అన్వేషించండి

Pawan Kalyan Threat Calls Accused Arrest: పవన్‌ కళ్యాణ్‌ను చంపేస్తామని కాల్స్‌ చేసిన నిందితుడు అరెస్ట్! రహస్య ప్రాంతంలో విచారణ

Accused Arrested in Death Threat Calls : ఏపీ డిప్యూటీ సీఎం పేషీకి కాల్ చేసి పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామని బెదిరించిన నిందితుడు మల్లికార్జునరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Accused arrested for making threatening calls to Pawan Kalyan | అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసిన నిందితుడి ఆట కట్టించారు పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఫోన్‌ కాల్స్‌ చేయడంతో పాటు మెస్సేజ్‌లు పంపిన ఆగంతుకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం ఆఫీసుకు వచ్చిన బెదిరింపు కాల్స్, సందేశాలపై పేషీ సిబ్బంది పవన్ కళ్యాణ్ కు తెలిపారు. ఈ విషయాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. హోం మంత్రి అనిత ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్, సందేశాలు

పవన్ కళ్యాణ్ పేషీకి ఫోన్ చేసి బెదిరించిన ఫోన్ నెంబర్ ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరుకు చెందిన నూక మల్లికార్జునరావు పేరిట ఉందని పోలీసులు గుర్తించారు. 95055 05556 నంబరు నుంచి ఫోన్ కాల్స్, సందేశాలు పంపిన నిందితుడ్ని అరెస్ట్ చేయడంతో జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తులో నిందితుడు బెదిరింపు కాల్స్ చేశాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం మల్లికార్జునరావును రహస్య ప్రాంతానికి తీసుకెళ్లిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదట పోలీసులు ఇది ఆకతాయి చేసిన పనిగా భావించలేదు. ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేసి బెదిరించాలని ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తాలని చూస్తున్న పవన్ కళ్యాణ్‌ను అడ్డుకునేందుకు ఇలాంటి బెదిరింపులు కాల్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు. 

ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసిన సీపీ

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరుకు చెందిన మల్లికార్జునరావు పేరుతో ఆ సెల్ ఫోన్ నెంబర్ ఉండగా.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వద్ద ఉన్న సెల్ టవర్‌ నుంచి కాల్స్‌ వచ్చినట్లు పోలీసులు తేల్చారు. ఏపీ హోం మంత్రి అనితతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దాంతో కేసు విచారణలో భాగంగా విజయవాడ నగర కమిషనర్‌ రాజశేఖర్‌బాబు స్పెషల్‌ బ్రాంచి, లా అండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ఫోర్స్, విభాగాలకు చెందిన పోలీసులతో కొన్ని టీమ్స్‌ను ఏర్పాటు చేశారు.

సీక్రెట్ ప్లేస్‌లో నిందితుడ్ని ప్రశ్నిస్తున్న పోలీసులు

డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం రావడంతో తక్షణం సెల్ ఫోన్ లోకేషన్ ట్రాకింగ్ మొదలుపెట్టారు. కానీ బెదిరింపు కాల్స్ చేసిన అనంతరం ఆ ఫోన్‌ స్విచ్ఛాఫ్ చేయడంతో అగంతకుడు ఎక్కడ ఉన్నాడు అనేది అంత సులువుగా గుర్తించడం కష్టమైంది.. విజయవాడతో పాటు తిరువూరులోనూ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడు మల్లికార్జునరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే రాజకీయ కారణాలు కనిపించడం లేదని, మద్యం మత్తులో చేసిన కాల్స్ అని నిందితుడు చెబుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Manchu Vs Bhuma: భూమా ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటారా ? మంచు కుటుంబం ఫ్యాక్షన్ ఎదుర్కోక తప్పదా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
Australia In Semis: సెమీస్ కు ఆసీస్.. ఆఫ్గాన్ తో మ్యాచ్ ర‌ద్దు.. టోర్నీ నుంచి ఆఫ్గాన్ ఔట్..! సౌతాఫ్రికాపైనే అంద‌రి దృష్టి
సెమీస్ కు ఆసీస్.. ఆఫ్గాన్ తో మ్యాచ్ ర‌ద్దు.. టోర్నీ నుంచి ఆఫ్గాన్ ఔట్..! సౌతాఫ్రికాపైనే అంద‌రి దృష్టి
Good Bad Ugly Teaser: అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP DesamFlash Floods in Kullu Manali | బియాస్ నదికి ఆకస్మిక వరదలు | ABP DesamSuriya Jyothika With Kids First Time | సూర్య, జ్యోతిక పిల్లలు ఎంత పెద్ద వాళ్లైపోయారో | ABP DesamSLBC Tunnel Incident vs Uttarakhand Tunnel | ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్..SLBC లో దేనికి ఆటంకం.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల సీటు, నేతల మధ్య పెంచుతోంది హీటు... ఆ ఛాన్స్ ఎవరికో
Australia In Semis: సెమీస్ కు ఆసీస్.. ఆఫ్గాన్ తో మ్యాచ్ ర‌ద్దు.. టోర్నీ నుంచి ఆఫ్గాన్ ఔట్..! సౌతాఫ్రికాపైనే అంద‌రి దృష్టి
సెమీస్ కు ఆసీస్.. ఆఫ్గాన్ తో మ్యాచ్ ర‌ద్దు.. టోర్నీ నుంచి ఆఫ్గాన్ ఔట్..! సౌతాఫ్రికాపైనే అంద‌రి దృష్టి
Good Bad Ugly Teaser: అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
అజిత్ మాస్... ఇది కదా ఫ్యాన్స్ కోరుకునేది - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ అదిరిందంతే
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - త్వరలోనే పనులు ప్రారంభం
Andhra Pradesh Budget 2025: అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
అమరావతికి కేటాయింపులు ఎందుకు?: పయ్యావుల ఆసక్తికర కామెంట్స్
Revanth on Kishan Reddy:  కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
కిషన్ రెడ్డి వల్లే తెలంగాణకు అన్యాయం - మరోసారి రేవంత్ ఆగ్రహం
Viral News: కోనసీమలో మోనాలిసా అంటూ బాలిక వీడియో తీశాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇదీ
కోనసీమలో మోనాలిసా అంటూ బాలిక వీడియో తీశాడు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఇదీ
Ram Charan - Chiranjeevi: రామ్ చరణ్ సినిమాలో అతిథిగా మెగాస్టార్... అందులో నిజం ఎంతంటే?
రామ్ చరణ్ సినిమాలో అతిథిగా మెగాస్టార్... అందులో నిజం ఎంతంటే?
Embed widget