Janasena NDA : జనసేన ఎన్డీఏకు గుడ్ బై చెప్పినట్లేనా ? పవన్ కల్యాణ్ చెప్పింది అదేనా ?
జనసేన ఎన్డీఏకు గుడ్ బై చెప్పినట్లేనా ? పవన్ ఫ్లోలో అన్నారా ?
Janasena NDA : ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానన్నట్లుగా పవన్ కల్యాణ్ పెడనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను సంచలనం అవుతున్నాయి. అయితే ఆ ప్రకటనలో క్లారిటీ లేదు. మళ్లీ వెంటనే బీజీపీ సహకరిస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ అధికారికంగా ఎన్డీఏలో ఉన్నారా.. బయటకు వచ్చారా అన్నది ప్రకటిస్తే మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
టీడీపీతోనే కలిసి వెళ్తామని స్పష్టంగా ప్రకటించిన పవన్
రానున్న ఎన్నికలు జనసేన పార్టీకి చాలా కీలకం. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అసెంబ్లీలో అడుగు పెట్టడంతో పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకుంటే నిలదొక్కుకోవడం కష్టం. పార్టీపై ఎన్నో ఆకాంక్షలతో వచ్చిన నాయకులు, కార్యకర్తలను నిలుపుకోవాలంటే అనివార్యంగా శాసనసభలో ప్రాతినిధ్యం ఉండాలి. బీజేపీ ఎత్తుగడలను నమ్ముకుంటే జనసేన ఉనికికే ప్రమాదమని పవన్ కల్యాణ్ ఓ అంచనాకు వచ్చారు. ఇటీవల సభల్లో బీజేపీతో కలిసి వస్తే ఓట్లు వస్తాయి.. కానీ సీట్ల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయం పార్టీ విస్తృత సమావేశంలోనూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సందర్భం కలిసి రాగానే.. టీడీపీతోనే వెళ్తామని..బీజేపీ వస్తే ేమంచిదని ్ంటున్నారు.
బీజేపీ విషయంలో చంద్రబాబు విధానం ఏమిటి ?
తెలంగాణలో బీజేపీతో పొత్తు లేదని గతంలో ఢిల్లీలో చంద్రబాబు ప్రకటించారు. ఏపీ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. గతంలో బీజేపీ అగ్రనేతలు ఏపీకి వచ్చి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. చంద్రబాబు కూడా మోదీ విధానాలను సమర్థిస్తానన్నారు. కానీ ఎన్డీఏలో చేరికపై కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుత పరిణామాల కారణంగా ఎన్డీఏలో చేరిక అనే మాటే ఉండదని భావిస్తున్నారు. నిన్నమొన్నటిదాకా అటు జగన్.. ఇటు చంద్రబాబుతో బీజేపీ అధిష్టానం ఒకే రకంగా వ్యవహరించింది. కానీ జగన్ మోహన్ రెడ్డికే బీజేపీ ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని.. నిబంధనలకు మించి ఇస్తున్న అప్పులతో పాటు.. చంద్రబాబు అరెస్టు విషయంలో స్పందించకపోవడం కూడా కారణంగా భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు కూడా ఏపీలో బీజేపీ పొత్తు విషయంలో వీలైనంత దూరం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
బీజేపీపై పవన్, చంద్రబాబు కలిసి నిర్ణయం తీసుకుంటార ?
పవన్ కల్యాణ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని చెప్పారు కానీ.. బీజేపీ సహకరిస్తుదందని ఆశిస్తున్నానని చెబుతున్నారు. అంటే పవన్ ఉద్దేశంలో ఆ సహకారం ఎలా ఉంటుందో తెలియదు కానీ.. బీజేపీ విషయంలో చంద్రబాబు, పవన్ కలిసి ఓ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. వైసీపీతో బీజేపీ సఖ్యతగా ఉన్నంత కాలం ఆ పార్టీతో కలిసి పని చేసే అవకాశం ఉండదని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. అందుకే బీజేపీ కలసి వస్తుదంని చెబుతూ వస్తున్నారు. రెండు పార్టీల నిర్ణయం తర్వాత బీజేపీ విషయంలో ఏపీ రాజకీయాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.