Top Headlines Today: నిరుద్యోగులతో రాహుల్ గాంధీ; రైతు బంధు నగదు జమ డౌటేనా? - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
నిరుద్యోగులను చూసి చలించిపోయిన రాహుల్ గాంధీ
తెలంగాణ ప్రభుత్వంపై యువత, నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. అందుకే నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్, బీజేపీలు పదే పదే ప్రస్తావిస్తూ యూత్ ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ క్రమంలో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న యువతను కలిశారు. వారి సమస్యలు విని రాహుల్ గాంధీ చలించిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ (Congress Government in Telangana) ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అన్నారు. ఇంకా చదవండి
వీటికి జవాబు చెప్పే దమ్ముందా? రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నలు సంధించారు. యువతను మభ్యపెట్టి నాలుగు ఓట్లు వేయించుకునే నాటకం తప్ప చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తుందా..? దమ్ముంటే తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. దేశంలో గత పదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందా..? తొమ్మిదిన్నర ఏండ్లలో 2లక్షల 2వేల 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి.. ఒక లక్షా 60వేల083 నియామకాలను పూర్తిచేసింది మా ప్రభుత్వం.. ఈ లెక్కతప్పని నిరూపించగలవా..? అని రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇంకా చదవండి
నేడు తిరుమలకు ప్రధాని మోదీ, కేంద్ర బలగాలతో పటిష్ఠ బందోబస్తు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (నవంబర్ 26) తిరుమలకు రానున్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో పాటు ఏపీ పోలీసు ఉన్నత ఉన్నతాధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్న క్రమంలో తిరుమల వ్యాప్తంగా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రముఖులు బస చేసే అతిథి గృహాలను ఇప్పటికే ఎన్ ఎస్ జీ బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. ప్రధాని ఏ మార్గాలు అయితే ప్రయాణిస్తారో ఆ మార్గాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల ఉన్నతాధికారులు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆలయం ఇతర ప్రవేశాలను టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు. ఇంకా చదవండి
నేడు బంగాళాఖాతంలో ఆవర్తనం
ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చొట్ల కురిసే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. ఇంకా చదవండి
రైతు బంధు నగదు జమ డౌటేనా ?
రైతుబంధు పంపిణీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 24వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో రబీ పెట్టుబడి సాయం జమ చేసుకోవచ్చని చెప్పింది. డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్) చేస్తున్నందున రైతుబంధు ప్రభావం ఓటర్లపై ఉండదని తెలిపింది. రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు రైతుబంధు సాయం పంపిణీపై ప్రభుత్వం ఇటీవల ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరింది. తాజాగా దీనిపై బదులిచ్చిన ఈసీ.. రైతుబంధు పంపిణీకి ఓకే చెప్పింది. ఇంకా చదవండి
కొచ్చి వర్సిటీలో టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట
కేరళలోని ఓ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. వర్సిటీలో జరిగిన టెక్ ఫెస్ట్ లో ఒక్కసారిగా తొక్కిసలాట (Kochi Stampede) జరగడంతో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 60 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలుస్తోంది. కేరళలోని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆడిటోరియం బయట ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా లోపలికి రావడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఇంకా చదవండి
ఐదు కొత్త ఐసీఈ కార్లు లాంచ్ చేయనున్న మారుతి - ఏయే కార్లు రావచ్చు?
భారతీయ ఆటోమోటివ్ మార్కెట్ కోసం మారుతి సుజుకి అగ్రెసివ్ స్ట్రాటజీ ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మారుతి సుజుకీ ప్రెసిడెంట్ ఆర్సీ భార్గవ 2031 నాటికి ఐదు కొత్త ఐసీఈ మోడళ్లను పరిచయం చేయడం ద్వారా తన ప్రొడక్ట్ లైనప్‌ను విస్తరించే ప్రణాళికలను వెల్లడించింది. ఏ మోడల్‌లు వస్తాయో ఇంకా వెరిఫై అవ్వలేదు. అయితే మూడు వరుసల ఎస్‌యూవీలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా చదవండి
సుకుమార్ రేర్ రికార్డ్ - తెలుగులో రాజమౌళి తర్వాత లెక్కల మాస్టారే!
దర్శకుడు సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? 'పుష్ప' విడుదల ముందు వరకు తక్కువ ఉండేది. 'పుష్ప : ది రైజ్' కోసం ఆయన తొలిసారి 25 కోట్ల రూపాయల చెక్ అందుకున్నారు. ఇప్పుడు 'పుష్ప : ది రూల్'కి గాను ఫస్ట్ పార్ట్ కోసం తీసుకున్న దాని కంటే నాలుగు రేట్లు ఎక్కువ సుక్కు అందుకుంటున్నారని ఫిల్మ్ నగర్ ఖబర్. ఇంకా చదవండి
నితిన్ జెండా, ఎజెండా ఒక్కటే - 'ఎక్స్ట్రా' ట్రైలర్ ఆ రోజే విడుదల
నితిన్ తన జెండా, ఎజెండా ఒక్కటే అని అంటున్నారు. అంటే... ఆయన రాజకీయాల్లోకి ఏమీ రావడం లేదు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'. అందులో జెండా, ఎజెండా ఎంటర్‌టైన్‌మెంట్ అని చెబుతున్నారు. ఇంకా చదవండి
ఐపీఎల్ సందడి ఎప్పటినుంచంటే.? - వేలానికి సమీపిస్తున్న గడువు
భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ముగిసింది. ఇప్పుడు మరో క్రికెట్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ మార్చి 11తో ముగియనుంది. ఆ తర్వాత మార్చి మధ్యలో నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్నట్లు.. క్రీడావర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. ఇంకా చదవండి