Top Headlines Today: ఇంకా తెలంగాణ సెంటిమెంట్‌తోనే బీఆర్ఎస్; ఎన్టీఆర్ స్మారక నాణెం రికార్డు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
చివరి అస్త్రంగా తెలంగాణ సెంటిమెంట్ ప్రయోగం
"కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయి " ఇటీవలి ఎన్నికల ప్రచార సభల్లో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేస్తున్న, చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి ఇవి. మొదట్లో ఆయన జాతీయ రాజకీయ ప్రస్తావన తీసుకు రాలేదు. కానీ రెండో విడత ప్రచారంలో కేంద్రం వచ్చే ప్రభుత్వం గురించి చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీల హవా గురించి చెబుతున్నారు. కేసీఆర్ ప్రాంతీయ పార్టీల గురించి చెప్పినప్పుడల్లా ఎక్కువ మందికి ఒకటే డౌట్ వస్తోంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీనా... రాష్ట్ర పార్టీనా అనే. తెలంగాణలో సాధించాల్సింది అయిపోయిందని.. ఇక దేశంలో గుణాత్మక మార్పు తీసుకు రావాలన్న లక్ష్యంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి.. జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా చదవండి
మేడిగడ్డ ఘటనపై బీజేపీ నో రెస్పాన్స్ - మొన్న మోదీ, ఇవాళ అమిత్ షా
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు రావడం, అన్నారం సరస్వతీ బ్యారేజీలో నీళ్లు లీక్ కావడం సంచలనంగా మారింది. ఎన్నికల వేళ ఈ ఘటనలు అధికార బీఆర్ఎస్‌కు చిక్కులు తెచ్చి పెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతికి పాల్పడి సరిగ్గా నిర్మాణం చేయలేదని, నాణ్యతా లోపం వల్లే కూలిపోయిందని ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర నిపుణుల బృందం.. నాణ్యతా లోపం వల్లనే కుంగిపోయిందని తేల్చేసింది. దీంతో ఎన్నికల వేళ ఈ పరిణామం బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఇంకా చదవండి
ఎన్టీఆర్ స్మారక నాణెం - రికార్డు స్థాయిలో విక్రయాలు
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 స్మారక నాణెం (NTR Commemorative Coin) అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. హైదరాబాద్ (Hyderabad) మింట్ కాంపౌండ్ లో ఎన్టీఆర్ స్మారక నాణెం తయారు కాగా, మార్కెట్లోకి విడుదలైన 2 నెలల్లోనే 25 వేల నాణేలు అమ్ముడయ్యాయి. దేశంలోనే ఇది సరికొత్త రికార్డని మింట్ సీజీఎం వీఎన్ఆర్ నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వీఎన్ఆర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఇంకా చదవండి
ఊరూ వాడా నాసిరకం మద్యం
అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన సీఎం జగన్, ఊరూ వాడా నాసిరకం మద్యం తెచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu) ఆరోపించారు. మంగళగిరిలో (Mangalagiri) ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలు బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్మినట్లుగా మద్యం అమ్ముతున్నారని, ఫుడ్ డెలివరీ చేసినట్లుగా లిక్కర్ డోర్ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తయారీ నుంచి అమ్మకం వరకూ మొత్తం సీఎం జగన్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని మండిపడ్డారు. ఇంకా చదవండి
నెతన్యాహుని కాల్చి పారేయాలి, కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితన్ (Rajmohan Unnithan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని (Benjamin Netanyahu) కాల్చి పారేయాలని అన్నారు. ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేశారు. కేరళలోని కాసర్‌గడ్‌లో పాలస్తీనా పౌరులకు మద్దతుగా భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న రాజ్‌మోహన్ నెతన్యాహుపై మండి పడ్డారు. వెనకా ముందు ఆలోచించకుండా నెతన్యాహుని (Israel-Hamas War) కాల్చేయాలని ఫైర్ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, యూకే, అమెరికా కలిసి International Military Tribunal (IMT)ని ఏర్పాటు చేశాయి. యుద్ధ నేరాలతో పాటు యుద్ధ సమయాల్లో దారుణంగా హింసించడం లాంటివి చేసిన నేతల్ని Nuremberg Trial పేరుతో కాల్చి చంపేవాళ్లు. ఇంకా చదవండి
