Top Headlines Today: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం; తెలంగాణ ఐటీ సోదాలు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
చంద్రబాబు క్వాష్ పిటిషన్ - సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
స్కిల్ స్కాం కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. దీపావళి సెలవుల తర్వాత దీనిపై తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది. పాత ఆర్డర్ ప్రకారం పండుగ సెలవుల అనంతరం తీర్పు ఇస్తామని పేర్కొంది. అటు, ఫైబర్ నెట్ కేసులో (Fiber net case) ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అంతవరకూ చంద్రబాబును అరెస్ట్ చెయ్యొద్దని సీఐడీని ఆదేశించింది. ఏపీ సీఐడీ (Ap cid) పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇంకా చదవండి
ఐటీ దాడులపై రెండు రోజుల క్రితమే చెప్పిన పొంగులేటి
తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంతలా ఓట్ల కోసం తిరుగుతున్నారో అంతకంటే ఎక్కువ ఐటీ అధికారులు నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలు, ఆఫీస్‌లపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితమే ఆయన ఈ విషయాన్ని చెప్పారు. తనపై కూడా ఐటీ రైడ్స్ జరుగుతాయని అందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. ఆయన విమర్శలు చేసిన రెండు రోజుల్లోనే ఐటీ అధికారులు రైడ్స్ షురూ చేశారు. ఇంకా చదవండి
'ఐటీ, ఈడీ దాడులు దేనికి సంకేతం?' - కాంగ్రెస్ ప్రభంజనం చూసి ప్రధాని, కేసీఆర్ భయపడుతున్నారన్న రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇళ్లపై ఎందుకు ఐటీ, ఈడీ దాడులు జరగడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanthreddy) ప్రశ్నించారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasreddy) ఇంటిపై ఐటీ, ఈడీ దాడులపై (It raids) ఆయన స్పందించారు. ఈ దాడులు దేనికి సంకేతమని, ఇలాంటి వాటికి కాంగ్రెస్ భయపడదని అన్నారు. 'రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ బెంబేలెత్తుతున్నారు. కాంగ్రెస్ ప్రభంజనం ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం.' అని రేవంత్ స్పష్టం చేశారు. ఇంకా చదవండి
సీతక్క ఆస్తులెన్నో తెలుసా , నగదు లేని మల్లారెడ్డి- అఫిడవిట్‌లో ఆసక్తికరమైన విషయాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections 2023) సందర్భంగా నామినేషన్ల(Namination) ప్రక్రియ జోరందుకుంది. బుధవారం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో అఫిడవిట్లు సమర్పించారు. బీఆర్ఎస్ (BRS Party), కాంగ్రెస్ (Congress Party), ఇతర పార్టీ సీనియర్ నాయకులు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా తమ ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Malla Reddy) తనకు రూ.95 కోట్లకుపైగా ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. ఇంకా చదవండి
మరోసారి బాలినేని అలక- విజయసాయిరెడ్డిపై ఆగ్రహం!
మాజీ మంత్రి, వైసీపీ (YSRCP) సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. కనిగిరి(Kanigir) బస్సుయాత్రకు రానని, మీ పని మీరు చూసుకుంటే, ఒంగోలులో తన పనేదో తాను చేసుకుంటానని విజయసాయిరెడ్డి (Vijay sai Reddy)కి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మార్కాపురం టికెట్ ఆశిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి సైతం కనిగిరి పర్యటనకు దూరంగా ఉన్నారు. మార్కాపురంలో వైసీపీ సాధికార బస్సు యాత్రకు ఎంపీ విజయసాయిరెడ్డి, బాలినేని కలిసి ఒకే కారులో వెళ్లారు. శామ్యూల్ జార్జి కళాశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా చదవండి