Morning Top News: రోడ్డున పడిన మంచు కుటుంబ వివాదాలు, ఏపీకి మరో భారీ ప్రాజెక్టు వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: మంచు మనోజ్‌ను ఉద్దేశించి ఆడియో రిలీజ్ చేసిన మోహన్‌బాబు , విశాఖ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Morning Top News:
మనోజ్.. నా గుండెల మీద తన్నావ్ రా: మోహన్బాబు
మంచు మనోజ్‌ను ఉద్దేశించి మోహన్‌బాబు సంచలన ఆడియో రిలీజ్ చేశారు. "మనోజ్.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను. చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను. భార్య మాటలు విని నా గుండెలపై తన్నావ్" అని ఆడియోలో మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాగుడుకు అలవాటుకు పడి చెడు మార్గంలో వెళ్తున్నావని.. కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఘర్షణ పడ్డామన్నారు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయని మోహన్‌బాబు తెలిపారు. ఇంట్లో ఉన్న అందరినీ ఎందుకు కొడుతున్నావని మోహన్ బాబు ప్రశ్నించారు. బతుకుదెరువు కోసం వచ్చిన పనివాళ్లను కొట్టడం మహాపాపమన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మీడియాపై మోహన్ బాబు దాడి
జల్‌పల్లిలోని తన హౌస్ వద్ద మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధిపై మంచు మోహన్ బాబు దాడి చేశారు. ఈ ఘటనపై మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి ఆరా తీశారు. దాడిలో గాయపడిన జర్నలిస్టు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి అన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మోహన్ బాబు దాడితో జర్నలిస్టుకు తీవ్ర గాయాలు
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై వీరంగం చేశారు. తన కుమారుడు మనోజ్ జల్‌పల్లిలోని తన నివాసం వద్దకు వచ్చిన సమయంలో జర్నలిస్ట్ రంజిత్‌పై దాడికి పాల్పడ్డారని తెలిసిందే. చేతిలో ఉన్న మైక్ ను లాక్కొని జర్నలిస్ట్ రంజిత్ తలపై మోహన్ బాబు బలంగా కొట్టారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం కలకలం రేపింది. జర్నలిస్టుకు గాయం కాగా, శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. జర్నలిస్ట్ రంజిత్‌కు ఎముకలు విరిగి బోన్ ఫ్యాక్చర్ అయినట్టుగా డాక్టర్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీకి మరో భారీ ప్రాజెక్టు
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఎనిమిది స్మార్ట్ సిటీలలో ఏపీకి చోటు దక్కింది. ఓర్వకల్, కొప్పర్తిలో పారిశ్రామిక స్మార్ట్ సిటీల ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైదరాబాద్-బెంగళూరు, విశాఖపట్నం-చెన్నై కారిడార్‌ల అభివృద్ధి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో రెండు కారిడార్లను అభివృద్ధి చేయనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విశాఖ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
విశాఖలోని ఓ స్కానింగ్ సెంటర్లో మహిళను అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇదివరకే కేసు నమోదు చేసిన పోలీసులు చంద్రబాబు ఆదేశాలతో నిందితుడిని సెంట్రల్ జైలుకు తరలించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
డిప్యూటీ సీఎంకు బెదిరింపు కాల్.. వ్యక్తి అరెస్టు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు ఆయన పేషీకి ఫోన్ కాల్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బెదిరింపు కాల్ చేసిన మల్లికార్జునరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లికార్జునరావు మద్యం మత్తులో ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని, రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నాగబాబుకు మంత్రి పదవి.. ఫుల్ జోష్లో జనసేన..!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి జనసేన నేత నాగబాబును తీసుకోనున్నారు. ఆయన్ని రాజ్యసభకు పంపించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశిస్తే... లేదు మంత్రివర్గంలోకి తీసుకుందామని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. నాగబాబును ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిగా చేయనున్నారు. అయితే నాగబాబు పాత వీడియోలతో వైసీపీ విమర్శలు చేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
జగదీప్ ధన్కర్పై అవిశ్వాస తీర్మానం
రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్షాలు ఇచ్చిన ఈ నోటీసుపై వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఉన్న దేశ ఉపరాష్ట్రపతిని తొలగించాలని విశ్వాస తీర్మానానికి నోటీసు ఇస్తున్నామని ఈ నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అబుధాబి టీ10 లీగ్ లో ఫిక్సింగ్ కలకలం?
క్రికెట్లో ఫిక్సింగ్ భూతం మళ్లీ జడలు విప్పింది. అభిమానులను ఎంతగానో అలరిస్తున్న టీ10 లీగ్ ఫిక్సింగ్ బారిన పడింది. ఎమిరేట్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రవర్తన నియామళిని ఉల్లంఘించినందుకుగాను ఒక జట్టు సహాయక కోచ్ సన్నీ థిల్లాన్ పై వేటు పడింది. ఆరేళ్ల పాటు ఎటువంటి క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాలుపంచుకోకుడదని ఆదేశించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పుష్ప 2 వసూళ్లలో తగ్గేదేలే
అల్లు అర్జున్ హీరోగా నటించిన సెన్సేషనల్ సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. నాలుగు రోజుల మొదటి వీకెండ్ ముగిసేసరికి ఏకంగా రూ.829 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొదటి వీకెండ్‌లో ఒక సినిమా ఇంత వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..