కీలక బిల్స్‌ని వెనక్కి పంపిన గవర్నర్, మళ్లీ ప్రవేశ పెట్టిన తమిళనాడు ప్రభుత్వం
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్‌ఎన్ రవి (RN Ravi)మధ్య మరోసారి వివాదం రాజుకుంది. ప్రభుత్వం పంపిన 10 బిల్స్‌ని తిరిగి పంపారు. మళ్లీ వీటినే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం సంచలనమైంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్స్‌ని ప్రవేశపెట్టింది. నవంబర్ 16వ తేదీన ఈ బిల్స్‌ని వెనక్కి పంపంది గవర్నర్ ఆర్‌ఎన్ రవి. ఈ బిల్స్‌కి ఆమోదం తెలపాలని ప్రభుత్వం పంపినప్పటికీ వాటిని తిరస్కరించారు గవర్నర్. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ముఖ్యమంత్రి MK స్టాలిన్ (MK Stalin) ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్స్‌కి గవర్నర్ ఆమోదం తెలపకపోవడం అసహనం వ్యక్తం చేశారు. ఇంకా చదవండి
అహ్మదాబాద్‌కు విమాన టికెట్ రూ.40 వేలు
అహ్మదాబాద్ వేదికగా 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు (ICC World Cup Cricket 2023 Final Match) జరుగుతోంది. నవంబర్ 19న, ఆదివారం నాడు భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (India - Australia World Cup Final Match) జరుగుతుంది. కొదమసింహాల్లాంటి ఈ రెండు జట్ల పోరును టీవీల్లో చూసే కంటే, ప్రత్యక్షంగా గ్రౌండ్‌లో ఉండి, బాల్-టు-బాల్ చూస్తే ఆ కిక్కే వేరప్పా. అహ్మదాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు చూడడానికి చాలా కాలం క్రితమే టిక్కెట్లు కొన్నారు క్రికెట్ అభిమానులు. ఇంకా చదవండి
చాట్‌జీపీట్ సృష్టికర్తకు ఘోర అవమానం
కంటెంట్ సెర్చ్‌ను కృత్రమ మేథకు (Artificial Intelligence) జత చేసి, చాట్‌జీపీటీని (ChatGPT) సృష్టించిన శామ్ ఆల్ట్‌మన్‌కు (Sam Altman) తీవ్ర అవమానం ఎదురైంది. శామ్ ఆల్ట్‌మన్‌ను CEO సీటు నుంచి బలవంతంగా దింపేస్తూ ఓపెన్‌ఏఐ (OpenAI) కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇంకా చదవండి
టీమిండియా గెలిస్తే వంద కోట్లు పంచేస్తా
భారత్(India) వేదికగా జరుగుతున్న ప్రపంచకప్(World Cup) తుది అంకానికి చేరుకుంది. నేడు జరగనున్న ఫైనల్‌తో ఈ మహా సంగ్రామం ముగియనుంది. అప్రతిహాత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా... అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో(Austrelia) అమీతుమీ తేల్చుకోనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్న టీమ్ ఇండియా చివరి అడుగు వేసి ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్‌తో అదరగొడుతుంటే... బౌలర్లు పదునైన బంతులతో బెదరగొడుతున్నారు. టీమిండియా విజయం కోసం 130 కోట్ల మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంకా చదవండి
మహా సంగ్రామానికి సర్వం సిద్ధం , జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?
ప్రపంచకప్‌లో మహా సంగ్రామానికి టీమిండియా(Team India) సిద్ధమైంది. సూపర్ సండే రోజున అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Austrelia)తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. టీమిండియా విజయం కోసం 130 కోట్ల మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన విరాట్ కోహ్లి, అశ్విన్ మరోసారి ఆ అనుభూతిని పొందాలని పట్టుదలతో ఉన్నారు. ఏమాత్రం ఎమరుపాటు లేకుండా.. ముచ్చటగా మూడోసారి కప్పును గెలిచేందుకు రోహిత్ సేన సిద్ధంగా ఉంది. ఇంకా చదవండి
ఎన్నికల ప్రచారంలో హీరో నాని బిజీ బిజీ
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈ నెలాఖరున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. నాయకులంతా జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక హామీలను గుప్పిస్తున్నారు. తాము అధికారికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చెబుతూ మ్యానిఫెస్టోలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని సైతం రాజకీయ నాయకుడి అవతారమెత్తాడు. ఇంకా చదవండి