసింది. 127K నంబర్ ప్రత్యేక బస్సు ఆగస్టు 21 (సోమవారం) నుంచి ప్రారంభం కానుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8.50 గంటలకు కోఠి బస్టాప్ నుంచి ఈ బస్సు బయలుదేరుతుంది. అక్కడి నుంచి లక్దికాపుల్, మసాబ్ ట్యాంక్, ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగం పేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా కొండాపూర్ కి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ నుంచి అదే మార్గంలో బస్సు కోఠికి తిరిగి వస్తుందని తెలిపారు. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్ ఆర్టీసీ సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఐర్లాండ్‌తో బోణీ
ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. వర్షం అంతరాయం కలిగించిన మొదటి టీ20లో రెండు పరుగులతో డీఆర్ఎస్ పద్ధతిలో గెలుపు అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అనంతరం భారత్ 6.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం పడింది. తిరిగి మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశం లేకపోవడంతో డీఆర్ఎస్ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆర్థిక భారం తట్టుకోలేక
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి లైఫ్ ఎలా ఉంటుందనేది ఊహించడం కష్టం. ఒక్క శుక్రవారంతో అందరి జాతకాలు మారిపోతుంటాయి. విజయాలు వస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ, ఒక్క ఫ్లాప్ పడితే మాత్రం అంతా తలక్రిందులు అవుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి సినిమా తీసినా, దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మరెన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కువగా చిన్న సినిమాల నిర్మాతలకే ఇలాంటి పరిస్థితిలు వస్తుంటాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. స్వాతంత్య్ర సమరయోధుడి బయోపిక్ తీసిన ఓ నిర్మాత, ఆ చిత్రాన్ని రిలీజ్ చేసుకోలేక, ఆర్థిక భారాన్ని తట్టుకోలేక ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. విడుదలకు ఇంకా సుమారు రెండు నెలల సమయం ఉంది. అయితే, అప్పుడే థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ కావడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి