అన్వేషించండి

Top 5 Headlines Today: పోడుభూముల పట్టాల పంపిణీకి డేట్ ఫిక్స్; పవన్ సంచలన వ్యాఖ్యలు - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

పోడు భూములకు పట్టాలు - ఈ 30న కేసీఆర్ చేతుల మీదుగా

పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో జూన్ 30వ తేదీ నుంచి ఆదివాసీ గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజు (జూన్ 30)న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇంకా చదవండి

రాజోలులో నాపై దాడికి యత్నం, సుపారీ గ్యాంగ్ ఉంది! పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా... నా బలం నాకు బాగా తెలుసు.. నా బలహీనతలు బాగా తెలుసని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. గత ఎన్నికల్లో రాజోలులో గెలిచి చిరు దీపంలా మనందరిలో స్ఫూర్తిని రగలించిందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని చోట్ల పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని, అందరికీ టచ్‌లో ఉంటానన్నారు. సత్యాన్ని ఆవిష్కరించేందుకు తపన పడుతున్నానని, అందుకు తనపై సుపారీ గ్యాంగ్ లతో దాడిచేసి హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారని మరోసారి అన్నారు. నిన్నటికి నిన్న రాజోలులో మెయిన్‌ రోడ్‌లో రాళ్లు పట్టుకుని నలుగురు క్రిమినల్స్‌ దొరికారని, వాళ్ల పోలీసులకు పట్టించారన్నారు. దిండి రాసార్ట్స్‌లో పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ నాయకులతో పవన్‌ కళ్యాణ్‌ శనివారం సమావేశం నిర్వహించారు. ఇంకా చదవండి

కేటీఆర్‌కు అమిత్ షా అపాయింట్‌మెంట్ రద్దు

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పరిష్కారం కావాల్సిన అంశాలపై సంబంధిత మంత్రులు, అధికారులను కలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడం కోసం ఆయన అపాయింట్ మెంట్ కోరగా, ఖరారు చేసి ఆ తర్వాత రద్దు చేశారు. శనివారం రాత్రి 10 గంటలు దాటాక మంత్రి కేటీఆర్‌కు అమిత్ షాను కలవడానికి తొలుత అపాయింట్ మెంట్ ఇచ్చారు. హైదరాబాద్‌లో రహదారుల విస్తరణకు కేంద్ర హోం శాఖ పరిధిలోని భూములు కోరడం సహా, విభజన చట్టంలోని పలు అంశాలపై మాట్లాడడానికి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ను కేటీఆర్‌ కోరారు. ఇంకా చదవండి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు నిజంగానే పార్టీ మారుతున్నారా ?

కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికల గురించి వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతారని చెబుతున్నారు. ఎంత వరకూ చేరుతారో తెలియదు కానీ.. పార్టీ నుంచి వెళ్లిపోతారు అన్న నేతలు మాత్రం సైలెంట్ అయిపోయారు. అయితే అనూహ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ చేరుతామని ప్రకటించిన తర్వాత కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. వారిలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి వంటి వాళ్లు ఉండటంతో చర్చనీయాంశమయింది. ఇంకా చదవండి

ఏపీలో పొత్తులపై సొము వీర్రాజు కీలక వ్యాఖ్యలు - పవన్, ముద్రగడ అంశంపైనా స్పందన

తెలుగు దేశంతో పొత్తులపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్  అధ్యక్షుడు సోము వీర్రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తామూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదని అనేక సార్లు చెప్పామని ఆయన అన్నారు. ఎన్నికలకు పొత్తుల వ్యవహరంలో పార్టీ అన్ని విధాలుగా ఆలోచనలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ నేతలను కలిశారని వీర్రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి,  అమిత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అవినీతి పై రాజకీయంగా విమర్శలు చేసిన విషయాలను కూడా సొము వీర్రాజు, గుర్తు చేస్తున్నారు. ఇంకా చదవండి

ఎస్‌ఈసీ ఇచ్చిన గుర్తు అసెంబ్లీ ఎన్నికలకు పనికొస్తుందా ?

జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబర్ ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ అభిమానులు కూడా ఇదే చెబుతున్నారు. ఎన్నికల సంఘం రాష్ట్ర పార్టీగా గుర్తించిందని చెబుతున్నారు. నిజానికి ఈ గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది అసెంబ్లీ ఎన్నికలకు కాదు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే.. అందులో జనసేన పోటీ చేస్తే.. అప్పుడు గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేయవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే గుర్తును ఖరారు చేసేది  మాత్రం ఎస్‌ఈసీ కాదు..  భారత ఎన్నికల సంఘం. ఇంకా చదవండి

మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు - పాప పుట్టాక ఉపాసన మొదటి పోస్ట్!

కూతురు పుట్టాక ఉపాసన కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి పోస్ట్ పెట్టారు. తమ పాపకు ప్రేమతో వెల్‌కమ్ చెప్పిన వారందరికీ థ్యాంక్యూ చెప్పారు. డెలివరీ అయ్యాక మూడు రోజుల పాటు హాస్పటల్లో ఉన్న ఉపాసన ఇంటికి చేరుకున్నారు. ఇంటి వద్ద కూడా వారికి ఘన స్వాగతం లభించింది. అక్కడ దిగిన ఫొటోనే ఉపాసన పోస్ట్ చేశారు. ఉపాసన పోస్టుపై హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక చోప్రా కూడా స్పందించారు. ఉపాసనకు కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. ఇంకా చదవండి

పుజారాను మాత్రమే ఎందుకు తప్పించారు? ఆయన కెరీర్‌ ప్రమాదంలో పడబోతుందా?

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓటమిలో ఒకరిద్దరు మినహా అందరు భాగస్వాములే. అయినప్పటికీ వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లే అనుహ్యమైన మార్పులు చేసింది సెలక్షన్ కమిటీ. ముఖ్యంహగా పుజారాను, ఉమేష్ యాదవ్‌ను తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంకా చదవండి

మ్యాజిక్‌ చేసిన మోదీ, భారీ పెట్టుబడులు ప్రకటించిన గూగుల్‌ & అమెజాన్‌

అగ్రరాజ్యం అమెరికాలో మోదీ మ్యాజిక్‌ చేశారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్‌ టెక్‌ జెయింట్స్‌ గూగుల్‌, అమెజాన్‌ను ఒప్పించారు. ఈ రెండు కంపెనీలు రంగంలోకి దిగితే, వేల కొద్దీ కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇంకా చదవండి

₹2000: పింక్‌ నోట్ల 'విత్‌డ్రా'కు సరిగ్గా నెల, ఈ 30 రోజుల్లో ఏం జరిగిందో తెలుసా?

2 వేల రూపాయల నోట్ల విత్‌ డ్రా ప్రారంభమై సరిగ్గా నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో, చలామణీలో ఉన్న రూ.2,000 కరెన్సీ నోట్లలో 72% పైగా నోట్లు బ్యాంకులను టచ్‌ చేశాయి. జనం వాటిని డిపాజిట్ చేశారు/చిన్న నోట్లుగా మార్చుకుని తిరిగి తీసుకున్నారు. ఇంకా చదవండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
AP Gokulam Scheme: సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
AP Gokulam Scheme: సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
సంక్రాంతికి ఏపీ వ్యాప్తంగా గోకులాలు ప్రారంభం, పిఠాపురంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
ICC Test Rankings News: భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
Embed widget