Hyderabad: హైదరాబాద్‌లో 100 బృందాలతో ఐటీ సోదాలు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఇంట్లోనూ దాడులు!
Hyderabad: హైదరాబాద్ నగరంలో భారీ స్థాయిలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
Hyderabad: హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఇన్‌కం ట్యాక్స్ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. భారీ స్థాయిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా 100 బృందాలు నగరంలోని చాలా ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి. అక్టోబర్ 5వ తేదీ గురువారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. పలు చిట్ ఫండ్స్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జీవన్ శక్తి, ఈకామ్ సంస్థల్లోనూ దాడులు జరుగుతున్నాయి. సోమేపల్లి నాగేశ్వరీ, కృష్ణ ప్రసాద్, పూజ కృష్ణ, రమేష్ నాయుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సోదరుడు వజ్రనాథ్ తో పాటు, రఘువీర్, కోటేశ్వర్ రావు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తమిళనాడు, తెలంగాణలోని 100 చోట్ల ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేపడుతున్నారు. చెన్నై లోని జగత్ రక్షకన్ ఆఫీస్ తో పాటు పలు హోటల్స్, హాస్పిటల్స్ లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. తమిళనాడులోని డీఎంకే ఎంపీ జగన్ రక్షకన్్ ఇంట్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 40 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
గతంలోనూ హైదరాబాద్ భారీ స్థాయిలో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇఫ్పుడు ఇంత భారీ స్థాయిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
గత జూన్ నెలలో హైదరాబాద్ లో ఐటీ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. 40 కోట్ల రూపాయల స్కామ్ ను ఐటీ అధికారులు బయట పెట్టారు. 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లు, రైల్వేలు, పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు ఆనాడు గుర్తించారు.