అన్వేషించండి

KTR Questions To Rahul Gandhi: వీటికి జవాబు చెప్పే దమ్ముందా? రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు ఇవే

Telangana Polls 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నలు సంధించారు. యువతను మభ్యపెట్టి నాలుగు ఓట్లు వేయించుకునే నాటకం తప్ప చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తుందా..? దమ్ముంటే తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. దేశంలో గత పదేండ్లలో  తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందా..? తొమ్మిదిన్నర ఏండ్లలో 2లక్షల 2వేల 735  ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి.. ఒక లక్షా 60వేల083 నియామకాలను పూర్తిచేసింది మా ప్రభుత్వం.. ఈ లెక్కతప్పని నిరూపించగలవా..? అని రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.

‘మీరు అధికారం  వెలగబెట్టిన పదేండ్ల కాలంలో( 2004-14 ) తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని?  కేవలం 10వేల 116 మాత్రమే కాదా? ఇదేనా నిరుద్యోగులైన  మీ ప్రేమ..?. మా ప్రభుత్వం ఏడాదికి  సగటున నింపిన సర్కారు కొలువులు 16,850!. కాంగ్రెస్ హయాంలో(  2004-14 ) సంవత్సరానికి ఇచ్చింది  కేవలం 1012 జాబులు..! ఇదీ మీకూ మాకూ  వున్న తేడా..!  మీరొచ్చి మాకు సుద్దులు చెబితే ఎట్లా..? జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేసావా..?  ఉద్యోగం చేసావా..? యువత ఆశలు ఆకాంక్షలు  తెలుసా..?  పోటీ పరీక్షలు రాసినవా.? ఇంటర్వ్యూ కు వెళ్లినవా..?  ఉద్యోగార్థుల ఇబ్బందులు ఏమన్నా అర్థమైతయా నీకు..? అని ప్రశ్నించారు.

‘95 శాతం ఉద్యోగాలు స్థానిక  బిడ్డలకే దక్కేలా  కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన నిబద్ధత మాది..! మా కొలువులు మాకే దక్కాలన్న ఉద్యమస్ఫూర్తిని నిలబెట్టి నియామకాల నినాదాన్ని నిజం చేసిన వాస్తవాన్ని కాదనగలవా..?. 1972 లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధలను సమర్థిస్తూ తీర్పునిస్తే.. పార్లమెంట్ లో చట్టంచేసి ముల్కీ రూల్స్ ను రద్దుచేసి.. తెలంగాణ స్థానికత హక్కులకు  సమాధికట్టింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా..?. ఆరుసూత్రాలు..610  జీవోలు..గిర్ గ్లానీ నివేదకలు తుంగలో తొక్కి..హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా మార్చేసి ..నాన్ లోకల్  కోటాలు పెట్టి..తెలంగాణ యువతకు  దక్కాల్సిన కొలువులను కొల్లగొట్టి తీరని అన్యాయం చేసిన ద్రోహులు మీరు కాదా..?. మీ పనికిమాలిన పాలనలో ఉపాధిలేక..ఉద్యోగాల్లేక  నిరాశా నిస్పహలతో  తెలంగాణ యువత తుపాకులు చేతబట్టి అడవిబాటపట్టి  నక్సలైట్లలో చేరింది నిజమా..? కాదో చెప్పాలన్నారు కేటీఆర్.

వేలమంది యువకుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపి ..ఎన్కౌంటర్ల పేరుతో నిత్యం నెత్తుటేర్లు పారించిన కర్కశ మైన పాలన మీది కాదా..?. మీ కాలంలో ఏపీపీఎస్సీ అక్రమాలకు అడ్డాగా మారి..అంగట్లో బేరంపెట్టి కొలువులను అమ్ముకోలేదా..? ప్రాంతీయ వివక్షతో..ఇంటర్వ్యూల ముసుగులో తెలంగాణ  యువతకు  ఉద్యోగాలు రాకుండా చేసింది నిజం కాదా..?. 1952లో నాన్ ముల్కీ గోబ్యాక్..ఇండ్లీ సాంబార్ గో బ్యాక్ అని నినదించిన విద్యార్థులపై తూటాలు పేల్చి..ఏడుగురు తెలంగాణ ముద్దు బిడ్డల్ని  చంపిన  దుర్మార్గులు.. దోషులు మీరు కాదా..?. 1969లో  జై తెలంగాణ అని నినదించిన 369 మంది యువత గుండెల్లో తుపాకిగుండ్లు దించి పొట్టనపెట్టుకున్న నర హంతకులు మీరు కాదా..? అని రాహుల్ గాంధీకి ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read: Telangana Elections 2023: తెలంగాణ ఇవ్వడం మేం చేసిన రిస్క్- కాంగ్రెస్ నేత జైరాం రమేష్

2004లో తెలంగాణకు ఇచ్చిన మాటతప్పి.. పదేండ్లు కాలయాపన చేసి వందల మంది యువతీ యువకుల ఆత్మబలిదానాలకు కారణమైన నేరం మీదికాదా. సోనియగాంధీ బలిదేవతని మీ పీసీసీ ప్రెసిడెంటే చెప్పింది అబద్ధమా..?. కర్ణాటకలో 100  రోజుల్లో  రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న మీ ప్రగల్భాలు ఏమయ్యాయి?  6 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెబ్తవా..? వాగ్దానం చేసి యువతను వంచించలేదా...?. మీరు రాజ్యం ఏలుతున్న రాజస్థాన్ లో..చత్తీస్ గఢ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీహామీని మరిచి.. నిరుద్యోగులను  నిండా ముంచింది నిజం కాదా..?. మీరు ప్రకటించిన పసలేని జాబ్ కేలండర్ ఒక పచ్చి మోసం కాదా..? ఎన్నికల కోడ్ అమల్లో ఉండే 2024 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉద్యోగ పరీక్షలు ఎట్లా  సాధ్యం..?. యువతను మభ్యపెట్టి నాలుగు ఓట్లు వేయించుకునే నాటకం తప్ప చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తుందా..? అని రాహుల్ గాంధీని ఎక్స్ లో ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. 
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Embed widget