Top Headlines Today: ఎన్డీఏకి పవన్ గుడ్‌బై చెప్పారా?; హైదరాబాద్‌లో ఐటీ సోదాలు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
జనసేన ఎన్డీఏకు గుడ్ బై చెప్పినట్లేనా ? పవన్ కల్యాణ్ చెప్పింది అదేనా ?
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానన్నట్లుగా పవన్ కల్యాణ్ పెడనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను సంచలనం అవుతున్నాయి. అయితే ఆ ప్రకటనలో క్లారిటీ లేదు. మళ్లీ వెంటనే బీజీపీ సహకరిస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ అధికారికంగా ఎన్డీఏలో ఉన్నారా.. బయటకు వచ్చారా అన్నది ప్రకటిస్తే మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంకా చదవండి
తెలంగాణ బీజేపీకి కొత్త కమిటీలు
తెలంగాణ ఎన్నికల కమిటీలను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 14 కమిటీలను నియమించారు. మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావు, యాజిటేషన్ కమిటీ చైర్మన్‌గా విజయ శాంతిని నియమించినట్లుగా ప్రకటించారు. నేతలందరినీ కమిటీల్లో సర్దుబాటు చేసింది. దాదాపుగా అందరికీ తలా ఓ పదవి వచ్చేలా ఈ కమిటీలను సిద్ధం చేశారు. ఒకరకంగా అసంతృప్తులను కూల్ చేసేందుకు ఈ కమిటీల్లో వారికి కీలక పదవులిచ్చారు. ఇంకా చదవండి
కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు వెళ్లనున్నారు. సీఎం జగన్ మూడు రోజులు పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులతో జగన్ సమావేశం కానున్నారు. రాత్రికి 1 జన్‌పథ్ నివాసంలో బస చేయనున్నారు. 6న ఉదయం 9.45 గంటలకు 1 జన్‌పథ్ నివాసం నుంచి విజ్ఞాన్ భవన్‌కు చేరుకుని వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఇంకా చదవండి
తెలంగాణలో ఏకపక్షంగా ఓట్లు తొలగించలేదు-సీఈసీ
తెలంగాణలో ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. 2022-23లో 22 లక్షల ఓట్లు తొలగించామన్న ఆయన...డెత్ సర్టిఫికెట్లు ఉన్న వాటినే ఓటర్ జాబితా నుంచి తొలగించామన్నారు. అప్లికేషన్ వచ్చిన తర్వాతే ఓటర్లను జాబితా నుంచి పేర్లు తొలగించామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాను ఎంతో పారదర్శకంగా రూపొందించినట్లు వెల్లడించారు. ఇంకా చదవండి
హైదరాబాద్‌లో 100 బృందాలతో ఐటీ సోదాలు
హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఇన్‌కం ట్యాక్స్ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. భారీ స్థాయిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా 100 బృందాలు నగరంలోని చాలా ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి. అక్టోబర్ 5వ తేదీ గురువారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. పలు చిట్ ఫండ్స్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జీవన్ శక్తి, ఈకామ్ సంస్థల్లోనూ దాడులు జరుగుతున్నాయి. సోమేపల్లి నాగేశ్వరీ, కృష్ణ ప్రసాద్, పూజ కృష్ణ, రమేష్ నాయుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సోదరుడు వజ్రనాథ్ తో పాటు, రఘువీర్, కోటేశ్వర్ రావు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా చదవండి