అన్వేషించండి

Upasana Konidela: మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు - పాప పుట్టాక ఉపాసన మొదటి పోస్ట్!

తమ పాపకు వెల్‌కమ్ చెప్పిన వారికి థ్యాంక్స్ చెప్తూ ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

కూతురు పుట్టాక ఉపాసన కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి పోస్ట్ పెట్టారు. తమ పాపకు ప్రేమతో వెల్‌కమ్ చెప్పిన వారందరికీ థ్యాంక్యూ చెప్పారు. డెలివరీ అయ్యాక మూడు రోజుల పాటు హాస్పటల్లో ఉన్న ఉపాసన ఇంటికి చేరుకున్నారు. ఇంటి వద్ద కూడా వారికి ఘన స్వాగతం లభించింది. అక్కడ దిగిన ఫొటోనే ఉపాసన పోస్ట్ చేశారు. ఉపాసన పోస్టుపై హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక చోప్రా కూడా స్పందించారు. ఉపాసనకు కంగ్రాట్యులేషన్స్ చెప్పారు.

View this post on Instagram
 
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

కూతురు పుట్టిన అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన మొదటిసారి శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ దంప‌తుల‌కు జూన్ 20వ తేదీన పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే. తల్లి, బిడ్డ ఇద్దరూ అపోలో డాక్టర్ల ప‌ర్యవేక్ష‌ణ‌లోనే ఉన్నారు. పాప పుట్టిన మూడో రోజున అంటే జూన్ 23వ తేదీన ఉపాస‌న హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొయినాబాద్‌లో ఉన్న త‌న త‌ల్లి ఇంటికి బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ ప్రెస్‌మీట్‌లో రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ. ‘జూన్ 20వ తేదీన తెల్లవారు జామున పాప పుట్టిన సంగతి తెలిసిందే. ఉపాస‌న‌, పాప ఇద్దరూ రిక‌వ‌ర్ కావ‌టంతో హాస్పిట‌ల్ నుంచి ఇంటికి వెళుతున్నాం. డాక్ట‌ర్ సుమ‌న‌, డాక్ట‌ర్ రుమ, డాక్ట‌ర్ ల‌త‌, డాక్ట‌ర్ సుబ్బారెడ్డి, డాక్ట‌ర్ అమితా ఇంద్ర‌సేన‌, తేజ‌స్వి స‌హా అపోలో టీమ్‌కి అందరికీ థాంక్స్‌. వీరంతా చాలా బాగా చూసుకున్నారు. మేమెంతో అదృష్టవంతులం. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. పాప, ఉపాస‌న‌ ఇద్ద‌రూ క్షేమంగా  ఉన్నారు.’

‘మంచి డాక్టర్స్ టీమ్ ఉన్నారు కాబ‌ట్టి మాకు ఎలాంటి భ‌యం కలగలేదు. మా అభిమానుల ప్రార్థ‌న‌లు, వాళ్లు చేసిన పూజలు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అభిమానులను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. వాళ్ల ద‌గ్గ‌ర నుంచి ఇంత‌క‌న్నా అడుగుతాను. అలాగే అన్ని దేశాల నుంచి మా శ్రేయోభిలాషులు, ఇత‌రులు కూడా ఆశీస్సులు అందించారు.  మీడియా మిత్రులంద‌రికీ ఈ సందర్భంగా థాంక్స్‌. మీరు అందించిన ఆశీర్వాదాలు మా పాప‌కు ఎప్పుడూ ఉంటాయి. ఇంత మ‌ధుర క్ష‌ణాల‌ను నా జీవితంలో మ‌ర‌చిపోలేను. మీ అభిమానం చూస్తుంటే నాకు నోటి నుంచి మాట‌లు రావ‌టం లేదు. మా పాప‌కు కూడా ఈ అభిమానం ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’

ఇంకా మాట్లాడుతూ... ‘21వ రోజు పాప‌కు పేరు పెడ‌దామ‌ని అనుకుంటున్నాం. నేను, ఉపాస‌న పాపకు ఒక పేరు అనుకున్నాం. త‌ప్ప‌కుండా అది మీ అంద‌రికీ కూడా తెలియ‌జేస్తాను. చాలా సంవ‌త్స‌రాలుగా మేం ఎదురు చూస్తున్న స‌మ‌యం ఇది. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు మాకు దొరికాయి. నాకు ఇప్పుడు చెప్ప‌లేనంత ఆనందంగా ఉంది. మ‌ళ్లీ  అంద‌రికీ ధన్యవాదాలు.’ అని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget